Begin typing your search above and press return to search.

సాయిరెడ్డి గాలి తీసేసిన పాల్‌!

విజయసాయిరెడ్డి ఏర్పాటు చేసిన పరివర్తన రాజనీతి పార్టీపై కేఏ పాల్ విమర్శలు చేశారు. ఆ పార్టీని ‘అపరివర్తన అవినీతి పార్టీ’గా అభివర్ణించారు. నల్లధనం, అవినీతి సొమ్మును కాపాడుకోవడానికే కొత్త పార్టీ పెట్టారని ఆరోపించారు. సాయిరెడ్డి అక్రమ ఆస్తులను ప్రభుత్వానికి అప్పగించాలని డిమాండ్ చేశారు. జగన్ ఓట్లను చీల్చేందుకే ఆయనను రంగంలోకి దించారని పాల్ వ్యాఖ్యానించారు.

By:  Garuda Media   |   12 Nov 2026 3:47 PM IST
సాయిరెడ్డి గాలి తీసేసిన పాల్‌!
X

మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కొత్తగా ప‌రివ‌ర్త‌న రాజ‌నీతి పార్టీ(పీఆర్‌పీ) పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేయ డంపై శాంతి ప్ర‌బోధ‌కుడు, ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప‌రివ‌ర్త‌న ప్ర‌జ‌ల్లోను, యువ‌త‌లోనూ కాద‌ని.. అస‌లు ప‌రివ‌ర్త‌న ఏదైనా ఉంటే సాయిరెడ్డికే రావాల‌ని అన్నారు. దీనిని `అపరివర్తన అవినీతి పార్టీ`(ఏఏపీ)గా అభివ‌ర్ణించారు. విజయసాయి రెడ్డి పెట్టేది 'ప్రజా పరివర్తన పార్టీ' కాదన్నారు.

అది "అపరివర్తన అవినీతి పార్టీ" అని కేఏ పాల్ ఎద్దేవా చేశారు. నల్లధనం దాచుకోవడానికే కొత్త అవ‌తారం ఎత్తార‌ని దుయ్య‌బ‌ట్టారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పి, ఇప్పుడు దాచుకున్న నల్లధనాన్ని, అవినీతి సొమ్మును కాపాడుకోవడానికే సాయిరెడ్డి కొత్త పార్టీ పెట్టారని ఆరోపించారు. విజయసాయి రెడ్డి రూ.3 లక్షల కోట్లు దోచుకున్నార ని సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఆయ‌న వ‌చ్చి నీతులు చెబుతున్నార‌ని వ్యాఖ్యానించారు.

శ్రీకాకుళం నుంచి రాయలసీమ/హైదరాబాద్ వరకు సాయిరెడ్డి సంపాదించిన అక్రమ ఆస్తులన్నింటినీ ప్రభుత్వా నికి అప్పగించాలని పాల్‌ డిమాండ్ చేశారు. ఇంత పెద్ద స్థాయిలో ఆస్తులు ఉన్నప్ప‌టికీ సీబీఐ ఎందుకు దర్యాప్తు చేయడం లేదని ప్రశ్నించారు. జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసులోనూ సాయిరెడ్డి విచార‌ణ ఎదుర్కొంటున్నార‌ని.. కాబ‌ట్టి.. ప‌రివ‌ర్త‌న ఆయ‌నలోనే రావాల్సి ఉంటుంద‌న్నారు. విజయసాయి రెడ్డిని బీజేపీ ఏజెంట్‌గా అభివర్ణించారు.

వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఓట్లను చీల్చడానికే సాయిరెడ్డిని రంగంలోకి దించారని పాల్ విమర్శించారు. రాష్ట్రంలో దశాబ్దాలుగా ఒకే వర్గం నాయకులు ఏలుతున్నారని, 60 శాతానికి పైగా ఉన్న బీసీలు, 27 శాతం ఉన్న కాపులకు రాజకీయ అధికారం ఎప్పుడు వస్తుందని కేఏ పాల్ నిలదీశారు. ``సాయిరెడ్డి ఎవ‌రు వ‌దిలిన బాణం?. తెలుగు రాష్ట్రాల్లో ఆయ‌న‌కు భారీ ఆస్తులు ఉన్నాయి. వాటిని ప్ర‌జ‌ల‌కు పంచండి. అప్పుడు నీతులు చెప్పండి`` అని పాల్ త‌న‌దైన శైలిలో వ్యాఖ్యానించారు.

వైసీపీ మౌనం..

మ‌రోవైపు పీఆర్‌పీ అధ్య‌క్షుడి హోదాలో సాయిరెడ్డి వైసీపీపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. అలానే.. త‌న పాత బాస్ జ‌గ‌న్ పైనా నిప్పులు చెరిగారు. త‌న‌ను తీవ్రంగా వేధించార‌ని అన్నారు. అందుకే బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్టు తెలిపారు. ఇక‌, వైసీపీ నుంచి యువ నాయ‌కులు, అక్క‌డ గుర్తింపు లేద‌ని భావిస్తున్న నాయ‌కులు కూడా త‌న పార్టీలోకి రావాల‌ని సాయిరెడ్డి పిలుపునిచ్చారు. మ‌రి ఇంత జ‌రిగినా.. ఇన్ని వ్యాఖ్య‌లు చేసినా సాయిరెడ్డిపై వైసీపీ ప‌న్నెత్తు మాట అన‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.