మహిళా సీఎం...కవిత ఆశలు !
ఉమ్మడి ఏపీలోనూ అలాగే విభజన తరువాత రెండు తెలుగు రాష్ట్రాలలో మహిళా సీఎంలు అయితే లేరు, ఇప్పటిదాకా చూస్తే హిస్టరీ అదే చెబుతోంది.
By: Satya P | 20 Sept 2026 10:11 PM ISTఉమ్మడి ఏపీలోనూ అలాగే విభజన తరువాత రెండు తెలుగు రాష్ట్రాలలో మహిళా సీఎంలు అయితే లేరు, ఇప్పటిదాకా చూస్తే హిస్టరీ అదే చెబుతోంది. ఇక ఈ రోజున దేశంలో చూస్తే ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా బీజేపీ తరఫున ఒక్కరే కనిపిస్తున్నారు. పదిహేనేళ్ల పాటు సీఎం గా పశ్చిమ బెంగాల్ ని పాలించిన మమతా బెనర్జీ ఈ ఏడాది మేలో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలు అయ్యారు. తమిళనాడుని ఏలిన జయలలిత మరణించి పదేళ్ళు అయింది. యూపీలో మాయావతికి అధికారం దూరం అయితే దాదాపుగా రెండు దశాబ్దాలు అవుతోంది. ఈ రోజున దేశంలో చూస్తే మహిళా నాయకురాళ్ళ ఆద్వర్యంలో పార్టీలు కూడా తక్కువగా ఉన్నాయి. ఇక వారు ముఖ్యమంత్రులు కావడం అన్నది కూడా టఫ్ టాస్క్ గా కనిపిస్తోంది. ఈ నేపధ్యంలో తెలంగాణాలో ఒక మహిళగా కవిత తెలంగాణా రక్షణ సేన షార్ట్ కట్ లో టీఆర్ఎస్ పేరుతో ఒక పార్టీ పెట్టారు. తాను తెలంగాణకు తొలి మహిళా సీఎం అయి రికార్డు క్రియేట్ చేయాలని చూస్తున్నారు.
అతి పెద్ద ప్రయత్నంగా :
మహిళా ముఖ్యమంత్రులను ఈ దేశం చూసింది. కానీ అది బహు తక్కువ. ఎన్నో పోరాటాలు చేసిన మీదటనే జయలలిత, మాయావతి, మమతా బెనర్జీ సొంత పార్టీలతో సీఎంలు కాగలిగారు. ఇక రేఖా గుప్తా ని బీజేపీ ఎంపిక చేసింది. ఆ స్థాయిలో పోరాటాలు చేయగల సత్తా ఉంటే తెలంగాణాలో మహిళా సీఎం స్లాట్ లోకి కవిత వెళ్లగలదు, అయితే పైన చెప్పిన మహిళా ముఖ్యమంత్రులు అంతా అట్టడుగు స్థాయి నుంచి అనేక రకాలుగా పోరాటాలు చేసి తమకంటూ ఒక ఇమేజ్ సాధించారు. ఇక కవితలు ప్లస్ పాయింట్ అలాగే మైనస్ పాయింట్ కూడా తన పూర్వాశ్రమమే. కవిత కుమార్తెగానే ఈ రోజుకీ ఆమెకు గుర్తింపు ఉంది. ఆమె తనకంటూ ఒక సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంది. ఆ విషయంలో ఆమె ఇంకా చాలా అడుగులు వేయాల్సి ఉంది అన్నది ఒక కఠిమైన విశ్లేషణ.
వీరంతా కూడా :
ఇక ఉమ్మడి ఏపీలో చూస్తే మూడు దశాబ్దాల క్రితం తొలి మహిళా సీఎం గా ఒక దశలో లక్ష్మీ పార్వతి పేరు ఎక్కువగా ప్రచారంలోకి వచ్చింది. అది నిజంగా అయ్యే పనేనా అన్నది పక్కన పెడితే 1995 ప్రాంతంలో ఎక్కువగా మీడియాలో ఇదే ప్రచారం అవుతూ వచ్చింది. చివరికి లక్ష్మీపార్వతి పాతపట్నంలో జరిగిన ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా గెలిచి మూడేళ్ల పాటు అసెంబ్లీలో ఉండగలిగారు. ఆమె పెట్టిన పార్టీ కూడా తరువాత కాలంలో కనిపించలేదు. అలాగే సినీ రంగంలో లేడీ సూపర్ స్టార్ గా ఎంతో పేరు తెచ్చుకుని రాములమ్మగా జనం మెప్పు పొందిన విజయశాంతి తల్లి తెలంగాణా పేరుతో ఒక ప్రాంతీయ పార్టీని ప్రారంభించారు. ఆ సమయంలో ఆమెకు ఉన్న జనాదరణ ప్రత్యేక ఇమేజ్ తో కచ్చితంగా రాజకీయంగా గట్టిగానే నిలబడతారు అని అనుకున్నారు. కానీ ఆ పార్టీని తరువాత బీజేపీలో విలీనం చేయడం జరిగింది. 2022 ప్రాంతంలో వైఎస్ షర్మిల వైఎస్సార్ టీపీ పేరుతో ఒక ప్రాంతీయ పార్టీని స్థాపించి వందల కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు. ఆమె రెండేళ్ళ పాటు పార్టీని నడిపారు. అయితే 2023 చివరిలో ఆమె పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీ పీసీసీ చీఫ్ పదవిలో కుదురుకున్నారు.
పొలిటికల్ స్పేస్ ఉంటేనే :
ఇక్కడ ఒక విషయం ఉంది. రాజకీయాల్లో ఈ రోజుకీ అనేక కులాలు అలాగే వర్గాలకు ముఖ్యమంత్రి పదవి దక్కలేదు. అలాగే జెండర్ పరంగా చూస్తే మహిళలు జనాభాలో సగం ఉండి కూడా పాలకులు కాలేకపోతున్నారు. అయితే ఇవన్నీ ఎంత చెప్పుకున్నా పొలిటికల్ గా స్పేస్ అన్నది దొరకాలి. అలాగే జనాలకు చేరువ అయ్యేలా పార్టీలు ఉండాలి. అపుడే రాజకీయం పండుతుంది. రెండు పార్టీల వ్యవస్థ ఉన్న చోట ఎక్కువగా ఇది విజయవంతం అయింది. బహు ముఖమైన పోటీలు ఉన్న చోట అయితే టార్గెట్ ని ఎవరూ రీచ్ కాలేకపోతున్నారు. మహిళా ముఖ్యమంత్రులు కావాలి. అలాగే బీసీలతో పాటు ఇంకా అధికారం అందుకోని వారికి ముఖ్యమంత్రి పీఠం దక్కాలి. అయితే అది ఒక డిమాండ్ గానే మిగిలిపోకుండా ఆచరణాత్మకమైన పంధాలో సాగితేనే ఫలితాలు ఉంటాయని మేధావులు అంటున్నారు. కవిత ఆశలో తప్పు లేదు కానీ ఆచరణ అన్నదే చూడాలని అంటున్నారు.
