పాప్ సింగర్ తో మాజీ ప్రధాని రాసలీలలు.. షాకింగ్ వీడియో
ఒకప్పుడు రాజకీయ నాయకులు తమ వ్యక్తిగత జీవితాన్ని రహస్యంగా ఉంచుకునేవారు. నాలుగు గోడల మధ్య జరిగే విషయాలు ప్రజల ముందుకు రాకుండా చూసుకునేవారు
By: A.N.Kumar | 12 Oct 2025 3:58 PM ISTఒకప్పుడు రాజకీయ నాయకులు తమ వ్యక్తిగత జీవితాన్ని రహస్యంగా ఉంచుకునేవారు. నాలుగు గోడల మధ్య జరిగే విషయాలు ప్రజల ముందుకు రాకుండా చూసుకునేవారు. కానీ ఈరోజు రాజకీయాలు మారిపోయాయి. సోషల్ మీడియా యుగంలో నాయకులు తమ వ్యక్తిగత జీవితం కూడా బహిరంగం చేస్తూ నిరంతరం ప్రజల దృష్టిలో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ జాబితాలో కెనడా మాజీ ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో కూడా చేరిపోయాడు.
తాజాగా ట్రూడోకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలలో అతడు ప్రముఖ అమెరికా పాప్ సింగర్ కెటీ ఫెర్రీతో సరస సల్లాపాలలో మునిగి తేలుతున్నట్టు కనిపిస్తోంది. సముద్ర తీరంలో బోటులో విహార యాత్ర చేస్తూ, ఫెర్రీని ముద్దు పెడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ట్రూడో అర్ధనగ్నంగా కళ్ళకు గాగుల్స్ వేసుకుని ఉండగా, కెటీ ఫెర్రీ ఈత దుస్తుల్లో కనిపిస్తోంది. ఇద్దరూ సన్నిహితంగా ఆలింగనం చేసుకున్న ఫోటోలు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీశాయి.
జస్టిన్ ట్రూడో 2023లో తన భార్య సోఫీ గ్రెగోయర్ తో విడిపోయాడు. దాంతో అతడు ప్రస్తుతం ఒంటరిగానే జీవిస్తున్నాడు. అదే సమయంలో కెటీ ఫెర్రీ నటుడు ఓర్లాండో బ్లూమ్తో సుదీర్ఘ ప్రేమలో ఉంది. అయితే ఇటీవల వారి వివాహం వాయిదా పడింది. ఆ తర్వాత ఇద్దరూ వేరువేరుగా వెళ్లిపోయారు.
ఈ సమయంలోనే ట్రూడో , ఫెర్రీకి పరిచయం ఏర్పడినట్టు సమాచారం. ఆ పరిచయం క్రమంగా సన్నిహిత సంబంధానికి దారి తీసిందని అంతర్జాతీయ మీడియా చెబుతోంది. ప్రస్తుతం వారిద్దరూ ఒకరితో ఒకరు డేటింగ్‌లో ఉన్నారని, కలిసి ప్రయాణాలు చేస్తూ కనిపిస్తున్నారని సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
ట్రూడో గతంలో భారత్‌పై చేసిన వ్యాఖ్యలతో పెద్ద వివాదం రేపాడు. భారత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన ఆయనకు ఆ తర్వాత కెనడాలోనే వ్యతిరేకత పెరిగింది. చివరికి తన ప్రధానమంత్రి పదవిని కూడా కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆయన వ్యక్తిగత జీవితం మరోసారి వార్తల్లో నిలుస్తోంది.
ఈ ఘటనతో సోషల్ మీడియా రెండు వర్గాలుగా విడిపోయింది. కొందరు “ఇది ఆయన వ్యక్తిగత జీవితం” అని అంటుండగా, మరికొందరు “మాజీ ప్రధానమంత్రి స్థాయికి తగని ప్రవర్తన” అంటూ విమర్శిస్తున్నారు. ఏదేమైనా, ట్రూడో–ఫెర్రీ జంట ప్రస్తుతం అంతర్జాతీయ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
మొత్తం మీద, రాజకీయాల నుంచి కొంత విరామం తీసుకున్న ట్రూడో ప్రస్తుతం “లవ్ లైఫ్”లో మునిగిపోయినట్టే కనిపిస్తున్నాడు.
