పాప్ సింగర్ తో ప్రేమాయణం నడుపుతున్న మాజీ ప్రధాని.. ప్రపంచంలో తీవ్ర చర్చ..
ఒకప్పుడు ప్రపంచ రాజకీయాల్లో మోస్ట్ హ్యాండ్సమ్ ప్రధానిగా గుర్తింపు తెచ్చుకున్న జస్టిన్ ట్రూడో.. ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టినట్లు కనిపిస్తోంది.
By: Tupaki Political Desk | 13 April 2026 2:44 PM ISTఒకప్పుడు ప్రపంచ రాజకీయాల్లో మోస్ట్ హ్యాండ్సమ్ ప్రధానిగా గుర్తింపు తెచ్చుకున్న జస్టిన్ ట్రూడో.. ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టినట్లు కనిపిస్తోంది. అది కూడా అమెరికన్ పాప్ ఐకాన్ కేటీ పెర్రీతో అంటే, ఇక సోషల్ మీడియా ఊరుకుంటుందా? వీరిద్దరి ‘డేట్ నైట్’ ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి.
ప్రేయసితో ట్రూడో
రాజకీయాల్లో ఎంతటి ఒడిదుడుకులు ఎదురైనా, తన గ్లామర్‌ను ఏమాత్రం తగ్గనివ్వని జస్టిన్ ట్రూడో, ఇప్పుడు పాప్ మ్యూజిక్ ప్రపంచంలో సందడి చేస్తున్నారు. కాలిఫోర్నియాలో జరిగిన సంగీత ఉత్సవంలో కేటీ పెర్రీతో కలిసి ఆయన కనిపించడం ఒక ఎత్తైతే, ఆ ఫోటోలను స్వయంగా కేటీ పెర్రీ షేర్ చేయడం మరో ఎత్తు. దీంతో వీరిద్దరి రిలేషన్‌షిప్‌పై వస్తున్న వార్తలకు దాదాపుగా అధికారిక ముద్ర పడింది.
విడాకుల తర్వాత..
18 ఏళ్ల వైవాహిక బంధం తర్వాత 2023లో భార్య సోఫీ గ్రెగొరీకి విడాకులిచ్చిన ట్రూడో, కొంత కాలం పాటు ఒంటరిగానే ఉన్నారు. అదే సమయంలో ఓర్లాండో బూమ్ నుంచి విడిపోయిన కేటీ పెర్రీకి, ట్రూడోకు మధ్య ఏర్పడిన పరిచయం ఇప్పుడు ప్రేమగా మారినట్లు తెలుస్తోంది. మాంట్రియాల్ రెస్టారెంట్ నుంచి లగ్జరీ నౌకల వరకు వీరి ప్రయాణం ఇప్పుడు కాలిఫోర్నియా సంగీత ఉత్సవాలకు చేరుకుంది.
రాజకీయల నుంచి..
దశాబ్ద కాలం పాటు కెనడాను పాలించిన ట్రూడో, గతేడాది తన పదవికి రాజీనామా చేశారు. అధికారం నుంచి తప్పుకున్నాక ఆయన తన వ్యక్తిగత అభిరుచులకు, ప్రయాణాలకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఒక మాజీ ప్రధాని ఇలా గ్లామర్ ప్రపంచానికి చెందిన స్టార్‌తో చెట్టాపట్టాల్ వేసుకొని తిరగడం పాశ్చాత్య మీడియాలో 'టాక్ ఆఫ్ ద టౌన్' గా మారింది.
సోషల్ మీడియాలో సెన్సేషన్
జస్టిన్ బీబర్ పెర్ఫార్మెన్స్ సమయంలో ఈ జంట అత్యంత సన్నిహితంగా మెలిగినట్లు వీడియోలు చెబుతున్నాయి. కేటీ పెర్రీ తన సోషల్ మీడియాలో ట్రూడోతో ఉన్న ఫోటోలను పోస్ట్ చేయడంతో, అభిమానులు ‘ప్రపంచంలోనే అత్యంత అందమైన జంట’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే వీరిద్దరూ తమ సంబంధంపై ఇప్పటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం గమనార్హం.
అంతర్జాతీయ మీడియాలో చర్చ
ట్రూడో-పెర్రీల ఈ సాన్నిహిత్యం కేవలం గాసిప్ కాలమ్స్‌కే పరిమితం కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో రాజకీయ, సామాజిక విశ్లేషణలకు దారితీస్తోంది. సాధారణంగా దేశాధినేతలు పదవిలో ఉన్నప్పుడు లేదా పదవీ విరమణ తర్వాత చాలా సంప్రదాయబద్ధంగా, రిజర్వుడ్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తారు. కానీ ట్రూడో తన ‘లిబరల్’ ఇమేజ్‌కు తగ్గట్టుగానే, తన వ్యక్తిగత ఆనందాన్ని పబ్లిక్ ప్లాట్‌ఫామ్స్‌పై ప్రదర్శించడానికి ఏమాత్రం వెనుకాడడం లేదు. ఒక పాప్ స్టార్‌తో కలిసి మ్యూజిక్ ఫెస్టివల్స్‌లో సందడి చేయడం ద్వారా, ఆయన తనలోని ‘సాధారణ మనిషి’ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రాజకీయాలు, సరిహద్దులు దాటి ఒక మాజీ దేశాధినేత, ఒక పాప్ సింగర్ ప్రేమలో పడటం వినడానికి ఒక సినిమా కథలా ఉన్నా, ఇది ప్రస్తుతం పశ్చిమ దేశాల్లో హాట్ టాపిక్. జస్టిన్ ట్రూడో తన జీవితంలోని ఈ రెండో ఇన్నింగ్స్‌ను ఎంతలా ఎంజాయ్ చేస్తున్నారో ఈ ఫోటోలే చెబుతున్నాయి. మరి ఈ జంట త్వరలోనే తమ బంధాన్ని పెళ్లి పీటల వరకు తీసుకెళ్తుందో లేదో చూడాలి.
