Begin typing your search above and press return to search.

'జూరాల నిర‌స‌న'.. అస్ట‌దిగ్బంధం

బీఆర్ఎస్ నాయ‌కులు త‌ల పెట్టిన జూరాల ప్రాజెక్టు సంద‌ర్శ‌న, చేప‌ట్టాల‌ని భావించిన నిర‌స‌న ఆదిలోనే ముగిసి పోయాయి. జూరాల‌కు వెళ్లాల‌ని భావించిన నాయ‌కుల‌ను పోలీసులు ఎక్క‌డిక‌క్క‌డ అరెస్టు చేశారు.

By:  Garuda Media   |   21 Sept 2026 9:50 PM IST
జూరాల నిర‌స‌న.. అస్ట‌దిగ్బంధం
X

బీఆర్ఎస్ నాయ‌కులు త‌ల పెట్టిన జూరాల ప్రాజెక్టు సంద‌ర్శ‌న, చేప‌ట్టాల‌ని భావించిన నిర‌స‌న ఆదిలోనే ముగిసి పోయాయి. జూరాల‌కు వెళ్లాల‌ని భావించిన నాయ‌కుల‌ను పోలీసులు ఎక్క‌డిక‌క్క‌డ అరెస్టు చేశారు. ముఖ్యంగా మాజీ మంత్రుల‌ను ఇళ్ల‌లోనే నిర్బంధించారు. జూరాల ప‌ర్య‌ట‌న‌కు అనుమ‌తి లేద‌ని.. సెక్ష‌న్ 30 అమ‌లు చేస్తున్నామ‌ని నాయ‌కుల‌కు తేల్చి చెప్పారు. దీంతో నాయ‌కులు మెజారిటీ సంఖ్య‌లో ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రాలేని ప‌రిస్థితి నెల‌కొంది. అయితే.. కొంద‌రు నాయ‌కులు మాత్రం పోలీసుల ఆంక్ష‌ల‌ను త‌ప్పించుకుని జూరాల‌కు చేరుకునే ప్ర‌య‌త్నం చేశారు. కానీ, పోలీసులు మ‌ధ్య‌లోనే అడ్డుకున్నారు.

ఈ సంద‌ర్భంగా పోలీసులు, నాయ‌కుల‌కు మ‌ధ్య వివాదం రేగింది. తోపులాట‌లు కూడా చోటు చేసుకున్నాయి. అయితే.. అస‌లు.. జూరాల ప‌ర్య‌ట‌నకు బీఆర్ఎస్ నాయ‌కులు ఎందుకు వెళ్లార‌న్న‌ది ప్ర‌శ్న‌. జూరాల ప్రాజెక్టులో ప్ర‌స్తుతం 9 టీఎంసీల నీరు ఉంది. కానీ.. దీని ప‌రిధిలో సాగు చేస్తున్న రైతుల‌కు స‌ర్కారు నీరు విడుద‌ల చేయ‌డం లేద‌ని బీఆర్ఎస్ నాయ‌కులు ఆరోపిస్తున్నారు. ఇదిలావుంటే.. రెండు రోజ‌లు కింద‌ట ఈ నీటిని స్వ‌యంగా విడుద ల చేసుకునేందుకు రైతులు ప్ర‌య‌త్నించారు. ఇది వివాదంగామారింది.

జూరాల ప్రాజెక్టుపైకి ఎక్కిన కొంద‌రు రైతులు.. గేట్లు ఎత్తేందుకు ప్ర‌య‌త్నించారు. దీంతో పోలీసులు స‌ద‌రు రైతు ల‌పై కేసులు పెట్టి అదుపులోకి తీసుకున్నారు. ఈ నేప‌థ్యంలోనే రైతుల‌కు అండ‌గా ఉండేందుకు బీఆర్ ఎస్ జూరాల సంద‌ర్శ‌న‌కు పిలుపునిచ్చింది. జూరాల ప్రాజెక్టులో నీరు ఉన్నా.. రైతులకు ఇవ్వ‌కుండా అడ్డు ప‌డుతు న్నార‌ని సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రైతుల‌కు బాస‌ట‌గా నిలిచేందుకు చేప‌ట్టిన కార్య‌క్ర‌మాన్ని సైతం అడ్డుకున్నార‌ని.. ఇది నిరంకుశ‌వైఖ‌రికి నిద‌ర్శ‌న‌మ‌ని అన్నారు.

ప్ర‌భుత్వ వాద‌న ఏంటి?

జూరాల‌లో నీరు ఉండికూడా.. రైతుల‌కు విడుద‌ల చేయ‌క‌పోవ‌డంపై స‌ర్కారు కూడా స్పందించింది. ప్ర‌స్తుత సీజ‌న్‌లో ఇవ్వాల్సిన నీటి కంటే ఎక్కువ‌గానే విడుద‌ల చేశామ‌ని.. మిగిలిన 9 టీఎంసీల నీటిని ప్ర‌జ‌లు తాగునీటి అవ‌స‌రాల‌కు వినియోగించాల్సి ఉంటుంద‌ని.. పేర్కొంది. రైతులు వ‌ద్ద‌న్నా.. కొన్ని పంట‌ల‌ను వేశార‌ని మంత్రి ఒక‌రు వ్యాఖ్యానించారు. రైతుల‌ను బీఆర్ఎస్ నాయ‌కులు రెచ్చ‌గొడుతున్నార‌ని..రాజ‌కీయల‌బ్ధి పొందేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఎదురు దాడి చేయ‌డం గ‌మ‌నార్హం.