Begin typing your search above and press return to search.

జూబ్లీ ఎన్నికల హీట్ లో ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్

తెలంగాణా రాష్ట్రంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక హీటెక్కించేస్తోంది. ఈ ఉప ఎన్నికలో గెలిచి తీరాలని ప్రధాన పార్టీలు ఎంతో తపన పడుతున్నాయి.

By:  Satya P   |   9 Nov 2025 6:54 PM IST
జూబ్లీ ఎన్నికల హీట్ లో ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్
X

తెలంగాణా రాష్ట్రంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక హీటెక్కించేస్తోంది. ఈ ఉప ఎన్నికలో గెలిచి తీరాలని ప్రధాన పార్టీలు ఎంతో తపన పడుతున్నాయి. అధికార కాంగ్రెస్ కి అయితే ఇది అగ్ని పరీక్షగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగానే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అదే టైం లో బీఆర్ఎస్ బీజేపీ కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. ఓట్ల వేటలో ఎవరికి వారు ఫుల్ బిజీ అయ్యారు. వ్యూహాలు కూడా ఎవరికి వారిని ఉంటున్నాయి.

ఒక్క ట్వీట్ తో :

ఇక కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా టాలీవుడ్ టాప్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి ఎంతో మంది ప్రముఖుల నుంచి ట్వీట్లు వచ్చాయి. జూనియర్ కూడా సోషల్ మీడియా ద్వారా ట్వీట్ వేసి మరీ శుభాకాంక్షలు చెప్పారు. అయితే దానికి జవాబుగా థాంక్స్ అన్న పొడి మాటలతో రేవంత్ రెడ్డి అధికార ట్విట్టర్ హ్యాండిల్ నుంచి రెస్పాన్స్ రావడం పట్ల జూనియర్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ హీరో ట్వీట్ కి ఈ విధంగానా సింపుల్ గా రిప్లై చేస్తారా అని వారు ఆవేదన చెందుతున్నారు. నిజానికి చూస్తే తెలుగుదేశం నేతగా రేవంత్ రెడ్డి ఉన్నపుడు జూనియర్ ఎన్టీఆర్ కి ఆయనకు మధ్య మంచి రిలేషన్ ఉంది. అయితే ప్రముఖుల ట్విట్టర్ హ్యాండిల్స్ ని పీఅర్ టీం చూస్తుంది. అయినా సరే కొన్ని విషయాలలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇలాగే అపార్ధాలు వస్తాయని అంటున్నారు. జూనియర్ ఫ్యాన్స్ అయితే దీని మీద గుస్సా అవడంతో ఈ పరిణామం సోషల్ మీడియాలో చర్చకు తావిస్తోంది.

ఎన్నికల వేళ :

అసలే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల వేళ ఒక ప్రముఖ హీరో ఫ్యాన్స్ ఈ విధంగా హర్ట్ అవుతున్నారు అంటే అది ఎంతో కొంత ఇబ్బందిగా ఉంటుందా అన్న చర్చ కూడా సాగుతోంది. మరో వైపు చూస్తే ఏపీకి చెందిన ఉప ముఖ్యమంత్రి సినీ స్టార్ అయిన పవన్ కళ్యాణ్ మద్దతు తమకే అని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ చెప్పుకుంటోంది. ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రి సంజయ్ అయితే ఏకంగా బహిరంగ సభలలోనే పవన్ మన వారే కదా సినీ హీరో కదా ఆయన సనాతన ధర్మానికి కట్టుబడి ఉన్నారు కదా అని చెబుతూ జనసేన ఓట్లు అన్నీ బీజేపీకే అన్నట్లుగా చెబుతున్నారు.

మద్దతు ఇచ్చిందిగా :

ఏపీలో ఎన్డీయే కూటమిలో టీడీపీ జనసేన బీజేపీ ఉన్నాయి. ఈ మూడు పార్టీలు కలసి అధికారంలోకి వచ్చాయి. అంతే కాదు ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్నాయి. జూబ్లీ హిల్స్ ఎన్నికల వేళ తెలంగాణా జనసేన నాయకులు అయితే బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ మద్దతు మనకే అని కేంద్ర మంత్రి క్లెయిం చేసుకోవడం మరింత ఎక్కువగా దానిని ప్రచారంలోకి పెట్టడంతో బీజేపీ మార్క్ పాలిటిక్స్ గురించి అంతా చర్చిస్తున్నారు ఒక వైపు ఒక్క ట్వీట్ విషయంలో జూనియర్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్న నేపధ్యం ఉంటే మరో వైపు పవన్ మద్దతు విషయం బీజేపీ ప్రచారంలోకి తేవడంతో జూబ్లీ ఎన్నికల హీట్ లో ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ వైఖరి ఎలా ఉండబోతోంది అన్నది కొత్త చర్చకు దారి తీస్తోంది.