సీఎం నివాసం దగ్గర లేడీ స్నాచర్ హల్ చల్
స్కూటీపై వచ్చిన ఒక జంట వాహనాన్ని నడుపుకుంటూ వెళుతూ... రోడ్డు మీద నడుస్తున్నయువతి మెడలోని బంగారు గొలుసు తెంపుకొని పరారయ్యాడు.
By: Garuda Media | 18 Feb 2026 11:00 AM ISTఅది అత్యంత భద్రతా వ్యవస్థ.. నిఘా వర్గాలు ఉండే ప్రాంతం. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత వీవీఐపీ జోన్ గా వ్యవహరిస్తారు. భద్రతా సిబ్బంది డేగల్లా కాపలా కాస్తుంటారు. అలాంటి వీవీఐపీ జోన్ లో ఒక లేడీ స్నాచర్.. స్కూటీ మీద వెళుతూ స్నాచింగ్ కు పాల్పడిన ఉదంతం సంచలనంగా మారింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారిక నివాసానికి దగ్గర్లో.. లేడీ స్నాచర్ ఒకరు చేసిన పని ఇప్పుడు షాకింగ్ గా మారింది.
జూబ్లీహిల్స్ లోని వీవీఐపీ జోన్ పరిధిలో స్నాచింగ్ చోటు చేసుకోవటం కలకలాన్ని రేపింది. స్కూటీపై వచ్చిన ఒక జంట వాహనాన్ని నడుపుకుంటూ వెళుతూ... రోడ్డు మీద నడుస్తున్నయువతి మెడలోని బంగారు గొలుసు తెంపుకొని పరారయ్యాడు. ఈ ఘటన సీఎం రేవంత్ నివాసానికి దగ్గర్లో ఉండటం గమనార్హం. మాదాపూర్ లోని ఒక హాస్టల్ లో ఉండే ఒక ఐటీ ఉద్యోగి ఆఫీసులోకి వెళ్లేందుకు రోడ్డు నెంబరు 46 నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా.. వెనేుక నుంచి వచ్చిన స్కూటీలోని ఒక జంట యువతి మెడలోని బంగారు గొలుసును తెంచుకుంటూ వెళ్లిపోయారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సీసీ కెమేరా ఫుటేజ్ పరిశీలించారు. చైన్ స్నాచర్ మహిళగా పోలీసులు గుర్తించారు. స్కూటీ నడుపుతున్నది యువకుడైతే.. చైన్ స్నాచింగ్ కు పాల్పడింది మహిళ అన్న విషయాన్ని గుర్తించిన పోలీసులు అవాక్కైన పరిస్థితి. సీఎం నివాసానికి దగ్గర్లో చోటు చేసుకున్న ఈ ఘటనను పోలీసులు సీరియస్ గా తీసుకొని స్నాచర్ ఆచూకీని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.
