జూబ్లీహిల్స్: బెట్టింగ్ రాయుళ్లు వెనక్కి.. రీజనేంటి?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ చూచాయగా బెట్టింగ్ రాయుళ్ల వ్యవహారం గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేసింది.
By: Garuda Media | 15 Oct 2025 6:00 PM ISTజూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ చూచాయగా బెట్టింగ్ రాయుళ్ల వ్యవహారం గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. కేవలం క్రికెట్ మాత్రమేకాదు.. రాజకీయాలు.. నాయకులపై కూడా బెట్టిం గులు కడుతున్న పరిస్థితి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉంది. గత ఏపీ ఎన్నికలలో పవన్ కల్యాణ్ మెజా రిటీపై బెట్టింగులు కట్టి నష్టపోయిన వారు, లాభపడిన వారు కూడా ఉన్నారు. అదేవిధంగా మంగళగిరిలో నారా లోకేష్ విజయంపైనా జోరుగానే బెట్టింగుల పర్వం నడిచింది.
ఈ క్రమంలో తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై కూడా బెట్టింగు రాయుళ్లు దృష్టి పెట్టారని రెండు రోజు లుగా సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి. అయితే.. ఇవన్నీ.. ఎన్నికల వేడిని పెంచేందుకు జరిగిన ప్రచారాలుగా కూడా ఉన్నాయన్న వాదన వినిపించింది. ఇక, తాజాగా ఈ విషయంలో బెట్టింగు రాయుళ్లు వెనక్కి తగ్గినట్టు సమాచారం. ప్రధానంగా పోలీసులు ముమ్మరంగా నిఘా పెట్టడంతోపాటు.. బలమైన పోటీ కూడా లేకుండా పోయిందన్న వాదన వినిపిస్తోంది.
వాస్తవానికి పోలీసుల నిఘా ఎలా ఉన్నా.. బెట్టింగురాయుళ్లు తమ హవా చలాయిస్తూనే ఉన్నారు. కానీ, తా జా జూబ్లీహిల్స్ పోరులో మూడు రాజకీయ పార్టీల మధ్య కూడా బలమైన పోటీ ఎక్కడా కనిపించడం లేదు. బీఆర్ ఎస్ అభ్యర్థి మాగంటి సునీత విజయంపై దాదాపు అందరూ నమ్మకంతోనే ఉన్నారన్న చర్చ జోరం దుకుంది. ఇటు అధికార పార్టీ తరఫున కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ బరిలో నిలిచినా.. ఆయన గెలుపు పై ఎవరూ అంచనాలకు రాలేక పోతున్నారు. పోటీ ఇచ్చినా.. అది గెలుపు గుర్రం ఎక్కేస్థాయిలో ఉండక పోవచ్చని అంటున్నారు.
ఇక, బీజేపీ తరఫున ప్రకటించిన అభ్యర్థి లంకల దీపక్ రెడ్డిని ప్రకటించిన తర్వాత.. మాగంటి శిబిరంలో మరింత ఉత్సాహం పెరిగింది. ఎందుకంటే.. దీపక్ పెద్దగా పోటీ ఇచ్చే క్యాండేట్ కాదు. పైగా.. గత ఎన్నికల్లో ఆయనకు డిపాజిట్‌కూడా దక్కలేదు. సో.. ఈ పరిణామాలతో అటు బెట్టింగు రాయుళ్లు కూడా సైలెంట్ అయిపోయారని అంటున్నారు. ఎలానూ సెంటిమెంటే పనిచేయనుందన్న సంకేతాలతోపాటు.. మహిళా ఓటు బ్యాంకు కూడా మాగంటికి అనుకూలంగా పడుతుందన్న చర్చ సాగుతోంది. ఫలితంగా పెద్దగా ఊహించుకున్నప్పటికీ.. జూబ్లీహిల్స్ ఉప పోరు ఏకపక్షంగానే సాగుతుందని పరిశీలకులు చెబుతున్నారు.
