పబ్లిక్ ట్రాన్స్ పోర్టులో ఎంత వరకు డబ్బు తీసుకెళ్లచ్చు..
జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ మెట్రో స్టేషన్‌లో బుధవారం జరిగిన ఒక చిన్న విషయం ప్రస్తుతం ఆలోచనలోకి నెట్టింది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో భారీ నగదు అనుమతించరు.
By: Tupaki Political Desk | 2 Oct 2025 2:48 PM ISTఇప్పుడంటే యూపీఐలు, ట్రాన్‌జెక్షన్లలో వేగం ఉంది.. కానీ దాదాపు పదేళ్ల కింద పరిశీలిస్తే బ్యాంకింగ్ రంగం ఇంత డెవలప్ కాలేదు. ఒక బిజినెస్ మ్యాన్ లక్షల రూపాలను ఒక చోటు నుంచి మరో చోటుకి తీసుకెళ్లేవారు. ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ వెళ్లలేని చోటుకి పబ్లిక్ ట్రాన్స్ పోర్టులో కూడా తీసుకెళ్లేవాడు. అయితే ఇటీవల బూబ్లిహిల్స్ మెట్రో స్టేషన్ లో ఒక ఘటన జరిగింది. రూ. 3.5 లక్షలు కలిగి ఉన్న ఒక వ్యక్తిని మెట్రో సిబ్బంది ప్రయాణానికి అనుమతించలేదు తిప్పిపంపించేశారు. ఈ ఘటన తర్వాత ప్రజలకు ఈ విషయం గురించి తెలుసుకోవాలన్న జిజ్ఞాస పెరిగింది.
జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ మెట్రో స్టేషన్‌లో ఘటన..
జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ మెట్రో స్టేషన్‌లో బుధవారం జరిగిన ఒక చిన్న విషయం ప్రస్తుతం ఆలోచనలోకి నెట్టింది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో భారీ నగదు అనుమతించరు. ఒక వేళ తీసుకెళ్తున్న సమయంలో పట్టుకుంటే ఎలా స్పందించాలన్నది తెలుసుకోవాలి. రిజర్వ్ బ్యాంకు నిబంధనల ప్రకారం ప్రభుత్వ ట్రాన్స్ పోర్టులో కేవలం రూ. 2 లక్షల వరకే అనుమతిస్తారు.
భద్రతకు విఘాతం కలుగచ్చు..
ప్రజలు పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్లడం భద్రతకు విఘాతం కల్పించే అవకాశం కలుగుతుంది. మెట్రో, ఎయిర్‌పోర్ట్‌లు, రైల్వే స్టేషన్లు వంటి హబ్‌ల వద్ద నగదు కనిపిస్తే అది మనీ లాండరింగ్ లేదా అక్రమ లావాదేవీల సంకేతంగా కూడా పరిగణింపబడుతుందట. అందుకే రెగ్యులేటరీ పరిమితులు అమల్లో ఉన్నాయి.
భద్రతా తనిఖీలు మాత్రమే కాదు ప్రయాణికుల స్వీయ జాగ్రత్త కూడా ముఖ్యమైంది. భారీ నగదుతో ప్రయాణించవలసి వస్తే బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ డిమాండ్ డ్రాఫ్ట్, యూపీఐ వంటి ఆధునిక, సురక్షిత మార్గాలు ఉపయోగించడం మంచిది. డిజిటల్ పద్ధతులు మీకు మాత్రమే కాకుండా వ్యవస్థకు కూడా న్యాయం చేస్తాయి.
ప్రభుత్వ అవగాహన అవసరం..
ప్రభుత్వం ఈ విషయాలపై స్పష్టమైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. స్టేషన్‌లలో సూచికా బోర్డులను ఏర్పాటు చేయాలి. మెట్రో ప్రయాణం అనేది వేగవంతమైన, సురక్షితమైనదిగా ఉంది. కానీ అదే ప్రమాదానికి కారణమైతే ఎలా అన్న సందేహం ప్రయాణీకులకు కలిగేలా చేయాలి. ప్రజలు కూడా చదివి, తెలుసుకొని, డిజిటల్ మార్గాల్లోనే పెద్ద చెల్లింపులను నిర్వహించాలి.
