జూబ్లీ హీట్ : ఎంపీ ఓట్లే బీజేపీ ఆశలు పెంచుతున్నాయా ?
జూబ్లీ హిల్స్ లో అధికార కాంగ్రెస్ విపక్ష బీఆర్ ఎస్ ల గురించే ఎక్కువగా చర్చ సాగుతోంది. అదే సమయంలో మూడవ పార్టీగా బీజేపీ ఉంది. ఆ పార్టీ 2023 ఎన్నికల్లో పోటీ చేసిన దీపక్ రెడ్డికే తిరిగి టికెట్ ఇచ్చింది.
By: Satya P | 2 Nov 2025 5:00 AM ISTజూబ్లీ హిల్స్ లో అధికార కాంగ్రెస్ విపక్ష బీఆర్ ఎస్ ల గురించే ఎక్కువగా చర్చ సాగుతోంది. అదే సమయంలో మూడవ పార్టీగా బీజేపీ ఉంది. ఆ పార్టీ 2023 ఎన్నికల్లో పోటీ చేసిన దీపక్ రెడ్డికే తిరిగి టికెట్ ఇచ్చింది. నిజానికి 2023లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన అజారుద్దీన్ కి ఈసారి టికెట్ ఇవ్వలేదు, అక్కడ అభ్యర్ధి మారారు, బీఆర్ఎస్ విషయం తీసుకుంటే మాగంటి గోపీనాధ్ ఫ్యామిలీ నుంచి సతీమణి సునీత పోటీలో ఉన్నా అక్కడా అభ్యర్ధి మారినట్లే. దాంతో తామే పాత అభ్యర్ధితో బరిలో ఉన్నామని తమకు అన్నీ కలసి వచ్చే అంశాలే అని బీజేపీ అంటోంది.
డమ్మీ కాదు సౌండే :
బీజేపీని డమ్మీ పార్టీగా కాంగ్రెస్ విమర్శిస్తోంది. మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే బీజేపీకి పెద్దగా ఓట్లు వచ్చేది లేదు ఆ పార్టీ ప్రభావమే లేదని తేల్చేస్తున్నారు. అయితే దీని మీదనే బీజేపీ పెద్దలు మండిపడుతున్నారు. తమ పార్టీ డమ్మీ ఏ మాత్రం కాదని రీ సౌండ్ ఏంటో చూపిస్తామని అంటున్నారు 2023 ఎన్నికల్లో ఇరవై ఆరు వేల ఓట్లు వచ్చాయని గుర్తు చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిందని ఇపుడు గెలుస్తామని ఆ పార్టీ అంటూంటే తాము ఎందుకు గెలవమని బీజేపీ గట్టిగా మాట్లాడుతోంది.
ఎంపీ లెక్కలు పక్కా :
బీజేపీ అయితే తమ పార్టీకి ఎమ్మెల్యే ఎన్నికల్లో తక్కువ ఓట్లే రావచ్చు కానీ 2024లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో ఏకంగా 64 వేల ఓట్లు జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో వచ్చాయని గుర్తు చేస్తున్నారు ఈ ఓటింగే తకకు పర్మనెంట్ అని ఇదే రిపీట్ అవుతుందని చెబుతున్నారు. 2024లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మూడవ ప్లేస్ లోకి వెళ్ళిందని కూడా చెబుతున్నారు. కాంగ్రెస్ రెండవ స్థానంలో ఉందని ఈసారి కూడా అదే జరుగుతుందని తమ అభ్యర్థి దీపక్ రెడ్డి గెలిచి చూపిస్తారు అని అంటున్నారు.
చీల్చుడు వారే :
ఇక జూబ్లీ హిల్స్ లో తమకు పాజిటివ్ వేవ్ ఉందని బీజేపీ నేతలు అంటున్నారు. మైనారిటీ ఓట్లు ఈ నియోజకవర్గంలో ఉంటే వాటిని కాంగ్రెస్ బీఅర్ఎస్ చీల్చుకుంటాయని ఇక మిగిలిన సంప్రదాయ ఓట్లలో అత్యధిక శాతం బీజేపీకే పడతాయని ఆ విధంగా తాము గెలిచి చూఇస్తామని పార్టీ నేతలు అంటున్నారు. ఇక లోక్ సభ ఎన్నికల నాటి నుంచే ట్రెండ్ మారిదని పైగా నియోజకవర్గంలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయని అవే బీజేపీని గెలిపిస్తాయని అంటున్నారు. మరి బీజేపీ ధీమా గెలుస్తుందా ఆ పార్టీ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో విజయం సాధిస్తుందా లేక ఈ మాటలు అన్నీ తమ ఓట్లను మరింతగా పెంచుకోవడానికేనా అన్న చర్చ ఉంది బీజేపీకి ఎన్ని ఓట్లు పెరిగితే ఆ ఓట్లు కాంగ్రెస్ బీఆర్ఎస్ ల నుంచి ఎవరిని చీలుస్తాయన్నది కూడా మరో చర్చ. మొత్తానికి కమలం పార్టీ అయితే ఆ రెండు పార్టీలను కలవరపెడుతోంది అని అంటున్నారు.
