Begin typing your search above and press return to search.

జూబ్లీహిల్స్ లో ఏ సామాజికి వర్గానికి ఎన్ని ఓట్లు?

మొత్తం ఓటర్లు 4 లక్షలకు పైనే ఉన్నారు. వీరిలో 30 శాతం మంది అంటే.. లక్షా పది వేలకు పైనే మైనార్టీ ఓటర్లు ఉన్నారు.

By:  Garuda Media   |   9 Nov 2025 11:15 AM IST
జూబ్లీహిల్స్ లో ఏ సామాజికి వర్గానికి ఎన్ని ఓట్లు?
X

రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలు మహా ఉత్కంటగా ఎదురుచూస్తున్న జబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కీలకమైన పోలింగ్ మంగళవారం జరగనున్న విషయం తెలిసిందే. కౌంట్ డౌన్ చివరకు వచ్చేసి.. ఈ రోజు (ఆదివారం) సాయంత్రం ఐదు గంటల వేళకు ప్రచారం ముగియనుంది. ఈ నేపథ్యంలో పోలింగ్ ఎలా జరగనుంది? తమ అభ్యర్థుల్ని గెలిపించుకోవటానికి వీలుగా ప్రధాన పార్టీలు తమ పోల్ మేనేజ్ మెంట్ మీద ఫోకస్ పెడుతున్నాయి.

ఇందులో భాగంగా నియోజకవర్గం పరిధిలోని ఆరు డివిజన్లలో ఏ సామాజిక వర్గానికి ఎన్నేసి ఓట్లు ఉన్నాయి?వాటిని తమవైపు పడేలా చేసుకోవటం ఎలా? అన్న దానిపై ఇప్పుడు ద్రష్టి సారిస్తున్నారు. ఓవైపు ఓటుకు నోట్లను పంచేందుకు ఏ మాత్రం వెనుకాడని ప్రధాన పార్టీ నేతలు.. సామాజిక వర్గాల ఆధారంగా.. లెక్కలు వేసుకుంటూ.. ఏ సామాజిక వర్గానికి చెందిన తమ నేతల్ని ఒక జట్టుగా చేసి.. వారి మనసు దోచుకునేందుదకు వీలుగా వ్యూహాల్ని సిద్ధం చేసుకుంటున్నారు.

మొత్తం ఓటర్లు 4 లక్షలకు పైనే ఉన్నారు. వీరిలో 30 శాతం మంది అంటే.. లక్షా పది వేలకు పైనే మైనార్టీ ఓటర్లు ఉన్నారు. వీరు వేసే ఓటు ఆధారంగా అభ్యర్థి గెలుపు ఓటములు డిసైడ్ కానున్నాయి. ఈ క్రమంలో మైనార్టీ ఓట్లను సొంతం చేసుకోవటానికి భారీ ఎత్తున ప్రయత్నాలు చేయటం తెలిసిందే. ఈ క్రమంలో ఏ సామాజిక వర్గానికి ఎన్నేసి ఓట్లు ఉన్నాయి? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.

అయితే.. ఈ లెక్కలకు సంబంధించి అధికారికంగా ఎలాంటి గణాంకాలు లేనప్పటికి.. ఆయా సామాజికవర్గాలకు చెందిన వారి అంచనాలతో పాటు..కొన్ని ప్రైవేటు సర్వేల్లో పేర్కొన్న గణాంకాల ఆధారంగా జాబితాను ప్రధాన పార్టీలు సిద్ధం చేసుకున్నాయి. ఈ క్రమంలో ఏ సామాజికవర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా ఉన్నారు? అన్నది ప్రశ్నగా మారింది. ఇందులో భాగంగా రాజకీయ పార్టీలు చెబుతున్నట్లుగా కులాల వారీగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న ఓటర్ల లెక్కలు చూస్తే.. ఇలా ఉన్నారని చెప్పాలి.

- మొత్తం ఓటర్లు 4,02,000

మైనార్టీలు (ముస్లింలు) 1.13 లక్షలు

క్రైస్తవులు 26 వేలు

మున్నూరు కాపు 23 వేలు

మాదిగ 21 వేలు

యాదవ 21 వేలు

గౌడ 19 వేలు

కమ్మ 19 వేలు

వడ్డెర 17 వేలు

ముదిరాజ్ 17 వేలు

కాపు, బలిజ 17 వేలు

రెడ్డి 16 వేలు

విశ్వబ్రాహ్మణ 16 వేలు

మాలలు 15 వేలు

పద్మశాలి 14 వేలు

ఇతర బీసీ కులాలు 17 వేలు

ఇతర కులాలు.. మతాలు 19 వేలు