జూబ్లీహిల్స్ పోరు: ఎవరి 'పాట్లు' వారివి!
దీని నుంచి బయటపడేందుకు.. మాజీ సీఎం కేసీఆర్ మచ్చిక దక్కించుకునేందుకు కూడా కొందరు ప్ర యత్నాలు చేస్తున్నారు.
By: Garuda Media | 1 Nov 2025 10:00 PM ISTజూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికకు సమయం చేరువ అవుతోంది. మరో 8 రోజుల్లో ప్రచారానికి తెర పడనుంది. దీంతో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ ఎస్, బీజేపీలు.. పెద్ద ఎత్తున తమ ప్రచారాన్ని పరుగు లు పెట్టిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి తాజాగా బరిలోకి దిగారు. ఇక, మంత్రులు పలువురు ఇప్పటికే నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం పీక్ స్టేజ్‌కు తీసుకువెళ్లిందని స్పష్టంగా తెలుస్తోంది.
ఇక, బీఆర్ ఎస్ నాయకుడు.. మాజీ మంత్రులు కూడా జోరు పెంచారు. క్షేత్రస్థాయిలో ప్రజలను కలుసుకు ని.. వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. కొందరు మాజీ మంత్రులు.. దుకాణాలకు వెళ్లి టీలు పెడుతున్నారు. కాఫీలు ఇస్తున్నారు. సెలూన్ల లో హెయిర్ కట్ చేస్తున్నారు. కూరగాయలు విక్రయిస్తున్నారు.. ఇలా ప్రజలను ఆకట్టుకునేందుకు బీఆర్ ఎస్ నాయకులు ఒరకిని మించి ఒకరు అన్నట్టుగా ముందుకు సాగు తున్నారు. పార్టీ ఓడిపోయిన తర్వాత.. కొందరు ఉదాసీనంగా ఉన్నారన్న వాదన ఉంది.
దీని నుంచి బయటపడేందుకు.. మాజీ సీఎం కేసీఆర్ మచ్చిక దక్కించుకునేందుకు కూడా కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి జూబ్లీహిల్స్ బైపోల్‌ను వారు వినియోగించుకుంటున్నారు. అంటే.. అటు అభ్యర్థికి ప్రచారంతోపాటు.. తమపై ఉన్న మచ్చలను కూడా తొలగించు కునేందుకు.. పార్టీకి వీరవిధేయుల మన్న విశ్వసనీయతను దక్కించు కునేందుకు నాయకులు ప్రయత్నిస్తున్నారు. దీంతో మాజీ మంత్రులు క్షేత్రస్థాయిలో కలిసిపోతున్నారు.
ఇక, బీజేపీ విషయానికి వస్తే.. కాంగ్రెస్ - ఎంఐఎంను టార్గెట్ చేస్తూ.. నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఇదే సమయంలో కేంద్రంలోని మోడీసర్కారు ఏస్తున్న మేలును వివరిస్తూ.. రాష్ట్రానికి ఇప్పటి వరకు చేసిన పనులు వివరిస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ ఎస్-కాంగ్రెస్ ఒక్కటేనని.. పేర్కొంటూ.. వింత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు.. సీఎం రేవంత్‌ను కూడా నాయకులు విమర్శల పర్వంలోకి లాగుతున్నారు. మొత్తంగా.. జూబ్లీ ఎన్నికల వ్యవహారం.. అటు అభ్యర్థులకే కాకుండా.. ఇటు నాయకుల సత్తాకు కూడా పరీక్షగా మారింది.
