Begin typing your search above and press return to search.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు.. వెలుగులోకి సంచలన సర్వే.. గెలుపు ఆ పార్టీదే

సర్వే వివరాల ప్రకారం, బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు సానుభూతి వాతావరణం ఉన్నప్పటికీ, ప్రజలు ఓటు వేయడంలో కొంత వెనకడుగు వేస్తున్నారని తేలింది.

By:  A.N.Kumar   |   20 Oct 2025 10:00 PM IST
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు.. వెలుగులోకి సంచలన సర్వే.. గెలుపు ఆ పార్టీదే
X

హైదరాబాద్‌ రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు బిసి రిజర్వేషన్ల సమస్యతో ఆగిపోయినా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో కొత్త జోష్ తెచ్చింది. మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి కారణంగా ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నిక తప్పనిసరి అయింది. దీంతో రాజకీయ పార్టీలు ఈ పోటీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష గులాబీ పార్టీ (బీఆర్‌ఎస్‌) ఈ సీటును ప్రతిష్టాత్మకంగా మార్చాయి.

* ప్రధాన పోటీదారులు

గతంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపీనాథ్ మృతి చెందడంతో ఆయన భార్య మాగంటి సునీతను బీఆర్‌ఎస్ అభ్యర్థిగా రంగంలోకి దించింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ ను బరిలోకి దించింది. బీజేపీ కూడా తన అభ్యర్థిని పోటీలో నిలిపినప్పటికీ, ప్రధాన పోరు కాంగ్రెస్ , బీఆర్‌ఎస్ మధ్యే సాగుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.

బీఆర్‌ఎస్ తరఫున కేటీఆర్ స్వయంగా ప్రచార బాధ్యతలు చేపట్టి జూబ్లీహిల్స్‌లో పర్యటిస్తున్నారు. ఇక కాంగ్రెస్ తరఫున సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలు చేస్తున్నారు. ఈ పోటీని రెండు పార్టీలు "గౌరవ ప్రతిష్టల పోరుగా" మార్చాయి.

* ఓటర్ల అభిప్రాయం – ఆర్.ఆర్. పొలిటికల్ సర్వే

ఇటీవల ఆర్.ఆర్. పొలిటికల్ సర్వేస్ సంస్థ జూబ్లీహిల్స్‌లో నిర్వహించిన ఓ సర్వేలో సంచలన ఫలితాలు బయటపడ్డాయి.

* ఎవరు గెలవాలి?

నవీన్ యాదవ్ (కాంగ్రెస్): 49.55%

మాగంటి సునీత (బీఆర్‌ఎస్): 33.35%

తెలియదు/చెప్పలేము: 12.5%

* పరిపాలన, అభివృద్ధి విషయంలో

కెసీఆర్‌ పాలనకు మద్దతు: 67.70%

రేవంత్ రెడ్డి పాలనకు మద్దతు: 19.79%

* హామీల అమలు చేసే సత్తా ఎవరికి ఉంది?

కాంగ్రెస్: 18.75%

బీఆర్‌ఎస్: 32.44%

బీజేపీ: 3.12%

*తదుపరి సీఎం ఎవరై ఉండాలి?

కెసీఆర్: 66.66%

రేవంత్ రెడ్డి: 20.3%

బండి సంజయ్: 7.29%

కిషన్ రెడ్డి: 1.29%

🔹 పార్టీ వారీగా ఓటింగ్ ధోరణి

కాంగ్రెస్ పార్టీ: 50.65%

బీఆర్‌ఎస్ పార్టీ: 32.46%

బీజేపీ: 11.99%

హెచ్‌వైసీ: 1.03%

ఇతరులు: 1.8%

నోటా: 2.8%

*సర్వే తేల్చింది ఇదీ

సర్వే వివరాల ప్రకారం, బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు సానుభూతి వాతావరణం ఉన్నప్పటికీ, ప్రజలు ఓటు వేయడంలో కొంత వెనకడుగు వేస్తున్నారని తేలింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ, నవీన్ యాదవ్ వ్యక్తిగత చరిష్మా, స్థానిక స్థాయిలో చేసిన సేవా కార్యక్రమాలు ఆయనకు బలంగా నిలుస్తున్నాయి.

జూబ్లీహిల్స్‌లో అన్ని వర్గాల ప్రజలతో ఆయన మమేకమై ఉన్నారని, ఈ సారి ఆయన గెలుపు దాదాపుగా ఖాయమని ఆర్.ఆర్. సర్వే స్పష్టం చేసింది. ఈ సర్వే ప్రకారం, నవీన్ యాదవ్ 30 నుంచి 36 వేల ఓట్ల మెజారిటీతో గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది.

* తేల్చిచెప్పిన ఆర్.ఆర్. సర్వే

“జూబ్లీహిల్స్‌లో ఉప ఎన్నికల ఫలితం కాంగ్రెస్ పక్షానే వెళ్లే అవకాశం ఉంది. నవీన్ యాదవ్ వ్యక్తిగత ప్రభావం, ప్రజల్లోని ఆమోదం ఈ విజయానికి కారణం అవుతుంది.” అని ఆర్.ఆర్. పొలిటికల్ సర్వేస్ తేల్చింది.

మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాలకు కొత్త దిశ చూపే అవకాశముంది. ఈ ఫలితంతో రాష్ట్ర రాజకీయ సమీకరణాలు మారే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు.