అమ్మా.. కేసీఆర్-రేవంత్.. ఎవరి పాలన బాగుంది?: సర్వేలపై సర్వేలు..!
ఇదీ.. ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పొద్దు పొద్దున్నే పలు వీధుల్లో కనిపించిన దృశ్యం. వారె వరో తెలియదు.. ఎక్కడి నుంచి వచ్చారో కూడా తెలియదు. కానీ.. స్థానికులు మాత్రం కాదు.
By: Garuda Media | 3 Oct 2025 2:00 AM IST''అమ్మా.. కేసీఆర్ పాలన బాగుందా? రేవంత్ రెడ్డి పాలన బాగుందా?''
''సంక్షేమ పథకాలు అందుతున్నాయా? మీకు ఇప్పటి వరకు ఏమేమందాయి?''
''ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది?''
''ఉప ఎన్నిక వస్తోంది కదా.. ఎవరికి ఓటేయాలని అనుకుంటున్నారు?''
''మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి?''
- ఇదీ.. ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పొద్దు పొద్దున్నే పలు వీధుల్లో కనిపించిన దృశ్యం. వారె వరో తెలియదు.. ఎక్కడి నుంచి వచ్చారో కూడా తెలియదు. కానీ.. స్థానికులు మాత్రం కాదు. నేరుగా ఇళ్ల కాలింగ్ బెల్ నొక్కుతున్నారు. చేతిలో ట్యాబులు పట్టుకుని ఇంటి వారిని ప్రశ్నలు అడుగుతున్నారు. వారి నుంచి వచ్చే సమాధానాలను నమోదు చేసుకుంటున్నారు. ప్రస్తుతం గురువారం ఉదయం కనిపించిన దృశ్యాలు ఇవీ. దీంతో ప్రజలు.. కూడా వారి మనసులో భావాలను బయటపెడుతున్నారు.
కానీ, ఎంత వరకు వారు చెప్పేది నమ్మాలనే విషయంలో మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. త్వరలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగనుంది. దీంతో సర్వే రాయుళ్లు ఈ నియోజకవర్గంపై పెద్ద ఎత్తున ఫోకస్ చేశా రు. వీరిలో కొందరు ప్రొఫెషనల్స్ ఉండగా.. మరికొందరు మాత్రం.. పార్టీల తరఫున ప్రజల నాడిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.ఈ క్రమంలోనే కొందరు పార్టీలకు అనుకూలంగా కూడాప్రజల నుంచి సమాచారం రాబడుతున్నారు. సహజంగా ఎన్నికలు అనగానే సర్వేలు జరుగుతాయి.
కానీ, ఉప ఎన్నికకు సంబంధించి కూడా సర్వేలు జరగడం అనేది ఇదే ప్రథమం. గతంలోనూ ఖమ్మం జిల్లాలో ఉప పోరు జరిగినా.. ఈ రేంజ్‌లో అయితే.. సర్వేలు జరగలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం, అటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ నాయకులు కూడా.. పెద్ద ఎత్తున జూబ్లీహిల్స్‌పై ఆశలు పెట్టుకున్నా రు. ప్రభుత్వ పనితీరుకు ఇది రిఫరెండం అని సర్కారు భావిస్తుండగా.. కేసీఆర్ పట్ల ప్రజలు ఉన్నారనేం దుకు ఈ ఉప ఎన్నిక నిదర్శనమని.. బీఆర్ ఎస్ లెక్కలు వేసుకుంటోంది. దీంతో ఇరు పార్టీలు కూడా.. సొంతంగా సర్వేలు చేయిస్తున్నాయి. మరోవైపు.. ప్రొఫెషనల్ సర్వే రాయుళ్లు కూడా రంగంలోకి దిగడంతో జూబ్లీహిల్స్‌లో ఇప్పుడు టీకొట్ల నుంచి ఇళ్ల వరకు ఎవరినీ వదలకుండా.. అభిప్రాయాలు సేకరిస్తున్నారు.
