Begin typing your search above and press return to search.

జూబ్లీహిల్స్ పోరు: నేటితో నామినేష‌న్లు బంద్‌!

హైదరాబాద్‌లోని కీల‌క నియోజ‌క‌వ‌ర్గం జూబ్లీహిల్స్ అసెంబ్లీస్థానానికి ఉప ఎన్నిక జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే.

By:  Garuda Media   |   21 Oct 2025 11:45 AM IST
జూబ్లీహిల్స్ పోరు:  నేటితో నామినేష‌న్లు బంద్‌!
X

హైదరాబాద్‌లోని కీల‌క నియోజ‌క‌వ‌ర్గం జూబ్లీహిల్స్ అసెంబ్లీస్థానానికి ఉప ఎన్నిక జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. గ‌త 2023లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో బీఆర్ ఎస్ అభ్య‌ర్థి మాగంటి గోపీనాథ్ విజ‌యం దక్కించుకున్నా రు. అయితే.. అనారోగ్య కార‌ణాల‌తో ఈ ఏడాది ఆయ‌న మృతి చెందారు. ఈ నేప‌థ్యంలో ఉప ఎన్నిక అని వార్యంగా మారింది. కాగా.. ఈ ఉప ఎన్నిక‌కు సంబంధించిన నామినేష‌న్ల ప్ర‌క్రియ మంగ‌ళ‌వారంతో ముగి యనుంది. ఇప్ప‌టి వ‌ర‌కు బీఆర్ ఎస్ అభ్య‌ర్థిగా మాగంటి సునీత‌, కాంగ్రెస్ త‌ర‌ఫున న‌వీన్ యాద‌వ్ నామినేష‌న్ దాఖ‌లు చేశారు.

కాగా.. ఇత‌ర పార్టీలు, స్వ‌తంత్రులు.. మొత్తం ఇప్ప‌టి వ‌ర‌కు 127 నామినేష‌న్లు దాఖ‌ల‌య్యాయి. మంగ‌ళ‌వా రం నామినేష‌న్ల‌కు తుది రోజు కావ‌డంతో పెద్ద ఎత్తున స్వ‌తంత్ర అభ్య‌ర్థులు నామినేష‌న్ దాఖ‌లు చేసే అవ‌కాశం ఉంటుంద‌ని భావిస్తున్నారు. సాయంత్రం 3.30 గంట‌ల వ‌ర‌కు నామినేష‌న్లు వేసేందుకు అవ‌కా శం ఉంద‌ని అధికారులు తెలిపారు. కాగా.. బీజేపీ త‌ర‌ఫున ఇక్కడ నుంచి పోటీ చేయ‌నున్న లంక‌ల ప‌ల్లి దీప‌క్ రెడ్డి నామినేష‌న్ వేయాల్సి ఉంది. ఈ కార్య‌క్ర‌మానికి పార్టీ సీనియ‌ర్లు, కేంద్ర మంత్రులు హాజ‌రవుతా రని పార్టీ నాయ‌కులు తెలిపారు.

ఇదిలావుంటే.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల ప్ర‌చారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్‌, బీఆర్ ఎస్‌, బీజేపీలు ఈ ఉప ఎన్నిక‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి. అధికార పార్టీ ఈ ఉప పోరును త‌మ పాల‌న‌కు గీటురాయి గా భావిస్తుండ‌గా.. బీఆర్ ఎస్ ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకుని కేసీఆర్ హ‌వా త‌గ్గ‌లేద‌న్న వాద‌న‌ను బ‌లపరి చేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. మ‌రోవైపు.. ఈ రెండు పార్టీలతో ప్ర‌జ‌లు న‌ష్ట‌పోయార‌ని చెబుతున్న బీజేపీ.. ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. మొత్తంగా భారీ ఎత్తున ప్ర‌చారం అయితే జోరుగా సాగుతోంది. వ‌చ్చే నెల 9న ఎన్నిక‌ల పోలింగ్ జ‌ర‌గ‌నుంది.