జూనియర్ ఎన్టీఆర్ పక్కా రాజకీయాల్లోకి....అది జరిగితేనే !
జూనియర్ ఎన్టీఆర్ ఈ రోజు సినీ సీమను ఏలుతున్న టాప్ స్టార్. ఆయన ట్రిపుల్ ఆర్ మూవీ తరువాత తన ఖ్యాతితో ఖండాంతరాలకు విస్తరించారు.
By: Satya P | 5 Sept 2025 4:00 PM ISTజూనియర్ ఎన్టీఆర్ ఈ రోజు సినీ సీమను ఏలుతున్న టాప్ స్టార్. ఆయన ట్రిపుల్ ఆర్ మూవీ తరువాత తన ఖ్యాతితో ఖండాంతరాలకు విస్తరించారు. ఆయన పాన్ ఇండియా లెవెల్ లోనే సినిమాలు చేస్తున్నారు. గ్లోబల్ స్టార్ గా మరింతగా ఎదిగేందుకు భారీ యాక్షన్ ప్లాన్ తో వరుస సినిమాలకు కమిట్ అయ్యారు. అయితే ఇటువంటి బిజీ షెడ్యూల్ లో ఈ తరహా టైట్ పొజిషన్ లో జూనియర్ కనీసం రాజకీయాల గురించి ఆలోచించే తీరుబాటు ఉంటుందా అన్నదే పెద్ద ప్రశ్న.
జూనియర్ చుట్టూనే అంతా :
అయితే జూనియర్ ఎన్టీఆర్ చుట్టూనే అంతా చర్చ సాగుతోంది. ఆయన రాజకీయాల్లోకి వస్తారని రావాలని ఇలాగే చాలా కాలంగా చర్చ సాగుతోంది. ఇటీవల ఎన్టీఆర్ అభిమానులు ఒక ఎమ్మెల్యే విషయంలో ఆగ్రహించి ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు చూస్తే ఎన్టీఆర్ ని తొందరగా రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నట్లుగానూ అందరికీ అనిపించింది. అయితే జూనియర్ రాజకీయాల్లోకి రావడం అంటే అది అంత ఈజీ కాదు అని అంటున్నారు. నిజానికి చూస్తే జూనియర్ రాజకీయ రాక కోసం చాలా మంది వేచి చూస్తున్నారు అని కూడా ప్రచారంలో ఉన్న మాట.
రాజకీయం అంటేనే :
ఇక రాజకీయాలు అన్నవి అంత ఈజీ టాస్క్ కాదని అంతా అంటారు. రాజకీయ పార్టీని పెట్టి నడపడం అన్నది అన్నది అంత సులభం కానే కాదు, అంతే కాదు క్యాడర్ ని సిద్ధం చేయడం కానీ వారితో ఎప్పటికప్పుడు మమేకం కావడం కానీ అంత సులువు అయితే కాదన్న విశ్లేషణలు ఉన్నాయి. ఇక ఏపీ ఏపీ రాజకీయం తీరు తెన్నులు చూసినా రాజకీయ శూన్యత ప్రస్తుతానికి అయితే కనిపించడం లేదు అని అంటున్నారు. ఎందుకంటే అధికార పక్షంలో ఉన్న టీడీపీ కానీ విపక్షంలో ఉన్న వైసీపీ కానీ బలంగానే ఉన్నాయి.
చెరో వైపు మోహరించిన తీరు :
ఇక టీడీపీకి వైసీపీకి చెరో 40 శాతం ఓటు షేర్ ఏపీ రాజకీయాల్లో ఉంది. అంతే కాదు జనసేనకు ఆరు నుంచి ఏడు శాతం ఓటు షేర్ ఉంది. జాతీయ పార్టీలు అయిన బీజేపీకి కానీ కాంగ్రెస్ కి కానీ చెరి ఒకటి నుంచి రెండు శాతం ఓటు బ్యాంక్ ఉంది. ఇలా చూస్తే కనుక ఏపీ రాజకీయం ఎక్కడికక్కడ ఒక స్పష్టమైన విభజన చేసుకుని మరీ సెటిల్డ్ ఓల్డ్ బ్యాంక్ తో పార్టీల మధ్యన చేరిపోయింది అని చెప్పాల్సి ఉంటుంది.
కొత్త పార్టీ అంటే కనుక :
ఇపుడున్న పరిస్థితుల్లో కొత్త పార్టీ అంటూ వస్తే కనుక ఈ ఓటు బ్యాంక్ ల నుంచే చీలిక రావాలి. అది కూడా భారీ స్థాయిలో జరగాలి. అపుడో మరో రాజకీయ పక్షానికి చోటు ఉంటుంది. అలా జరగాలి అంటే ఇపుడు ఉన్న పార్టీలకు ఉన్న ఓటు బ్యాంకు చెల్లా చెదురు అయ్యేలా చేసే భారీ సంఘటనకు కానీ అతి పెద్ద ఉద్యమాలు కానీ రావాలి. అది కూడా జనాలతో వారి భావోద్వేగాలతో కనెక్ట్ అయ్యే విధంగా ఉండాలి. అపుడే ఈ ట్రెడిషనల్ ఓటు బ్యాంక్ ఆయా పార్టీల నుంచి పెద్ద ఎత్తున చెల్లా చెదురు అవుతాయి అన్నది ఒక విశ్లేషణ గా ఉంది.
రాజకీయ శూన్యత ఉందా :
అంతే కాదు రాజకీయంగా శూన్యత అన్నది కూడా ఉండాలి. ఏపీ రాజకీయాల్లో చూస్తే కనుక ప్రస్తుతం అటువంటి వాతావరణం అసలు లేదు అని చెప్పాల్సి ఉంటుంది. రాజకీయ శూన్యత ఎపుడు వస్తుంది అంటే ఒక బలమైన పార్టీ అన్ని విధాలుగా ఫెయిల్ అయి ఇక నడపలేని స్థితి వచ్చినపుడు. అయితే ఏపీలో చూస్తే సంస్థాగతంగా పార్టీలు బలంగానే ఉన్నాయి. టీడీపీ లీడర్ బేస్డ్ కాకుండా క్యాడర్ బేస్డ్ గా బలంగా నిర్మించడంలో చంద్రబాబు ఫుల్ సక్సెస్ అయ్యారు. అందువల్ల టీడీపీలో అలాంటి పరిస్థితి సమీప భవిష్యత్తులో ఉంటుందా అన్నది ఆలోచించాలి. ఇక వైసీపీ చూస్తే రాజకీయంగా యువకుడు అయిన జగన్ నాయకత్వం ఆ పార్టీకి శ్రీరామ రక్షగా ఉంది. అంతే కాదు కొన్ని సామాజిక వర్గాలు ఆ పార్టీకి కట్టుబడిన పరిస్థితి ఉంది అని చెప్పాల్సి ఉంది.
కాంగ్రెస్ ఫెయిల్ కావడం వల్లనే :
ఏపీలో వైసీపీ ఆవిర్భవించడానికి కారణం కాంగ్రెస్ విభజన తరువాత పరిణామాల నేపధ్యంలో ఫెయిల్ కావడమే అని అంటారు. ఆ విధంగా ఆ వైపు నుంచి అతి పెద్ద ఓటు బ్యాంక్ షిఫ్ట్ అయి వైసీపీ ఆవిర్భావానికి అది దారి తీసింది. ఇక ఏపీలో అలాంటి పరిస్థితి అయితే ప్రస్తుతానికి లేవని అంటున్నారు. తమిళనాడులో చూసుకుంతే అక్కడ తమిళ సూపర్ స్టార్ విజయ్ కొత్త పార్టీతో వస్తున్నారు. ఆయన కూడా రాజకీయ శూన్యతను సృష్టించుకునే ప్రయత్నంలో ఉన్నారు. అన్నా డీఎంకే ఫెయిల్ అయితే ఆ ప్లేస్ లోకి రావాలన్న ఆలోచనతోనే ఆయన పార్టీ పెట్టినట్లుగా అర్ధం అవుతోంది.
మరో దశాబ్దం వరకూ :
అయితే అన్నా డీఎంకే కూడా క్యాడర్ బేస్డ్ పార్టీ. సో విజయ్ తమిళనాడులో తన రాజకీయాన్ని సూపర్ సక్సెస్ గా కనుక కొనసాగిస్తే అది జూనియర్ ఎన్టీఆర్ కి ప్రేరణ గా ఉండే చాన్స్ ఉంటుంది అని అంటున్నారు. అలా జూనియర్ ఆలోచనలు కూడా రాజకీయాల వైపు మారే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. ఏది ఏమైనా జూనియర్ వయసు ఇపుడు గట్టిగా చూస్తే నాలుగు పదులు. ఆయన మరో దశాబ్దం వరకూ సినిమాల గురించే ఆలోచన తప్ప రాజకీయ వైపు చూడరు అన్న మాట కూడా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో. ఏపీ రాజకీయాల్లో ఏ భారీ మార్పులకు పరిణామాలు దారి తీస్తాయో. రేపటి రాజకీయ తెర ఏ విధంగా కొత్త కాంతులు సంతరించుకుంటుందో.
