Begin typing your search above and press return to search.

జగన్ జూనియర్ లని కలుపుతున్నదెవరు ?

జూనియర్ ఎన్టీఆర్ సినీ హీరోగా ఖండాంతర కీర్తిని గడిస్తున్నారు. ఆయన ప్రస్తుతం చాలా కంఫర్ట్ జోన్ లో ఉన్నారు.

By:  Satya P   |   20 Aug 2025 1:00 AM IST
జగన్ జూనియర్ లని కలుపుతున్నదెవరు ?
X

ఏమిటో తెలుగు రాజకీయాలు సినిమాలు రెండూ కలగాపులగంగా మిక్స్ అయిపోయాయి. ఈ రెండు రంగాలకు మధ్య ఉన్న సన్నని గీత చెరిగిపోతోంది దాంతో రాజకీయ పార్టీలకూ నష్టం వాటిల్లుతోంది. అటు సినీ రంగంలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటున్నారు. ఒక సినిమా హిట్ కావాలన్నా లేక ఒక పార్టీ సక్సెస్ కావాలన్నా అందరి అభిమానం కావాలి. ఈ మౌలిక సూత్రాన్ని మరచిపోతున్నారు. దాంతో పాటు ఎవరి కుంపటి వారిదే అన్నట్లుగా తెర తీస్తున్న ఈ న్యూ తరహా పాలిటిక్స్ తో భవిష్యత్తులో ఏమి జరుగుతుందో అన్నదే చర్చగా ఉంది.

జూనియర్ చూట్టూ పాలిటిక్స్ :

జూనియర్ ఎన్టీఆర్ సినీ హీరోగా ఖండాంతర కీర్తిని గడిస్తున్నారు. ఆయన ప్రస్తుతం చాలా కంఫర్ట్ జోన్ లో ఉన్నారు. బ్రహ్మాండమైన కెరీర్ కళ్ళ ముందు ఉంది. అలాంటి జూనియర్ ని అనవసరంగా రాజకీయాల్లోకి లాగుతున్నారా అన్నదే చర్చ. అనంతపురం ఎమ్మెల్యే జూనియర్ మీద చేశారు అని ప్రచారంలో ఉన్న హాట్ కామెంట్స్ మీద ఇంకా ఆయన ఫ్యాన్స్ ఆగ్రహం చల్లారడం లేదు. సోషల్ మీడియా వేదికగా వారు తామ కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. తమతో పెట్టుకోవద్దు అని హెచ్చరిస్తున్నారు. ఇక అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ఇంటి వద్ద జూనియర్ ఫ్యాన్స్ నిరసన కార్యక్రమాలు నిర్వహించిన సంగతి కూడా తెలిసిందే. మరో వైపు వైసీపీ జూనియర్ కి మద్దతుగా నిలవడమే ఈ రాజకీయాలకు పరాకాష్టగా చెబుతున్నారు.

ఈ ప్రచారంలో నిజమెంత :

టీడీపీతో జూనియర్ కి గ్యాప్ ఉందో లేదో ఇంకా ఇదమిద్ధంగా యైతే తెలియదు. కానీ వైసీపీ అభిమానులు మాత్రం జూనియర్ ని తమ సొంతం చేసుకుంటున్నారు. ఆయనకు అడగకుండానే మద్దతు ఇస్తున్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులు అయితే జూనియర్ జగన్ ఇద్దరూ త్వరలో కలుసుకోబోతున్నారు అని పోస్టులు పెట్టి మరీ అతి చేస్తున్నారు. జూనియర్ కి తమ అండదండలు నిండుగా ఉంటాయని భరోసా ఇస్తున్నారు. ఇంతకీ అసలు ఏమి జరిగింది అని జూనియర్ కి వైసీపీ ఇంతలా మద్దతు ఇవ్వాల్సి వస్తోంది అన్నది మరో డిస్కషన్.

అది ఇంపాజిబుల్ అని తెలిసిందా :

వైసీపీతో జూనియర్ ఎప్పటికీ టచ్ లోకి రారు. అసలు ఆ సీన్ అయితే ఉండేది లేదు. అభిమానులు అయితే నానా రకాలుగా ఊహించుకోవచ్చు. ఎందుకంటే వారి ఆలోచనలు అభిమానంతోనే అంతా చేస్తారు. కానీ పరిణామాలు పర్యవశానాలు వారు ఆలోచించరు అని అంటున్నారు. జూనియర్ విషయం తీసుకుంటే ఆయన చూపు ఇంకా రాజకీయాల మీద పడలేదు అని అంటారు. అయితే ఆయన రాజకీయాల్లోకి రావచ్చా అంటే రావచ్చు అన్నది ఎక్కువ మంది అభిప్రాయం. అయితే ఆయన రాజకీయాల్లోకి వస్తే తన తాత పెట్టిన పార్టీ టీడీపీ ఉంది. ఒకవేళ అక్కడ ఆయనకు ఇబ్బందులు ఎదురైతే అపుడు సొంతంగా పార్టీ పెట్టి రావచ్చు. అయితే ఇవన్నీ టూ ఎర్లీ డిస్కషన్స్ అని అంటున్నారు.

పోస్టుల పొలిటికల్ వార్

గట్టిగా చూస్తే నాలుగు పదుల వయసులో జూనియర్ ఉన్నారు. ఇంకా రెండు దశాబ్దాల పాటు ఆయన సినీ కెరీర్ సక్సెస్ ఫుల్ గా సాగడానికి అవసరమైన పొటెన్ష్హియాలిటీ ఉన్న సూపర్ స్టార్ ఆయన అని విశ్లేషిస్తున్నారు. అందువల్ల జూనియర్ రాజకీయాలకు ఇప్పట్లో అయితే బహు దూరం అందునా వైసీపీతో ఆయన టచ్ లోకి ఎందుకు వస్తారు అన్నది కూడా అంటున్నారు. సో జగన్ జూనియర్ మీట్ కావడం అన్నది ఇంపాజిబుల్ అని చెబుతున్నారు. మొత్తానికి చూస్తే జూనియర్ చుట్టూ రాజకీయం ఉంది. ఆయన మాత్రం తన టార్గెట్లు ఏమిటో బాగా తెలిసిన వారు. చాలా మెచ్యూర్డ్ గా ఉంటారు అన్నది తెలిసిందే. సో ఈ సోషల్ మీడియా పోస్టులు పొలిటికల్ వార్ ఇవన్నీ టైం పాస్ కోసమే అని అంటున్నారు అంతా.