Begin typing your search above and press return to search.

భారత్ లో ఐపీవోలు.. అంతకంతకూ దూసుకెళుతున్నాయి

ప్రతి ఏడాది మన దేశంలో ఐపీవోల ద్వారా సమీకరిస్తున్న నిధులకు సంబంధించి అంతర్జాతీయ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకింగ్ దిగ్గజం జేపీ మోర్గాన్ తాజా రిపోర్టు విడుదలైంది.

By:  Garuda Media   |   10 Dec 2025 2:00 PM IST
భారత్ లో ఐపీవోలు.. అంతకంతకూ దూసుకెళుతున్నాయి
X

ప్రతి ఏడాది మన దేశంలో ఐపీవోల ద్వారా సమీకరిస్తున్న నిధులకు సంబంధించి అంతర్జాతీయ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకింగ్ దిగ్గజం జేపీ మోర్గాన్ తాజా రిపోర్టు విడుదలైంది. ఇందులో పేర్కొన్న అంశాలు ఆసక్తికరంగానే కాదు.. నిధుల సమీకరణకు సంబంధించి అంతకంతకూ ముందుకెళుతున్న విషయం స్పష్టంగా కనిపిస్తుంది. రానున్న సంవత్సరాల్లో ఇది మరింత పెరుగుతుందన్న అంచనాను వేసింది. ఏటా ఐపీవోల ద్వారా 2వేల కోట్ల డాలర్ల సమీకరణ అన్నది మామూలుగా మారినట్లు పేర్కొంది. మన రూపాయిల్లో చూస్తే ఇది రూ.1.80లక్షల కోట్ల కంటే ఎక్కువ.

ఈ ఏడాదిలో కంపెనీల ఆఫరింగ్ విలువ ఇప్పటికే రూ.1.89 లక్షల కోట్లకు దాటేసినట్లుగా పేర్కొన్న ఆయన.. ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్ రూ.10వేల కోట్ల భారీ ఆఫరింగ్ ఈ నెలలోనే పూర్తి కానుంది. వచ్చే రెండు మూడు వారాల్లో మరిన్ని పెద్ద కంపెనీలు ఆఫరింగ్ కు రానున్నాయి. ఈ లెక్కన చూసుకుంటే ఈ ఏడాది చివరి నాటికి ఐపీవోల ద్వారా సమీకరించిన మొత్తం నిధులు రూ.2.07 లక్షల కోట్లు చేరుకునే అవకాశం ఉందని జేపీ మోర్గాన్ అంచనా వేసింది.

మన దేశంలో ఐపీవోకు వస్తున్న కంపెనీల్లో దాదాపు 20 శాతం కన్స్యూమర్ టెక్నాలజీ.. ఆధునిక వ్యాపార కంపెనీలేనని.. వచ్చే ఐదేళ్లలో ఈ వాటా ముప్ఫై శాతానికి మించి పెరుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుతం మార్కెట్ లో వేల కోట్లు విలువ చేస్తున్న దాదాపు 20 స్టార్టప్ లు సమీప భవిష్యత్తులో ఐపీవోకు రానున్నట్లుగా పేర్కొన్నారు. ఈ నాలుగైదు కంపెనీలు ఐపీవోల ద్వారా రూ.9వేల కోట్లకు పైగా నిధుల సమీకరణకు సిద్ధమవుతున్న విషయాన్ని వెల్లడించారు.

ఈ కంపెనీలన్నీ కలిసి మార్కెట్ నుంచి దాదాపు రూ.72 వేల కోట్ల వరకు నిధులు సమీకరించే వీలుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఐదు ఐపీవోలకు సెబి ఓకే చెప్పింది. ఈ ఐదు కంపెనీలవివరాల్లోకి వెళితే..

- లీప్‌ ఇండియా

- ఎల్డోరాడో అగ్రిటెక్‌

- మోల్బయో డయాగ్నోస్టిక్స్‌

- ఫుడ్‌లింక్‌ ఎఫ్‌ అండ్‌ బీ హోల్డింగ్స్‌

- టెక్నోక్రాఫ్ట్‌ వెంచర్స్‌