ఏఐని సాంతం వాడేయండి.. జియో, ఎయిర్ టెల్, ఓపెన్ఏఐ భారీ ఫ్రీ ఆఫర్లు
జియోకు పోటీగా ఎయిర్‌టెల్ కూడా ఏఐ ప్రియులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. అద్భుతమైన మల్టీ-మోడల్ రీసెర్చ్ ఇంజిన్ అయిన పర్‌ప్లెక్సిటీ ప్రీమియం వెర్షన్ ను ఏకంగా ఒక ఏడాది పాటు పూర్తిగా ఉచితంగా అందిస్తోంది.
By: A.N.Kumar | 11 Nov 2025 4:00 AM ISTఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రపంచంలోనే అతిపెద్ద విప్లవాన్ని తీసుకొచ్చింది. చాట్‌బాట్స్‌తో సందేహాలు నివృత్తి చేసుకోవడం నుండి, ప్రాజెక్ట్‌లకు కోడింగ్ రాయడం, అధునాతన ఫోటోలు, వీడియోలు సృష్టించడం వరకు ప్రతి ఒక్కరికీ ఏఐ నేడు అత్యంత అవసరమైన సాధనంగా మారింది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ టెలికం దిగ్గజాలు జియో, ఎయిర్‌టెల్ , ఏఐ సృష్టికర్త ఓపెన్ఏఐ సంచలన ప్రకటనలు చేశాయి. లక్షల విలువైన ఏఐ ప్రీమియం సేవలను భారతీయ వినియోగదారులకు పూర్తిగా ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించాయి. ఈ ఆఫర్లు టెక్ ప్రపంచంలో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి!
రూ.35,100 విలువైన ప్లాన్ ఫ్రీ.. జియో – గూగుల్ జెమినీ ప్రో ఉచితం!
రిలయన్స్ జియో వినియోగదారులకు మైండ్-బ్లోయింగ్ ఆఫర్ ఇచ్చింది! ఏకంగా రూ.35,100 విలువ గల గూగుల్ జెమినీ ప్రో ప్లాన్‌ను 18 నెలలపాటు ఉచితంగా అందిస్తోంది. తొలుత కేవలం యువకులకు 18-25 ఏళ్ల వారికి మాత్రమే పరిమితమైన ఈ ఆఫర్, ఇప్పుడు అన్ని వయసుల జియో యూజర్లకు విస్తరించింది.
ఈ ఉచిత ప్లాన్‌లో లభించే కీలక ఫీచర్లు
జెమినీ 2.5 ప్రో మోడల్‌కు యాక్సెస్ తోపాటు అదనంగా 2 జీబీ క్లౌడ్ స్టోరేజ్. VIO 3.1 వీడియో జనరేటర్ , నానో బనానా ఇమేజ్ జనరేషన్ టూల్స్., నోట్‌బుక్ LM, జెమినీ కోడ్ అసిస్టెంట్, జీమెయిల్, గూగుల్ డాక్స్‌లో కూడా జెమినీ సపోర్ట్ లభిస్తుంది. ఈ ఆఫర్ పొందడానికి వినియోగదారులు తప్పనిసరిగా 'అపరిమితి 5జీ ప్లాన్' యాక్టివేట్ చేసుకుని ఉండాలి. ఆ తర్వాత మై జియో యాప్‌లోని 'క్లెయిమ్ నౌ ' బ్యానర్ ద్వారా ఈ అద్భుతమైన ప్లాన్‌ను సులభంగా యాక్టివేట్ చేసుకోవచ్చు.
ఎయిర్‌టెల్ – పర్‌ప్లెక్సిటీ ప్రో ఫ్రీ ఆఫర్ ఏడాది పాటు ఉచితం
జియోకు పోటీగా ఎయిర్‌టెల్ కూడా ఏఐ ప్రియులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. అద్భుతమైన మల్టీ-మోడల్ రీసెర్చ్ ఇంజిన్ అయిన పర్‌ప్లెక్సిటీ ప్రీమియం వెర్షన్ ను ఏకంగా ఒక ఏడాది పాటు పూర్తిగా ఉచితంగా అందిస్తోంది. సాధారణంగా ఈ సర్వీస్‌కు నెలకు రూ.1730 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో లభించే అద్భుతమైన సదుపాయాలు చూస్తే.. మల్టీ మోడల్ రీసెర్చ్ ఇంజిన్ యాక్సెస్ తోపాటు రోజుకు 300కి పైగా ప్రో సెర్చ్‌లు చేసుకునే అవకాశం.. ఫైల్, ఇమేజ్ అప్‌లోడ్స్ , రియల్‌టైమ్ సిటేషన్లు.. సమగ్రమైన కామెట్ రిపోర్ట్ ఫీచర్ కలగలిపి ఉండనుంది. ఆఫర్ పొందడానికి ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్, బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లంతా ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌లోని రివార్డ్స్ సెక్షన్ ద్వారా ఈ ఆఫర్‌ను వెంటనే పొందవచ్చు.
ఓపెన్ఏఐ – చాట్‌జీపీటీ గో ప్లాన్ రూ.4788 విలువైన సర్వీస్ ఫ్రీ
ఏఐ ప్రపంచంలో సంచలనం సృష్టించిన ఓపెన్ఏఐ సంస్థ కూడా భారతీయ వినియోగదారులకు ఊహించని శుభవార్త అందించింది. వారి అత్యాధునిక చాట్‌జీపీటీ గో ప్లాన్‌ను ఏడాది పాటు ఉచితంగా ఇస్తోంది. సాధారణంగా నెలకు రూ.399 చెల్లించాల్సిన ఈ ప్లాన్, ఇప్పుడు ఆటో డెబిట్ ఆప్షన్‌తో సబ్‌స్క్రైబ్ చేసుకుంటే ఫ్రీ. గో ప్లాన్‌లో ఉండే ప్రత్యేక ఫీచర్లు చూస్తే తాజా GPT-5 మోడల్‌కు యాక్సెస్ లభిస్తుంది. ఇమేజ్ జనరేషన్, కాన్వాస్ సపోర్ట్.. సాధారణ వెర్షన్‌తో పోలిస్తే రెండు రెట్లు ఎక్కువ మెమరీ సపోర్ట్... 10 రెట్లు ఎక్కువ సందేశాలు, ఫైల్, ఇమేజ్ అప్‌లోడ్ పరిమితి... డీప్ రీసెర్చ్ ఆప్షన్ కూడా ఇస్తోంది.
ఇక ఏఐ అందని ద్రాక్ష కాదు!
ఏఐ సాంకేతికత అభివృద్ధి చెందుతున్న ఈ తరుణంలో ఈ ఉచిత ఆఫర్లు విద్యార్థులకు, కంటెంట్ క్రియేటర్లకు, రీసెర్చర్లకు , టెక్ నిపుణులకు నిజంగా అమూల్యమైన బహుమతి. ఖరీదైన ప్రీమియం టూల్స్‌ను ఇప్పుడు ఎవరైనా ఉచితంగా వాడుకుని, తమ పనితీరు, సృజనాత్మకతను అసాధారణంగా మెరుగుపరుచుకునే అవకాశం లభించింది.
