2015, 25ల్లో ఉదయపూర్ లో జెన్నీఫర్ లోపేజ్ వసూళ్ల లెక్కలు ఇవేనా?
ఉదయపుర్ లో తాజాగా జరిగిన నేత్ర, వంశీల వివాహానికి ఎంతోమంది సెలబ్రెటీలు, లెజెండ్ లు హాజరైన సంగతి తెలిసిందే!
By: Raja Ch | 26 Nov 2025 9:36 AM ISTఉదయపుర్ లో తాజాగా జరిగిన నేత్ర, వంశీల వివాహానికి ఎంతోమంది సెలబ్రెటీలు, లెజెండ్ లు హాజరైన సంగతి తెలిసిందే! నాలుగు రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగిన ఈ వేడుక ముగిసింది. ఈ వేడుకలో కుటుంబ సభ్యులు, ప్రముఖులతో పాటు బడ్జెట్లు ప్రముఖంగా వార్తల్లో నిలిచాయి. ఇందులో ప్రధానంగా అమెరికన్ పాప్ స్టార్ జెన్నిఫర్ లోపేజ్ రెమ్యునరేషన్ పై ఇప్పుడు చర్చ మొదలైంది.
అవును... అమెరికాకు చెందిన ఫార్మా బిలియనీర్ రామరాజు కుమార్తె నేత్రా, సూపర్ ఆర్డర్ సహ వ్యవస్థాపకుడు వంశీలకు జరిగిన వివాహం ఉదయపూర్ లో ఈ ఏడాది జరిగిన అత్యంత గొప్ప వివాహాల్లో ఒకదానిగా నిలిచింది. నవంబర్ 21 నుంచి 24 వరకూ లీలా ప్యాలెస్, సిటీ ప్యాలెస్, తాజ్ లేక్ ప్యాలెస్, జగ్ మందిర్ ఐలాండ్ ప్యాలెస్ లలో ఈ వేడుకలు జరిగాయి.
ఇక ఈ వివాహానికి డొనాల్డ్ ట్రంప్ జూనియర్ కూడా హాజరయ్యారు. ఇదే సమయంలో.. ఎంతోమంది పారిశ్రామికవేత్తలు, వ్యవస్థాపకులు, బాలీవుడు, బాలీవుడ్ లోని ప్రముఖులు హాజరయ్యారు. వీరిలో దియా మీర్జా, అమైరా దస్తుర్, సోఫీ చౌదరి, కరణ్ జోహార్ వివిధ కార్యక్రమాలకు ఆతిథ్యమిచ్చారు. ఇక సెలబ్రెటీల డ్యాన్స్ షోలూ అదరగొట్టాయి.
ఇందులో భాగంగా... రణవీర్ సింగ్, జాన్వీ కపూర్, షాహిద్ కపూర్, నోరా ఫతేహీ, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, కృతి సనన్, వరుణ్ ధావన్, మాధురీ దీక్షిత్ లు సంగీత్ ను మరింత ప్రకాశవంతంగా మార్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తారలు రూ.3 నుంచి 4 కోట్ల వరకూ వసూల్ చేశారని నెట్టింట ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ కార్యక్రమంలోని ఈవెంట్స్ లో అంతా ఇప్పటికీ చర్చించుకుంటున్న అంశాల్లో ఒకటి జెన్నీఫర్ లోపేజ్ గురించి అని అంటున్నారు. ఈ ప్రదర్శన కోసం ఆమె సుమారు రూ.17 కోట్లు పారితోషకం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆదివారం నాడు ఆమె వివాహానంతర ప్రదర్శనతో ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ ముగింపును తీసుకొచ్చిందని చెబుతున్నారు.
అయితే ఉదయపూర్ లో జెన్నిఫర్ లోపేజ్ సందడి చేయడం ఇదే తొలిసారి కాదు. సుమారు దశాబ్ధం క్రింత ఆమె 2015లో సంజయ్ హిందుజా వివాహానికి హాజరయ్యారు. ఈ హిందూజా వివాహంలో తన ప్రదర్శన కోసం జెన్నిఫర్ లోపేజ్ రూ.6.5 కోట్లు వసూల్ చేసినట్లు చెబుతారు. అప్పటి భాగస్వామి కాస్పర్ స్మార్ట్ తో కలిసి వచ్చిన ఆమె.. ది ఒబెరాయ్ ఉదయవిలాస్ లోని కోహినూర్ సూట్ లో బస చేసింది.
