స్మృతి - పలాశ్ బ్రేకప్.. అనుమానం రేకెత్తించేలా క్రికెటర్ పోస్ట్!
మ్యూజిక్ కంపోజర్ పలాశ్ ముచ్చల్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి చివరి వరకు వచ్చి ఆగిపోయిన సంగతి మనకు తెలిసిందే.
By: Madhu Reddy | 9 Dec 2025 1:45 PM ISTమ్యూజిక్ కంపోజర్ పలాశ్ ముచ్చల్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి చివరి వరకు వచ్చి ఆగిపోయిన సంగతి మనకు తెలిసిందే. ఈ మధ్యనే వారు తమ పెళ్లిని రద్దు చేసుకున్నట్టు అధికారికంగా ప్రకటించారు.పలాశ్ ముచ్చల్, స్మృతి మంధాన ఇద్దరు కూడా తమ వివాహం రద్దు చేసుకుంటున్నట్లు తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా అధికారికంగా పంచుకున్నారు.
అయితే ఇదంతా అందరికీ తెలిసిన విషయమే కానీ వీరిద్దరూ తమ సోషల్ మీడియా ఖాతాలో పెళ్లి రద్దు చేసుకుంటున్నట్టు పోస్ట్ పెట్టిన తర్వాత స్మృతి మంధాన క్లోజ్ ఫ్రెండ్ మరియు క్రికెటర్ అయినటువంటి జెమియా రోడ్రిగ్స్ పెట్టిన ఒక పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరూ స్మృతి మంధాన, పలాశ్ ముచ్చల్ లు ఇద్దరూ తమ పెళ్లి రద్దు చేసుకుంటున్నట్టు అధికారికంగా ప్రకటించిన విషయం గురించి మాట్లాడుకుంటుండగా.. జెమియా రోడ్రిగ్స్ తన పోస్టుతో అందరిలో కొత్త అనుమానాలు రేకెత్తించింది. స్మృతి మంధాన స్నేహితురాలు తోటి క్రికెటర్ అయినటువంటి జెమియా రోడ్రిగ్స్ సోషల్ మీడియా ఖాతా ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో ఈ విధంగా పోస్ట్ పెట్టింది..
ఈ పోస్టులో ఒలివియా డీన్ యొక్క 2025 హిట్ పాట అయినటువంటి "మ్యాన్ ఐ నీడ్" యువ గాయకుల బృందం జామ్ చేస్తున్న వీడియోని పంచుకుంది. జెమియా రోడ్రిగ్స్ తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన పోస్ట్ లో ఉన్న పాట సారాంశం ఏంటంటే.. "ఇప్పటికే మీకు సమయం, ప్లేస్ ని ఇచ్చింది. కాబట్టి సిగ్గు పడకండి.. మీరు మళ్ళీ నా మనిషిగా.. నాకు అవసరమైన వ్యక్తిగా తిరిగి రండి. మీరు ఇవ్వడానికి ఏదైనా ఉంది అంటే.. నాకు అది కావాలి.. మీరు నన్ను అద్భుతంగా పిలిచినప్పుడు.. మీపై ఇష్టం పెరిగింది. ఏ విషయం అయినా సరే నాతో మాట్లాడండి.. నాకు కావలసిన వ్యక్తిగా ఉండండి బేబీ" అని అర్థం.
అయితే ఇందులో కోల్పోయిన సమయాన్ని తిరిగి పొందుతున్నట్టుగా ఉంది. నువ్వు నాకు విడమర్చి చెప్పాలి అనే లోతైన సందేశం ఉంది. స్మృతి మంధాన పలాష్ ముచ్చల్ ఇద్దరూ వివాహం రద్దు చేసుకున్న తర్వాత క్రికెటర్ జెమియా రోడ్రిగ్స్ పెట్టిన పోస్ట్ సరికొత్త అనుమానాలకు దారితీసింది. అయితే స్మృతి మంధానకి సపోర్ట్ గా జెమియా రోడ్రిగ్స్ ఆ పోస్ట్ చేసినట్టు అర్థమవుతుంది.అలాగే వీరి పెళ్లి రద్దు తర్వాత జెమియా రోడ్రిగ్స్ పలాశ్ ముచ్చల్ ఇన్స్టాగ్రామ్ ని కూడా అన్ ఫాలో చేసింది.
