జేడీ ఒకనాటి మాటలను కెలికి రిటార్ట్
జేడీ లక్ష్మీ నారాయణ పదేళ్ళ రాజకీయ జీవితం తరువాత మళ్ళీ తన పూర్వ ఆశ్రమానికి వెళ్ళారు. పూర్వాశ్రమం అంటే ఐపీఎస్ ఉద్యోగం కాదు, దానికి పదవీ విరమణ చేశారు.
By: Satya P | 16 Feb 2026 3:11 PM ISTజేడీ లక్ష్మీ నారాయణ పదేళ్ళ రాజకీయ జీవితం తరువాత మళ్ళీ తన పూర్వ ఆశ్రమానికి వెళ్ళారు. పూర్వాశ్రమం అంటే ఐపీఎస్ ఉద్యోగం కాదు, దానికి పదవీ విరమణ చేశారు. దాని కంటే ముందు ఆయన ఎంటెక్ విద్యను అభ్యసించి ఆటోమోటివ్ ఫీల్డ్ లో తొలి రోజుల్లో చేసిన ఉద్యోగానికే ఇపుడు మళ్లీ షిఫ్ట్ అయ్యారు ఆయన ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో ఆపరేషన్ వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించారు. దాంతో జనసేనకు చెందిన పొలిటికల్ మిస్సైల్ సోషల్ మీడియా పోస్టు ఒకటి చేసింది.
అర్ధం చేసుకుంటారని :
అందులో జేడీ అప్పట్లో జనసేనకు రాజీనామా చేస్తూ పవన్ మీద వ్యాఖ్యానించిన దాని మీద పొలిటికల్ మిస్సైల్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రాక్టికల్ గా సిద్ధాంతపరమైన రాజకీయాలు చేస్తున్నారు అని పేర్కొనిద్. కాబట్టి మీరు ఇప్పటికైనా దానిని అర్ధం చేసుకుని ఉంటారని ఆశిస్తున్నామని పేర్కొంది. ఇంతకీ జేడీ ఎందుకు అర్ధం చేసుకోవాలి అంటే దాని వెనక ఫ్లాష్ బ్యాక్ ఉంది.
ఓడిన తరువాత దూరం :
జేడీ లక్ష్మీనారాయణ జనసేనలో చేరి 2019 ఎన్నికల్లో విశాఖ నుంచి లోక్ సభకు పోటీ చేశారు. ఆయన ఏకంగా 2 లక్షల 75 వేల ఓట్లను సాధించారు. ఒక విధంగా ఆయన అభ్యర్ధిత్వానికి పవన్ ఇమేజ్ కి వచ్చిన భారీ ప్రజాదరణగా అంతా విశ్లేషించారు. ఆయన జనసేనలో కొనసాగి ఉంటే 2024 లో ఎంపీ అయి ఉండేవారు అన్న చర్చ కూడా ఉంది. అయితే కొద్ది కాలానికే ఆయన జనసేనకు దూరం అయ్యారు. దానికి ఆయన కారణాలు వివరిస్తూ జనసేన అధినేత ప్వన్ కి లేఖ రాశారు.
నిలకడ లేని విధానం అంటూ :
తన పూర్తి సమయం ప్రజా సేవకే రాజకీయానికే కేటాయిస్తాను అని చెప్పిన పవన్ ఇపుడు మళ్ళీ సినిమాల్లోకి నటించడం ద్వారా తన నిలకడలేని విధానాన్ని చాటుకున్నారని జేడీ రాజీనామా లేఖలో పేర్కొన్నారు. అందుకే తాను జనసేన నుంచి నిష్క్రమిస్తున్నాను అని ఆయన చెప్పుకొచ్చారు. ఇపుడు ఆ రాజీనామా లేఖను కూడా పొందుపరుస్తూ జనసేన పొలిటికల్ మిస్సైల్ సోషల్ మీడియాలో చేసిన పోస్టు వైరల్ అవుతోంది.
జేడీ అదే రూట్ లో :
పవన్ ని తప్పుపడుతూ రాజీనామా చేసిన జేడీ తాను సైతం ఉద్యోగంలో చేరడాన్ని పొలిటికల్ మిస్సైల్ గుర్తు చేసింది అనుకోవాలి. రాజకీయాల్లో ఉంటూ జేడీ తన పూర్వాశ్రమానికి చేరువ ఎలా అయ్యారో అలాగే పవన్ కూడా తన పూర్వాశ్రమం అయిన సినిమాలను చేసుకోవడంలో తప్పు లేదు కదా అన్నదే ఈ పోస్టు అర్ధం గా చూడాలి. అంటే పవన్ మాటలు కాదు ప్రాక్టికల్ గా అన్నీ ఆలోచిస్తారని ఆయనకు నిలకడ లేదని విమర్శించడం తప్పు అన్నట్లుగా ఈ పోస్టు అంతరార్ధంగా ఉంది. మొత్తానికి భూమి గుండ్రంగా ఉంది అన్నట్లుగా జేడీ సైతం తన ఉద్యోగాన్ని తాను వెతుక్కున్నారు. మరి ఆయన రాజకీయాల్లో కొనసాగుతారో లేదో తెలియదు కానీ పవన్ మీద చేసిన వ్యాఖ్యలకు మాత్రం పొలిటికల్ మిస్సైల్ ఫ్లాష్ బ్యాక్ ని కెలికి మరీ రిటార్ట్ ఇచ్చేసింది.
