Begin typing your search above and press return to search.

జగన్ మీద సౌండ్ తగ్గింది...మ్యాటర్ అదేనా ?

ఇదిలా ఉంటే టీడీపీలో ఒక ఫ్యామిలీకి ఒక్కటే టికెట్ అని ఒక రూల్ అయితే ఉంది. దాంతో జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు తాడిపత్రి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న అస్మిత్ రెడ్డికే టికెట్ దక్కుతుందని అంటున్నారు.

By:  Satya P   |   25 Nov 2025 7:00 AM IST
జగన్ మీద సౌండ్ తగ్గింది...మ్యాటర్ అదేనా ?
X

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మీద జేసీ ఫ్యామిలీ జోరు అయితే తగ్గించిందా అన్న చర్చ నడుస్తోంది. గతంలో మాట్లాడితే చాలు జగన్ మీద పెద్ద ఎత్తున విరుచుకుని పడే జేసీ ఫ్యామిలీ ఇపుడు సౌండ్ తగ్గించింది అని అంటున్నారు. వ్యూహాత్మకమైన వైఖరిని ప్రదర్శిస్తోంది అని అంటున్నారు. దానికి కారణాలు చాలానే ఉన్నాయని అంటున్నారు.

జూనియర్ జేసీ రూటు :

ఇదిలా ఉంటే మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు జేసీ పవన్ రెడ్డి వైసీపీలో చేరేందుకు చూస్తున్నారు అని అంటున్నారు. ఆయన జగన్ కి సన్నిహితుడు అని కూడా అంటున్నారు. నిజానికి జేసీ పవన్ మొదట్లో వైసీపీలో చేరుతారు అని వినిపించింది. అయితే తండ్రి పిన తండ్రి టీడీపీలో ఉండడంతో ఆయన కూడా అదే దారిలో నడిచారు అని అంటున్నారు ఇక 2019లో అనంతపురం ఎంపీ సీటు ఇచ్చిన టీడీపీ 2024లో మాత్రం టికెట్ ఇవ్వలేదు. దాంతో పవన్ రాజకీయ ఆశలు అలాగే ఉండిపోయాయి. ఈ క్రమంలో ఆయన 2029 ఎన్నికల మీద ఫోకస్ పెట్టారు అని అంటున్నారు. ఆయన అనంతపురం నుంచి ఎంపీగా పోటీకి దిగాలని చూస్తున్నారు అని అంటున్నారు. దాని కోసం వైసీపీ వైపు చూస్తున్నారు అన్నది టాక్ వినిపిస్తోంది.

ఒకరికే టికెట్ :

ఇదిలా ఉంటే టీడీపీలో ఒక ఫ్యామిలీకి ఒక్కటే టికెట్ అని ఒక రూల్ అయితే ఉంది. దాంతో జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు తాడిపత్రి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న అస్మిత్ రెడ్డికే టికెట్ దక్కుతుందని అంటున్నారు. దాంతో పవన్ రెడ్డి తన రాజకీయం తాను చూసుకోవాలని భావిస్తున్నారు అని అంటున్నారు. ఒకే కుటుంబానికి చెందిన వారు రెండు పార్టీలలో ఉండడంతో తప్పు లేదని కూడా ఆయన అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. ఆ విధంగా చేస్తే తమ కుటుంబలో పదవులు అందరికీ దక్కుతాయి అన్న ఆలోచన కూడా ఉంది అని అంటున్నారు.

వైసీపీకి వర్తమానం :

ఇదిలా ఉంటే అబ్బాయ్ కోరిక ఆలోచన బాబాయ్ ప్రభాకర్ రెడ్డికి కూడా తెలుసు అని అంటున్నారు. అందుకే ఆయన ఈ మధ్య జగన్ మీద పెద్దగా విమర్శలు చేయడం లేదని అంటున్నారు. రాజకీయంగా చూస్తే తమ వారసులు పైకి రావాలన్న ఆలోచనతోనే ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే జేసీ ఫ్యామిలీ నుంచి పవన్ రెడ్డిని వైసీపీలో చేర్చుకునే విషయంలో వైసీపీ అధినాయకత్వం ఆలోచనలు చేస్తోంది అని అంటున్నారు. ఒక వైపు తాడిపత్రిలో జేసీ ఫ్యామిలీతో రాజకీయ పోరు సాగిస్తూ మరో వైపు అదే ఫ్యామిలీ నుంచి చేర్చుకుంటే క్యాడర్ కి తప్పుడు సంకేతాలు వెళ్తాయా అన్న చర్చ కూడా పార్టీలో సాగుతోంది అని అంటున్నారు. ఏది ఏమైనా జేసీ పవన్ మాత్రం ఫ్యాన్ నీడలో సేద తీరాలని చూస్తున్నారు అని అంటున్నారు. దాంతో వైసీపీ కీలక నిర్ణయమే తీసుకునే చాన్స్ ఉందని చెబుతున్నారు.