Begin typing your search above and press return to search.

భారీ సెట్స్.. యువ‌త‌రం ఆలోచ‌న‌.. కొత్త త‌రం సినిమాల లెక్క మారుతోందా?

భారీ సెట్స్.. భారీ బడ్జెట్.. గ్రాండ్ విజువల్స్.. ఇవన్నీ ఒకప్పుడు కమర్షియల్ సినిమాకు మెయిన్ ఎట్రాక్ష‌న్స్ గాకనిపించేవి.

By:  Sravani Lakshmi Srungarapu   |   24 Sept 2026 8:36 PM IST
భారీ సెట్స్.. యువ‌త‌రం ఆలోచ‌న‌.. కొత్త త‌రం సినిమాల లెక్క మారుతోందా?
X

భారీ సెట్స్.. భారీ బడ్జెట్.. గ్రాండ్ విజువల్స్.. ఇవన్నీ ఒకప్పుడు కమర్షియల్ సినిమాకు మెయిన్ ఎట్రాక్ష‌న్స్ గాకనిపించేవి. కానీ ఇప్పుడు పరిస్థితి క్రమంగా మారుతోంది. సినిమా ఎంత భారీగా కనిపిస్తుందన్న దానితో పాటు.. ఆ కథ ఎంత సహజంగా అనిపిస్తుందనేదే కీలకంగా మారుతోంది. ముఖ్యంగా కొత్త తరం డైరెక్ట‌ర్లు పెద్ద కాన్వాస్‌పై తమ జనరేషన్‌కు దగ్గరగా ఉండే ఆలోచనలు, పాత్రలు, సమస్యలను చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. సిగ్మా కూడా ఇదే మారుతున్న ధోరణికి మరో ఎగ్జాంపుల్‌గా నిలుస్తుందనే డిస్క‌ష‌న్ మొదలైంది.

హైస్ట్, యాక్షన్, అడ్వెంచర్ వంటి జానర్లు అంటే భారీ యాక్షన్ బ్లాక్స్, విదేశీ లొకేషన్స్, స్టైలిష్ క్యారెక్టర్స్ గుర్తొచ్చే పరిస్థితి ఉంది. అయితే కొత్త తరం డైరెక్ట‌ర్లు ఈ ఫార్ములాను పూర్తిగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. భారీ నేపథ్యాన్ని సృష్టించినప్పటికీ.. అందులోని క్యారెక్ట‌ర్లు మాత్రం ప్రేక్షకులకు చాలా దగ్గరగా కనిపించేలా కథను నిర్మిస్తున్నారు. సాధారణ మనుషులు, వారి డెసిష‌న్స్, స్నేహాలు, ఆశలు, తప్పులు, వాటి నుంచి వచ్చే పరిణామాలను భారీ కథల్లో భాగం చేస్తున్నారు. దీంతో స్కేల్ ఎంత పెరిగినా కథలోని ఎమోషన్ మాత్రం దూరం కాకుండా ఉండే అవకాశం ఏర్పడుతోంది.

ఇక యంగ్ డైరెక్ట‌ర్ల విషయంలో మరో ఆసక్తికరమైన మార్పు కనిపిస్తోంది. వారు తమకంటే ముందు తరాల ఆడియ‌న్స్ అభిరుచులను మాత్రమే దృష్టిలో పెట్టుకోకుండా.. తమ వయసు, తమ అనుభవాలు, తమ చుట్టూ కనిపించే ప్రపంచాన్ని కథల్లోకి తీసుకొస్తున్నారు. అందుకే కథ చెప్పే విధానంలో వేగం, హ్యూమర్, మ్యూజిక్, స్టైలిష్ ట్రీట్‌మెంట్‌తో పాటు రిలేటబిలిటీకి కూడా ప్రాధాన్యం పెరుగుతోంది. సిగ్మా విషయంలోనూ 24 ఏళ్ల జాస‌న్ సంజ‌య్ అనే యంగ్ డైరెక్ట‌ర్ దృష్టికోణం ఎలా తెరపై కనిపించబోతోందనేది ఆసక్తిని పెంచుతోంది.

మరోవైపు భారీ ప్రొడక్షన్ వాల్యూస్ కేవలం చూపించడానికి కాకుండా కథకు ఉపయోగపడేలా మారుతున్నాయి. పెద్ద సెట్ ఉన్నా అందులోని ప్రపంచం ప్రేక్షకులకు పరిచయం ఉన్న‌ట్టు అనిపించడం.. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నా పాత్రల ఎమోష‌న్స్ సహజంగా ఉండటం.. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం కొత్త తరం ఫిల్మ్‌మేకర్లకు మెయిన్ ఛాలెంజ్ గా మారుతోంది. అందుకే రాబోయే రోజుల్లో సినిమా ఎంత పెద్దది? అనే ప్రశ్నతో పాటు ఆ పెద్ద ప్రపంచంలో మన కథ ఎంత కనిపిస్తోంది? అనే ప్రశ్న కూడా కీలకంగా మారే అవకాశం ఉంది. కొత్త తరం డైరెక్ట‌ర్లు తీసుకొస్తున్న ఈ మార్పు ప్రేక్షకుల థియేట్రిక‌ల్ ఎక్స్‌పీరియెన్స్ ను ఎంతవరకు మార్చుతుందో చూడాలి.