Begin typing your search above and press return to search.

జపాన్ ట్రిప్ వెళుతున్నారా? ఇండియన్ స్పైసీ ఫ్యాక్టరీ మిస్ కావొద్దు

అందరూ అని చెప్పలేం కానీ కొందరు జపనీయులు భారత్ ను ఎంత ఇష్టపడతారంటే.. కొందరు భారతీయులు కూడా భారత్ ను అంతలా ఇష్టపడరేమో.

By:  Garuda Media   |   22 Aug 2025 10:00 AM IST
జపాన్ ట్రిప్ వెళుతున్నారా? ఇండియన్ స్పైసీ ఫ్యాక్టరీ మిస్ కావొద్దు
X

దేశం కాని దేశంలో భారతీయ రుచుల్నివండి వడ్డించటం కొత్తేం కాదు. కానీ.. ఇప్పుడు చెప్పే రెస్టారెంట్ కు ఒక స్పెషల్ ఉంది. అది మీరు కలలో కూడా ఊహించలేరు. భారత్ మీద ఇంతటి ప్రేమా? అని అవాక్కు కావటమే కాదు.. వారి ప్రేమకు ఫిదా అయిపోతారంతే. భారతీయులకు జపాన్ కొత్తేం కాదు. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే లోపు ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒక దగ్గర జపాన్ ఉత్పత్తుల్ని వినియోగించని వారు ఉండరు. జపనీయులు అన్నంతనే మెటిరియలిస్టిక్ మనుషులుగా భావించే వారికి కొదవ ఉండదు. అయితే.. ఆ భావనలో నిజం ఎంత? అంటే కచ్ఛితంగా అదో ప్రశ్నే.

అందరూ అని చెప్పలేం కానీ కొందరు జపనీయులు భారత్ ను ఎంత ఇష్టపడతారంటే.. కొందరు భారతీయులు కూడా భారత్ ను అంతలా ఇష్టపడరేమో. ఇప్పుడు చెప్పేది అలాంటి ఒక జపనీయుల జంట గురించే. జపాన్ లో ఇండియన్ ఫుడ్ దొరకటం కాస్త కష్టమైన వ్యవహారం. ఆ దేశ రాజధాని టోక్యోలో పెద్దగా ఇబ్బంది ఉండదు కాదు. కానీ.. అలా నిర్వహించే రెస్టారెంట్లు భారతీయులు.. భారత మూలాలు ఉన్నోళ్లు నిర్వహించేవే. కానీ.. ఒక జపనీయ జంట భారత్ మీదా.. భారత ఆహారం మీద ఉన్న ప్రేమతో ఒక రెస్టారెంట్ ఓపెన్ చేయటమే కాదు.. వారే స్వయంగా వండి.. వడ్డించే ఇస్పెషల్ ఉదంతం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.

‘ఇండియన్ స్పైసీ రెస్టారెంట్’ పేరుతో నిర్వహిస్తున్న ఈ హోటల్ కు యజమానులు ఒక జపనీయ జంట. వారు గతంలో కోల్ కతాతో పాటు చెన్నైలోనూ పని చేశారు. తమ దేశానికి తిరిగి వెళ్లిన తర్వాత బెంగాలీ.. దక్షిణాది వంటల్ని జపనీయులకు పరిచయం చేసేందుకు వీలుగా ఈ రెస్టారెంట్ ను ప్రారంభించారు. ఈ రెస్టారెంట్ బయట భారతీయ జాతీయ పతాకంతో స్వాగతం పలకటమే కాదు.. లోపలకు వెళ్లిన తర్వాత సర్ ప్రైజ్ ల మీద సర్ ప్రైజ్ లు ఉంటాయి.

భారతీయ సంస్క్రతిని అడుగడుగునా పరిచయం చేస్తూ డిజైన్ చేసిన ఈ రెస్టారెంట్ లో దీని యజమాని అయిన మహిల అచ్చ భారత చీరకట్టుతో దర్శనమిస్తారు. ప్రతి రోజూ ఆమె చీరను కట్టుకుంటారు.అంతేనా.. అరిటాకులో భోజనాన్నివండి వడ్డిస్తారు.కలలో కూడా ఊహించలేని మురుకుల్ని కూడా వారు సర్వ్ చేస్తారు. భారతీయ సంప్రదాయంలో రెండు చేతులతో నమస్కరించి..

లోపలకు ఆహ్వానిస్తారు. లోపలకు వెళ్లగానే రాధాక్రిష్ణుల విగ్రహాలు.. వీణ.. మట్టి పాత్రలుదర్శనమిస్తాయి. బెంగాలీ.. దక్షిణాది వంటకాల్ని పరిచయం చేసే ఈ రెస్టారెంట్ ను ఏర్పాటు చేసిన ఉద్దేశం ఏమిటి? అంటే.. వారు కొంతకాలం భారతదేశంలో పని చేయటం.. మన రుచులు వారిని ఆకర్షించటంతో.. మన దేశం మీద ఉన్న అభిమానంతో ఏకంగా ఒక రెస్టారెంట్ ను ఏర్పాటు చేవారు

వీరికి కోల్ కతా.. ఢిల్లీల్లో రెస్టారెంట్ నిర్వహించిన అనుభవం ఉంది. జపనీయులకు భారతీయ రుచుల్ని పరిచయం చేస్తున్నామన్న ఆనందం తమకుందని వారు చెప్పే మాటలకు ప్రతి భారతీయుడు ఫిదా కావాల్సిందే. ఇంతకు వీరు ప్రారంభించిన ఇండియన్ స్పైసీ ఫ్యాక్టరీ ఎక్కడ ఉందంటే.. జపాన్ రాజధాని టోక్యోకు దాదాపు వెయ్యి కిలోమీటర్ల దూరంలో. అంత దూరాన భారత రెస్టారెంట్ ను నిర్వహించటం చూస్తే.. భారత్ మీద వారికి ఉన్నప్రేమాభిమానాలు మనల్ని మరింత ఆశ్చర్యానికి గురి చేయటం ఖాయం.