నిన్న అమెరికా.. నేడు జపాన్.. విదేశీయులకు రెడ్ కార్డ్.. అసలు ఏమైంది?
కలల దేశంలో స్వంత ఇల్లు కట్టుకుని.. రేపటి భవిష్యత్తును సురక్షితంగా మలుచుకోవాలనే ప్రతి ఒక్కరి ఆశల ప్రయాణంలో ఇది ఒక చిన్న పరీక్ష మాత్రమే
By: A.N.Kumar | 3 Oct 2026 3:15 PM ISTకలల దేశంలో స్వంత ఇల్లు కట్టుకుని.. రేపటి భవిష్యత్తును సురక్షితంగా మలుచుకోవాలనే ప్రతి ఒక్కరి ఆశల ప్రయాణంలో ఇది ఒక చిన్న పరీక్ష మాత్రమే. వేల మైళ్ల దూరం నుంచి వచ్చి జపాన్ నేలపైన చెమటోడ్చి రాత్రింబవళ్ళు కష్టపడుతున్న లక్షలాది మంది విదేశీయుల గుండెల్లో ఈ ఫీజు పెంపు వార్త ఒక్కసారిగా అలజడి రేపింది. కానీ ఎన్ని సవాళ్లు ఎదురైనా.. ఏళ్ల తరబడి పడ్డ కష్టం, కన్న కలలు ఏ నిర్ణయం ముందూ ఓడిపోవు!
విదేశాల్లో స్థిరపడాలనే కోరిక స్వంత ప్రతిభతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే ఆకాంక్ష ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ముఖ్యంగా సాంకేతికతకు నిలయమైన జపాన్ దేశంలో పర్మినెంట్ రెసిడెన్సీ పొంది, తమ భవిష్యత్తును సురక్షితంగా నిర్మించుకోవాలని లక్షలాది మంది విదేశీ యువత, నిపుణులు నిరంతరం శ్రమిస్తుంటారు. అయితే పర్మినెంట్ రెసిడెన్సీ (పీఆర్) ప్రాసెస్ ఫీజును ప్రస్తుతం ఉన్న 10,000 జపాన్ కరెన్సీ నుంచి ఏకంగా 200,000కు పెంచాలని జపాన్ ప్రభుత్వం ప్రతిపాదించడం సంచలనంగా మారింది. అమెరికా లాగానే జపాన్ కూడా విదేశీయులకు రెడ్ కార్పేట్ పరిచింది. మొదటి చూపులో ఇది భారీ ఆర్థిక భారంగా అనిపించినప్పటికీ ఈ నిర్ణయాన్ని కేవలం ఒక అడ్డంకిగా మాత్రమే కాకుండా మీ కలలను మరింత బలంగా మార్చుకునే ఒక అవకాశంగా చూడాలి.
ఏ దేశమైనా తన నియమ నిబంధనలను బలోపేతం చేసుకోవడం సహజ పరిణామం. జపాన్ ప్రస్తుతం జనాభా క్షీణత కార్మికుల కొరత వంటి సమస్యలను ఎదుర్కొంటోంది. ఐటీ, హెల్త్‌కేర్, తయారీ, హాస్పిటాలిటీ వంటి కీలక రంగాల్లో ప్రతిభావంతులైన విదేశీ నిపుణుల అవసరం అక్కడ మునుపటి కంటే ఇప్పుడే ఎక్కువగా ఉంది. విదేశీయులను ఆహ్వానిస్తూనే పన్నుల చెల్లింపులు, చట్టపరమైన బాధ్యతలపై స్పష్టత పెంచేందుకు ప్రభుత్వం ఈ మార్పులు చేపడుతోంది. ఈ క్రమంలో పెరిగే ఫీజు తాత్కాలిక సవాలు మాత్రమే కానీ మీ నైపుణ్యాలకు, కష్టపడే తత్వానికి అడ్డుకట్ట వేయలేదు.
నిజమైన గమ్యం వైపు సాగే ప్రయాణంలో ఎదురయ్యే చిన్న చిన్న మార్పులు మిమ్మల్ని మరింత సంసిద్ధులను చేస్తాయి. విద్యార్థులుగా వెళ్లి ఉద్యోగాలు సాధించినవారు.. దీర్ఘకాలంగా అక్కడ శ్రమిస్తున్న కుటుంబాలు ఈ మార్పులతో దిగులు చెందాల్సిన అవసరం లేదు. ప్రణాళికాబద్ధంగా ఆర్థిక వ్యూహాలు నిరూపించుకోవడం.. అర్హతలను నిలబెట్టుకోవడం ద్వారా పర్మినెంట్ రెసిడెన్సీ సాధించడం సులభమవుతుంది.
ఫీజుల పెంపు అనేది ఆర్థిక పరిమాణం మాత్రమే. కానీ మీ నిబద్ధత కృషి సాధించాలనే సంకల్పం ముందు ఏ మార్పూ పెద్దది కాదు. జపాన్‌లో సుస్థిరమైన భవిష్యత్తును నిర్మించుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ మార్పును సానుకూలంగా స్వీకరించి తమ లక్ష్యం వైపు మరింత పట్టుదలతో ముందుకు సాగాలి.
