అలర్ట్... తదుపరి మహమ్మారి ముప్పు అక్కడి నుండేనా..?
కరోనా మహమ్మారి 2019 డిసెంబర్ లో చైనాలోని వూహన్ లో మొదలై 2020 ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన సంగతి తెలిసిందే.
By: Raja Ch | 11 Oct 2025 10:04 PM ISTకరోనా మహమ్మారి 2019 డిసెంబర్ లో చైనాలోని వూహన్ లో మొదలై 2020 ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన సంగతి తెలిసిందే. ఈ వైరస్ ధాటికి ప్రపంచ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో మరణాలు సంభవించాయి. దాని ప్రభావం నుంచి చాలా కుటుంబాలు ఇప్పటికీ కోలుకోలేదని అంటారు. ఈ సమయంలో.. తదుపరి మహమ్మారి ముప్పుపై అంతర్జాతీయ మీడియాలో కథనాలు మొదలయ్యాయి!
అవును... కరోనా వైరస్ మహమ్మారి తర్వాత.. తదుపరి మహమ్మారి ముప్పుపై అంతర్జాతీయ మీడియాలో కథనాలు మొదలయ్యాయి! ఇందులో భాగంగా... జపాన్ లో సీజనల్ ఇన్‌ఫ్లుఎంజా తీవ్రంగా, అసాధారణంగా ముందుగానే వ్యాప్తి చెందుతోందని.. దీనితో ఆ దేశం పెద్ద ప్రజారోగ్య సంక్షోభం అంచున ఉండవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
జపాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం... ప్రస్తుతం సుమారు 3,000 ఆసుపత్రులలో 4,030 కి పైగా ఫ్లూ కేసులు నమోదయ్యాయి. దీంతో... ఇది దేశాన్ని దాని అంటువ్యాధి పరిమితికి మించి నెట్టివేసిందని అంటున్నారు. వాస్తవానికి దేశంలో సాధారణంగా డిసెంబర్ లో ఫ్లూ కేసులు పెరుగుతాయి కానీ.. ఈ ఏడాది పెరుగుదల ఒక నెల ముందుగానే ప్రారంభమైందని చెబుతున్నారు.
ప్రధానంగా పిల్లలలో ఈ వ్యాధి ఎక్కువగా వ్యాప్తి చెందడంతో జపాన్ లో సుమారు 100కి పైగా పాఠశాలలు, కిండర్ గార్టెన్లు, పిల్లల సంరక్షణ కేంద్రాలు ఇప్పటికే మూసివేయబడ్డాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో... ప్రజలను మాస్కులు ధరించడం, రెగ్యులర్ గా చేతుల పరిశుభ్ర పరుచుకోవడం వంటి జాగ్రత్త చర్యలు పాటించాలని జపాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఈ నేపథ్యంలోనే... ప్రపంచవ్యాప్త ప్రయాణం, పెరిగిన హ్యూమన్ మొబిలిటీ కారణంగా వైరస్ వేగవంతమైన వ్యాప్తికి ఆజ్యం పోసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు! ఈ సందర్భంగా స్పందించిన హక్కైడోలోని హెల్త్ సైన్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ యోకో సుకామోటో.. ఇతర దేశాలలో కూడా ప్రారంభ ఫ్లూ తరంగాలు నివేదించబడుతున్నాయని తెలిపారు.
కాగా మెషిన్ లెర్నింగ్, ఉపగ్రహ డేటాను ఉపయోగించి చేసిన జాయింట్ రీసెర్చ్ సెంటర్ (జే.ఆర్.సీ) మోడలింగ్ అధ్యయనం ప్రకారం... ప్రపంచ భూ ఉపరితలంలో 9.3% ఎబోలా, జికా, క్రిమియన్-కాంగో హెమరేజిక్ జ్వరం వంటి వ్యాధుల వ్యాప్తికి ఎక్కువ ప్రమాదం ఉందని వెల్లడించింది. అలాగే అంటువ్యాధులు, మహమ్మారిని కలిగించే సామర్థ్యం ఉన్న వ్యాధుల జాబితా పరిశీలనలో ఉందని తెలిపింది.
ఇందులో భాగంగా... కోవిడ్-19, మార్బర్గ్ వైరస్ వ్యాధి (ఎం.వీ.డీ), లస్సా జ్వరం, మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (ఎం.ఈ.ఆర్.ఎస్), అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (ఏ.ఆర్.ఎస్), నిపా వైరస్ వ్యాధి (ఎన్.ఐ.వీ), రిఫ్ట్ వ్యాలీ జ్వరం (ఆర్.వీ.ఎఫ్.) వంటివి ఉన్నాయి!
