Begin typing your search above and press return to search.

జంతర్ మంతర్...పదవులు ఊస్టింగ్ !

జంతర్ మంతర్ వద్ద ఆందోళన అంటే చాలు అతి పెద్ద పదవీ గండానికి అధికారంలో ఉన్న వారు సిద్ధ పడాల్సిందే అన్నది బలపడిపోతున్న వైనం అవుతోంది.

By:  Satya P   |   7 Oct 2026 11:38 PM IST
జంతర్ మంతర్...పదవులు ఊస్టింగ్ !
X

జంతర్ మంతర్ ఢిల్లీలో ఎప్పటి నుంచో ఉద్యమాలకు వేదికగా ఉంది. అయితే ఉద్యమించడమే తప్ప రిజల్ట్ అన్నది దేవుడి మీదకే భారం వేసేయడమే షరా మామూలుగా మారిపోయిన వేళ కాక్రోచ్ పార్టీ అక్కడ పొరాటం చేసి ఏకంగా కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేతనే రాజీనామా చేయింది. 12 ఏళ్లకు పైగా దేశంలో నిరాటంకంగా అధికారంలో ఉంటూ ఎలాంటి ఉద్యమాలనైనా ఉఫ్ అని ఊదేసే అత్యంత బలమైన బీజేపీకే జంతర్ మంతర్ తొలి షాక్ ఏంటో తెలిసి వచ్చింది. అలా ఇన్నేళ్ళ పాలనలో తొలి వికెట్ కేంద్ర మంత్రి రాజీనామా రూపంలో పడిపోయింది. ఇపుడు అదే అతి పెద్ద పొలిటికల్ సెంటిమెంట్ గా మారింది. అందుకే జంతర్ మంతర్ అంటే రాజకీయ పొలికేకగా మారుతోంది. పొలిటికల్ షాకుల నుంచి పోస్టులను షేక్ చేసేంతవరకూ జంతర్ మంతర్ అగ్గి రాజేసి మరీ అంతు చూసేస్తోంది.

టచ్ చేస్తే అంతేనా :

జంతర్ మంతర్ వద్ద ఆందోళన అంటే చాలు అతి పెద్ద పదవీ గండానికి అధికారంలో ఉన్న వారు సిద్ధ పడాల్సిందే అన్నది బలపడిపోతున్న వైనం అవుతోంది. అందుకే ఆ వేదికకు అంత డిమాండ్ ఏర్పడింది. ఇదిలా ఉంటే ఈ నెల 10న కాక్రోచ్ పార్టీ జంతర్ మంతర్ వద్ద భారీ నిరసనలకు పిలుపు ఇచ్చింది. నిజానికి ఆ రోజున ఎలాంటి ఆందోళనలకు ఢిల్లీ పోలీసులు అయితే అనుమతి ఇవ్వలేదు, కానీ విద్యార్ధి ప్లస్ జెన్ జీ యువత కలిపి మరోసారి యువ కెరటంగా దూసుకుని వస్తారా అన్న చర్చ సాగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రాజీనామా కోరుతూ సీజేపీ ఆధ్వర్యంలో అతి పెద్ద నిరసనకు అపుడే రంగం సిద్ధం చేశారు. దాంతో ఈ నెల 10న ఏమి జరుగుతుంది అన్నదే అంతటా ఉత్కంఠ ఏర్పాడింది.

కాంగ్రెస్ దూకుడు :

ఇదిలా ఉంటే దేశంలో గ్రాండ్ ఓల్డ్ పార్టీ లోక్ సభంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా విషయంలో డిమాండ్ చేస్తోంది. ఈ విషయంలో తాము ఎక్కడా తగ్గకూడదని నిర్ణయించుకుంది. దాంతో మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం ఎదుట బైఠాయించి భారీ ఆందోళన చేసింది. బుధవారం అయితే మెరుపు ఆందోళనతో జంతర్ మంతర్ వద్ద అలజడి రేపింది. నిజానికి సీఈసీ ఆఫీసుకి వెళ్ళేందుకు మూడు బస్సులలో కాంగ్రెస్ ఎంపీలు బయల్దేరారు. అక్కడికి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు మధ్యలోనే అడ్డుకోవడంతో జనతర్ మంతర్ వద్ద నిరసనలకు కాంగ్రెస్ దిగింది. దీంతో అక్కడ అంతా హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. గంటల పాటు సాగిన ఉద్రిక్తతల నేపథ్యంలో జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ ఎంపీలను పోలేసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీల మీద లాఠీ చార్జి చేశారని ప్రియాంకా గాంధీ ఆరోపిస్తున్నారు.

రాజీనామా ఒత్తిడితో :

ఇక సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఒత్తిడి పెడుతోంది. వరసగా రెండు రోజులుగా ఢిల్లీ వేదికగా భారీ నిరసనలు గంటల తరబడి చేయడం అరెస్టులు కావడం చూస్తూంటే కాంగ్రెస్ లో వేడి మామూలుగా లేదు, మరో వైపు సీజేపీ కూడా తన ఉగ్ర రూపాన్ని చూపించబోతోంది. ఈ నేపథ్యంలో జంతర్ మంతర్ మళ్లీ చర్చకు వస్తోంది. ఈసారి జంతర్ మంతర్ ఎవరికి పదవీ గండం తేనుంది అన్నదే కీలక చర్చ గా ఉంది. సీఈసీ రాజీనామా ఎవరి ఒత్తిడితో జరుగుతుంది అన్నది మరో చర్చ. ఈ క్రెడిట్ తమకే దక్కాలని కాంగ్రెస్ చూస్తోంది. సీజేపీ భారీ ఆందోళన తరువాత కనుక ఏమి జరిగినా రేసులో వెనకబడకూడదు అన్నది కాంగ్రెస్ ఉద్దేశ్యంగా ఉంది. సో ఓవర్ టూ జంతర్ మంతర్ అన్నట్లుగా ఢిల్లీ పొలిటికల్ సీన్ అయితే హాట్ గా ఉంది.