బంగ్లాదేశ్ లో హిందూ హత్య... జాన్వీ కపూర్ రియాక్షన్ వైరల్!
ఈ నేపథ్యంలో 28 ఏళ్ల నటి జాన్వీ కపూర్ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ ఈ ఘటనపై స్పందించారు
By: Raja Ch | 26 Dec 2025 12:15 AM ISTదేశంలో ఎంత కీలక ఘటన జరిగినా.. ఓ పక్క దేశం మొత్తం స్పందించే విషయమైనా చాలా మంది స్టార్లు, సెలబ్రెటీలు తమకేమీ పట్టదన్నట్లు ఏమాత్రం స్పందించారు. నిజంగా వారి చెవిన ఆ విషయాలు పడవో లేక వ్యూహాత్మక గైర్హాజరో తెలియదు కానీ... మరికొంతమంది మాత్రం దేశంలోని పలు కీలక విషయాలపై వారి వారి అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెబుతారు. తాజాగా జాన్వీ కపూర్ అదే చేశారు!
అవును... బంగ్లాదేశ్ లో హిందూ మతానికి చెందిన వ్యక్తి దీపు చంద్రదాస్ ని ఓ ముఠా తీవ్రంగా కొట్టి చంపేసిన సంగతి తెలిసిందే. అనంతరం అతని మృతదేహాన్ని చెట్టుకు కట్టేసి నిప్పంటించింది. ఈ ఘోరంపై భారత్ రగిలిపోయింది. ఈ సమయంలో మరికొంతమంది తమ నిరసనను ఢిల్లీలోని బంగ్లాదేశ్ దౌత్య కార్యాలయం ముందు కాస్త ఘాటుగానే వెల్లడించారు.
ఈ నేపథ్యంలో 28 ఏళ్ల నటి జాన్వీ కపూర్ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ ఈ ఘటనపై స్పందించారు. ఇందులో భాగంగా... బంగ్లాదేశ్ లో జరుగుతున్నది పూర్తి అనాగరికమని.. ఇది ఊచకోత అని.. అది ఒక వివక్త సంఘటన కాదని తెలిపారు. ఈ అమానవీయ బహిరంగ హత్యాకాండ గురించి మీకు తెలియకపోతే.. దాని గురించి చదవాలని, వీడియోలు చూడాలని, ప్రశ్నలు అడగాలని ఆమె సూచించారు.
అలా అవన్నీ తెలుసుకున్నప్పటికి మీకు కోపం రాకపోతే.. మనకు తెలియకముందే మనల్ని నాశనం చేసేది సరిగ్గా ఇలాంటి కపటత్వమే అని జాన్వీ కపూర్ రాశారు. మన సొంత సోదరులు, సోదరీమణులు దహనం చేయబడుతుండగా.. ప్రపంచవ్యాప్తంగా సగం విషయాల గురించి మనం ఏడుస్తూనే ఉంటామని.. మనం మానవత్వాన్ని మరిచిపోయే ముందు ఏ రూపంలోనైనా ఉగ్రవాదాన్ని ఖండించాలని తెలిపారు.
దీంతో.. ఆమె వ్యాఖ్యలు ఒక్కసారిగా వైరల్ గా మారాయి. రెడ్డిట్ సహా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో ఇవి విస్తృతంగా షేర్ చేయబడ్డాయి. ఈ సందర్భంగా ఈ విషయంపై మాట్లాడినందుకు జాన్వీ కపూర్ ని నెటిజన్లు అభినందిస్తున్నారు. ఈ సందర్భంగా.. ఆమె తల్లి కోరుకున్న విధంగా ఆమె కేవలం నటించడమే కాదు.. ఆమె ఇంకా ఎదైనా చేయగలదు అంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు.
మరోవైపు.. ఆమె దీపు చంద్రదాస్ ను దారుణంగా కొట్టి చంపడం, బంగ్లాదేశ్ లో హిందువులను దారుణంగా ఊచకోత కోస్తుండటం.. వంటి విషయాలను తెలుసుకుంటుంది, తన చుట్టూ ఏమి జరుగుతుంటుందో గమనిస్తుంటుంది.. ఈ సమయంలో ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని ఖండించడానికి నిజమైన ధైర్యం తనకు ఉందని ఆమె రుజువు చేసుకుంది.. ఇందులో ఎలాంటి కపటత్వమూ లేదు. తమ విలువైన ముస్లిం మార్కెట్ డబ్బును కోల్పోయే భయంతో చాలా మంది బాలీవుడ్ నటులు స్కిప్ చేసినట్లు ఆమె ప్రవర్తించలేదు అని పలువురు అభిప్రాయపడుతున్నారు.
