జనసేనాని సెర్చింగ్...సైన్యానికి జాక్ పాట్ !
జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి పుష్కర కాలం వయసు పూర్తి అయింది. రెండు ఎన్నికలను ఆ పార్టీ చూసింది.
By: Satya P | 1 April 2026 9:15 AM ISTజనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి పుష్కర కాలం వయసు పూర్తి అయింది. రెండు ఎన్నికలను ఆ పార్టీ చూసింది. ఇక పొత్తులో భాగంగా కూటమిలో కీలక భాగస్వామిగా అధికారం అందుకుని రెండేళ్ళుగా పవర్ లో ఉంది. ఇదే సరైన సమయం పార్టీని మరింతగా పటిష్టం చేసుకునేందుకు అని జనసేనలో వినిపిస్తున్న మాట. తక్షణం స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. వీటి ద్వారా గ్రౌండ్ లెవెల్ దాకా జనసేనకు మంచి నాయకత్వ అందుబాటులోకి వస్తుందని అంటున్నారు. ఆ మీదట మూడేళ్ళలో సార్వత్రిక ఎన్నికలు వస్తాయి. దాంతో ఆ ఎన్నికల్లో జనసేన తన రాజకీయ బలాన్ని మరింతగా పెంచుకుంటుందని అంటున్నారు.
అతి పెద్ద ప్లస్ పాయింట్ :
జనసేనకు కలిసి వస్తున్న అంశాలు ఎన్నో ఉన్నాయి. కేంద్రంలో బలంగా ఉన్న బీజేపీతో అలాగే ఏపీలో క్షేత్ర స్థాయిలో పటిష్టంగా ఉన్న టీడీపీతో పొత్తులో ఉంది. దానితో పాటు ఈసారి అంటే 2029 ఎన్నికల్లో పెద్ద ఎత్తున అసెంబ్లీ ఎంపీ సీట్లు పెరగబోతున్నాయి. దాంతో జనసేనకు ఊహించని విధంగా తన బలాన్ని పెంచుకునే చాన్స్ దక్కబోతోంది అని అంటున్నారు. జనసేన జెండాలను 2014 నుంచి మోస్తూ పార్టీ కోసం పనిచేస్తున్న వారికి ఈసారి జాక్ పాట్ తగలబోతోంది అని అంటున్నారు.
కష్టించి పనిచేస్తే :
జనసేన వచ్చే ఎన్నికల్లో ఇంతకు రెట్టింపు సీట్లలో పోటీ చేస్తుంది అని అంటున్నారు. దాంతో కష్టించి పనిచేసే వారికి సీట్లు దక్కుతాయని అంటున్నారు. ఈ విషయంలో పార్టీ కూడా పూర్తిగా ఫోకస్ పెట్టింది అని అంటున్నారు. ఇక 2019, 2024 ఎన్నికల్లో జనసేన అభ్యర్ధులుగా పోటీ చేసిన వారు అంతా దాదాపుగా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. అందులో అతి కొద్ది మంది మాత్రమే జనసేనలో మొదటి నుంచి ఉన్న వారు. అయితే 2019లో ఒంటరి పోరులో జనసేన ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. కానీ 2024 లో మాత్రం పొత్తులో 21 కి 21 సీట్లూ గెలిచి సెంట్ పర్సెంట్ స్ట్రైక్ రేటుని సాధించింది. అయితే ఇలా గెలిచిన ఎమ్మెల్యేలలో అనేక మంది ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారే ఉన్నారని అంటున్నారు.
న్యాయం చేయాలనే :
దాంతో ఈసారి జనసేనలో ఉంటూ పూర్తి కాలం పార్టీని అభివృద్ధి చేస్తూ వచ్చిన వారికి ప్రయారిటీ ఇవ్వాలని జనసేన అధినాయకత్వం డిసైడ్ అయింది అని అంటున్నారు. దాంతో జనసేన అధినాయకత్వం ఈ విషయంలో సెర్చింగ్ మొదలెట్టిందని అంటున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా మూడేళ్ళ సమయం ఉంది కాబట్టి ఈ టైం ని సద్వినియోగం చేసుకుంటూ బలమైన అభ్యర్ధులు సమర్ధత పనితీరు నిబద్ధత కలిగిన వారిని తాము ఎంపిక చేసుకున్న నియోజకవర్గలలో గుర్తించే పనిలో జనసేన ఉంది అని అంటున్నారు.
భావజాలం కూడా జనంలోకి :
వారిని ప్రోత్సహించాలని కూడా పార్టీ చూస్తోంది అని అంటున్నారు రేపటి రోజున అవకాశం వారికే ఇస్తే పార్టీ మరింతగా వృద్ధి చెందుతుందని అంతే కాకుండా తమ సొంత భావజాలం కూడా జనంలోకి విస్తృతంగా వెళ్తుందని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు అయితే అనేక రకాలైన వివాదాలతో చిక్కుకుని పార్టీకి ఇబ్బందులు కలిగిస్తున్నారు అని అంటున్నారు. రాయలసీమలో చూస్తే ఒక ఎమ్మెల్యే లైంగిక వేధింపుల ఇష్యూలో చిక్కుకోవడం పార్టీని డిఫెన్స్ లో పడేసింది అని గుర్తు చేస్తున్నారు. మొత్తం మీద కావాల్సినంత సమయం ఉంది, అవకాశాలు చేతిలో ఉన్నాయి కాబట్టి జనసైన్యం కనుక గట్టిగా కష్టపడితే జాక్ పాట్ కొట్టినట్లే అని అంటున్నారు. మరి జనసేన తరఫున వచ్చే ఎన్నికల్లో జెండా ఎత్తిన వారు ఎంతమంది టికెట్లు సాధిస్తారు అన్నది అయితే చర్చగా ఉంది.
