విజయ్ పార్టీ జెండాతో పవన్
నిజానికి ఎన్నో పార్టీలు ఉన్నాయి. కానీ ఏరి కోరి ఎందుకు ఎంచుకున్నారు అన్నదే ప్రశ్న. ఇటీవలనే లక్షలాది మందితో భారీ సభని నిర్వహించారు.
By: Satya P | 31 Aug 2025 9:57 AM ISTజనసేన అధినేత పవన్ మెడలో తమిళ సూపర్ స్టార్ ఒక రాజకీయ పార్టీ అదినేత విజయ్ పార్టీ కండువాj పడింది.అభిమానులు ముచ్చట పడి మరీ ఈ కండువాను కప్పేసారు. వారు కప్పారని కాదు గానీ పవన్ ఎలాంటి భేషజం లేకుండా కప్పుకోవడమే విశేషం. ఒక విధంగా చూస్తే కనుక పవన్ చాలా స్పోర్టివ్ గా దీనిని తీసుకున్నారనే చెప్పాలి.
టీవీకే జెండా ఎందుకు :
నిజానికి ఎన్నో పార్టీలు ఉన్నాయి. కానీ ఏరి కోరి ఎందుకు ఎంచుకున్నారు అన్నదే ప్రశ్న. ఇటీవలనే లక్షలాది మందితో భారీ సభని నిర్వహించారు. విజయ్ క్రేజ్ ఏమిటన్నది దేశం మొత్తానికి తెలిసింది. ఈసారి తమిళనాడు లో గెలిచే పార్టీ విజయ్ దే అన్నంతగా ఆ సభ రీసౌండ్ చేసింది. దాంతో విజయ్ పాలిటిక్స్ లో ఒక సంచలనంగా మారింది. అందుకేనా ఆయన పార్టీ జెండా పవన్ పార్టీ అభిమానులకు తెగ నచ్చేసింది అన్న చర్చ సాగుతోంది.
పొత్తులు లేవు సింగిల్ :
ఇక చూస్తే కనుక విజయ్ పార్టీ ఎక్కడా ఎవరితోనూ పొత్తులు ఉండవని సింగిల్ గానే వస్తామని స్పష్టంగా చెప్పింది. ఏకంగా సీఎం పదవి కే గురిపెట్టింది. ఇది పవన్ పార్టీ అభిమానులకు బాగా నచ్చేసింది అని అంటున్నారు.
అభిమానుల సంకేతమా :
పవన్ చేతికి టీవీకే జెండా ఇచ్చి కండువా కప్పారు అంటే జనసేన కూడా సింగిల్ హాయ్
గా బరిలోకి దిగి సీఎం సీటుకు గురి పెట్టాలని కోరుతున్నారా అన్న చర్చ సాగుతోంది. విజయ్ కూడా సినిమా హీరోనే. ఆయనకు అక్కడ ఉన్న గ్లామర్ పవన్ కి కూడా ఏపీలో ఉంది కదా అన్న భావన వారిలో ఎక్కడో ఉందా అన్న చర్చ సాగుతోంది మొత్తానికి జనసేన సభ లో విజయ్ పార్టీ జెండా రాజకీయ కలకలం రేపిందనే చెప్పాలి.
