Begin typing your search above and press return to search.

అందరూ కలసి వైసీపీ మీద పడతారా ?

అందుకే ఎందరు కాదన్న వైఎస్సార్ వారసురాలు అన్న ఏకైక ట్యాగ్ లైన్ కారణంగానే షర్మిలను ఏపీసీసీ ప్రెసిడెంట్ గా కొనసాగిస్తున్నారు అని కూడా చెబుతారు.

By:  Satya P   |   17 Jun 2026 9:40 AM IST
అందరూ కలసి వైసీపీ మీద పడతారా ?
X

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని వైసీపీ చూస్తోంది. అయితే వైసీపీని ఎలాగైనా దెబ్బ తీయాలని కూటమి పార్టీలు పట్టుదలగా పనిచేస్తున్నాయి. మరో వైపు వైసీపీకి ప్రతిపక్షంలోనూ అంతగా సఖ్యత లేదు. ఒంటరి పోరాటం చేస్తోంది. వైసీపీని తగ్గించి తాము పెరగాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటోంది. అందుకే ఎందరు కాదన్న వైఎస్సార్ వారసురాలు అన్న ఏకైక ట్యాగ్ లైన్ కారణంగానే షర్మిలను ఏపీసీసీ ప్రెసిడెంట్ గా కొనసాగిస్తున్నారు అని కూడా చెబుతారు.

జనసేన కమిటీతో :

ఇదిలా ఉంటే ఇన్నాళ్ళూ జనసేన మీద ఉన్న ఒకే ఒక్క ఆరోపణ సంస్థాగతంగా పార్టీని అభివృద్ధి చేయరని. అయితే ఇటీవల కాలంలో పవన్ జోరు పెంచారు. ఉద్యమి పేరుతో సభ్యత్వ నమోదు సాగింది. సాధిక్ అని కొత్త తరాన్ని కీలక బాధ్యతలలో నియమించారు. జనసేన సభ్యత్వాన్ని 20 లక్షలకు పెంచుకున్నారు. ఈ క్రమంలో జనసేనలోకి రావాలని చూస్తున్న వారిని ఆహ్వానించడమే కాకుండా ఏ ఏ జిల్లాలలో బలమైన నాయకత్వం కావాలని అనుకుంటున్నారో అక్కడ ఆపరేషన్ ఆకర్ష్ ని అమలు చేయాలని చూస్తున్నారు. దాంతో జనసేన మెయిన్ టార్గెట్ వైసీపీ అని అంటున్నారు.

మాజీ వైసీపీ నేతలతో :

ఇక పదనాలుగు మంది సభ్యులతో జనసేన ఏర్పాటు చేసిన జాయింగ్స్ కమిటీలో పలువురు మాజీ వైసీపీ నేతలు ఉన్నారు. వీరిని అక్కడ నియమించడం ద్వారా వైసీపీకి టచ్ లో వెళ్ళి అక్కడ నుంచి కీలక నేతలను జనసేనలోకి తీసుకుని రావాలన్న వ్యూహం ఉందని అంటున్నారు. ఒంగోలుకి చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని ఈ కమిటీలోకి తీసుకున్నారు. ఒకనాడు జిల్లా వైసీపీ రాజకీయాలను శాసించిన ఆయన ఇపుడు వైసీపీ నేతల మీద గురి పెడితే ఒంగోలులో ఫ్యాన్ పార్టీకి ఇబ్బందే అని అంటున్నారు. అలాగే కమిటీలో ఉన్న గుంటూరులో మాజీ ఎమ్మెల్యే కిలారు రోశయ్య కానీ విశాఖలో ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ కానీ వైసీపీ నుంచి వచ్చిన వారే కావడం విశేషం.

సీట్లు పెరుగుతాయి :

మరో వైపు చూస్తే ఏపీలో అసెంబ్లీ పార్లమెంట్ సీట్లు పెద్ద ఎత్తున పెరుగుతాయని అంటున్నారు. 2029 నాటికి కనీసంగా 250 అసెంబ్లీ సీట్లు అయినా వస్తాయని అంటున్నారు. అలాగే 38 దాకా ఎంపీ సీట్లు వస్తాయి. దాంతో వైసీపీలో ఉంటూ పెద్దగా యాక్టివ్ గా లేని వారు, అదే విధంగా జనసేనలో చేరాలని చూస్తున్న వారికి ఈ కమిటీ ఏర్పాటు ఒక మంచి అవకాశంగా చెబుతున్నారు. ఈసారి జనసేన కూడా ఎక్కువ నంబర్ తో పోటీ చేస్తుందని అంటున్నారు. దాంతో సీటు దక్కితే కచ్చితంగా ఆ వైపు నుంచి ఈ వైపునకు వస్తారు. అలా చూస్తే కనుక వైసీపీకి ఇది షాక్ లాంటి పరిణామమే అని అంటున్నారు.

కాంగ్రెస్ సైతం :

ఇంకో వైపు కాంగ్రెస్ కూడా ఈసారి ఏపీని వదిలేలా కనిపించడం లేదని అంటున్నారు. కర్ణాటకలో డీకే శివ కుమార్ సీఎం గా ఉన్నారు. అలాగే రేవంత్ రెడ్డి తెలంగాణా సీఎం గా ఉన్నారు ఈ ఇద్దరి మీదన బాధ్యతలు అధినాయకత్వం పెట్టింది. దాంతో ఈ నేతలు ఏపీ మీద ఫోకస్ పెడితే వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ నుంచి ఎవరైనా ఆకర్షితులు అయితే కనుక అది కూడా ఫ్యాన్ పార్టీకి ఇబ్బంది అవుతుందని అంటున్నారు. సీట్లు దండీగా పెరిగితే టీడీపీ కూడా మరోసారి వైసీపీ మీద ఎటాక్ చేస్తుందని అంటున్నారు. ఎన్నికల ముందు అయినా బలమైన నాయకులను తమ వైపు తీసుకునే పరిస్థితి ఉంటుందని అంటున్నారు. 2024 ఎన్నికల్లో ముఖ్య నాయకులు పలువురు వైసీపీ నుంచి టీడీపీ జనసేనలో చేరిన సందర్భాన్ని అంతా గుర్తు చేస్తున్నారు. మొత్తానికి చూస్తే వైసీపీ అప్రమత్తంగా లేకపోయినా లేక నాయకులతో టచ్ లో ఉండకపోయినా రాజకీయంగా ఇబ్బందులు వస్తాయని అంటున్నారు.