నాగబాబు బెర్త్ అక్కడేనా ?
ఇదిలా ఉంటే నాగబాబుకు ఒక బెర్త్ కేబినెట్ లో ఫిక్స్ అయింది అని అంటున్నారు ఆయనను మంత్రిగా తీసుకుంటామని చంద్రబాబు చెప్పి ఏడాది దాటుతోంది.
By: Satya P | 4 Oct 2025 8:15 AM ISTజనసేనలో తాజాగా కీలక మార్పులు జరిగాయి. సంస్థాగతంగా పార్టీని మరింత అభివృద్ధి చేయాలని అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. దాంతో పార్టీలో అత్యంత కీలకమైన ప్రధాన కార్యదర్శి పదవిని ఒక సినీ నిర్మాతకు అప్పగించారు. ఆయన జనసేన కోసం పదేళ్ళుగా తెర వెనక పనిచేస్తూ వస్తున్నారు అని అంటున్నారు. దాంతో ఆయన సేవలకు గుర్తింపుగా ఈ కీలక నియామకంతో గౌరవించారు అని అంటున్నారు.
ముఖ్య బాధ్యతలతో :
జనసేనను సంస్థాగతంగా రెండు తెలుగు రాష్ట్రాలలో మరింతగా బలోపేతం చేసేందుకు ఆయనను పవన్ ఎంచుకున్నారు అని అంటున్నారు. జనసేనను పటిష్టంగా తీర్చిదిద్దాలన్నది కూడా పవన్ ఆలోచనగా చెబుతున్నారు. దాని కోసమే ఈ నియామకం అంటున్నారు. ఈ పదవిలోకి వచ్చిన సదరు నిర్మాత గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీని బలోపేతం చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తారు అని అంటున్నారు. ఇదిలా ఉంటే ప్రధాన కార్యదర్శిగా ఇప్పటిదాకా నాగబాబు ఉన్నారు. మరి ఆయన వర్క్ ని షేర్ చేసుకోవడానికి ఈయనను తెచ్చారా లేక నాగబాబుకు వేరే బెర్త్ ని రెడీ చేసి పెట్టారా అన్నది చర్చ సాగుతోంది.
మంత్రి గానేనట :
ఇదిలా ఉంటే నాగబాబుకు ఒక బెర్త్ కేబినెట్ లో ఫిక్స్ అయింది అని అంటున్నారు ఆయనను మంత్రిగా తీసుకుంటామని చంద్రబాబు చెప్పి ఏడాది దాటుతోంది. అయితే నిర్ణయం అన్నది పవన్ కళ్యాణ్ చేతిలోనే ఉంది అని అంటున్నారు. నాగబాబుని పార్టీలో కీలకం చేయాలని ఆయనను అక్కడ వినియోగించుకోవాలని పవన్ ఆలోచించారు అని ప్రచారం సాగింది. అయితే ఇపుడు చూస్తే మెగా బ్రదర్ ని కేబినెట్ లోకి తీసుకుంటారు అని అంటున్నారు. ప్రభుత్వంలో నాగబాబు ఉంటారు కాబట్టే పార్టీ బాధ్యతలు టాలీవుడ్ నిర్మాతకు అప్పగించి ఆయనను కీలకం చేశారు అని అంటున్నారు.
అప్పడే ముహూర్తం :
ఇక నాగబాబు మంత్రిగా ఎపుడు అన్న చర్చ కూడా ఉంది అయితే వచ్చే ఏడాది జూలైలో రాజ్యసభ సీట్ల భర్తీ ఉంది ఆ సమయంలోనే అనేక మార్పులు మంత్రివర్గంలో జరుగుతాయని అంటున్నారు. అప్పటికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్ళు అవుతుంది అని అంటున్నారు అంటే మరో ఎనిమిది నెలల సమయం అన్న మాట. ఈలోగా ఎమ్మెల్సీగా నాగబాబు పెద్దల సభలో ఉంటారు అని అంటున్నారు. మొత్తానికి ఉప ముఖ్యమంత్రిగా తాను బిజీగా ఉంటూ పార్టీని చూసుకోవడానికి కొత్త నియామకాలను జనసేనలో చేపడుతున్నారు అని అంటున్నారు. అవసరం మేరకు మరిన్ని నియామకాలు కూడా జరుగుతాయని అంటున్నారు. చూడాలి మరి జనసేన వ్యూహాలు ఏ విధంగా ఉంటాయో.
