ఢిల్లీకి చేరిన జనసేన ఎమ్మెల్యే - వీణ వ్యవహారం.. ఏమి జరుగుతుంది!
రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించిన వ్యవహారంలో రోజుకో ట్విస్టు చోటు చేసుకుంటోంది.
By: Raja Ch | 31 Jan 2026 4:16 PM ISTరైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించిన వ్యవహారంలో రోజుకో ట్విస్టు చోటు చేసుకుంటోంది. ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియోలను బాధితురాలు వీణా రోజుకి ఒక్కొక్కటి చొప్పున అన్నట్లుగా విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే బాత్ రూమ్ వీడియోలు హల్ చల్ చేయగా.. తాజాగా అసెంబ్లీలో ఉండి చాటింగ్, వీడియో కాల్ చేసిన వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ సమయంలో మరో బిగ్ అప్ డేట్ తెరపైకి వచ్చింది.
అవును... జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై వీణ అనే మహిళ చేసిన ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపడంతో.. పార్టీ విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో తాజాగా ఆ కమిటీ దర్యాప్తు మొదలుపెట్టింది. ఈ సమయంలో బాధితురాలు విడుదల చేసిన వీడియోలు, వాటిలోని వాస్తవాస్తవాలను విచారణ కమిటీ పరిశీలిస్తోందని అంటున్నారు. ఈ క్రమంలో శ్రీధర్ తో పాటు వీణను కమిటీ కలవనుందని తెలుస్తోంది.
ఈ క్రమంలో ఫిబ్రవరి మొదటి వారంలో రైల్వే కోడూరులో ప్రయటించనున్న జనసేన అంతర్గత విచారణ కమిటీ... క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులను పరిశీలించి నివేదిక సిద్ధం చేయనుంది! అలా కమిటీ నివేదిక ఇచ్చిన అనంతరం.. దాని ఆధారంగా శ్రీధర్ పై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోనుందని అంటున్నారు. ఈ విషయంపై పవన్ కల్యాణ్ ఇప్పటికే ఆరా తీశారని తెలుస్తోంది. పూర్తిస్థాయి విచారణ అనంతరం నివేదిక వచ్చిన తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది వేచి చూడాలి!
శ్రీధర్ పై ఎన్.హెచ్.ఆర్.సీ.పై వీణ ఫిర్యాదు!:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపిన రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై వీణ అనే మహిళ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల వ్యవహారంలో మరో కీలక అప్ డేట్ చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (ఎన్.హెచ్.ఆర్.సీ)కి వీణ తాజాగా ఫిర్యాదు చేశారు. ఇందులో.. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనపై అత్యాచారం చేయడంతో పాటు, తనను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి మోసం చేశారని ఆమె పేర్కొన్నారని తెలుస్తోంది.
ఈ క్రమంలో.. వీణ తరుపున న్యాయవాది ఆజాద్ ఈ కేసు పెట్టారు. అయితే.. ఈ ఫిర్యాదును జాతీయ మానవహక్కుల కమిషన్ విచారణకు స్వీకరించింది. దీంతో.. ఈ విషయం ఇప్పుడు మరింత ఆసక్తిగా మారింది. దీనిపై తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయనేది కీలకంగా మారింది. కాగా.. రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ.. వీణతో ఇప్పటికే ఫోన్ లో మాట్లాడి ఘటనపై వివరాలు సేకరించినట్లు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నిజానిజాలు తేల్చి బాధితురాలికి అండగా ఉంటామని ఆమె తెలిపారు.
