Begin typing your search above and press return to search.

టార్గెట్ 2029...జనసేన పక్కా ప్లాన్ !

జనసేన తన బలాన్ని పెంచుకోవాలి. అపుడే కూటమిలో సీట్లను ఎక్కువగా కోరడానికి వీలు ఉంటుందని అంటున్నారు.

By:  Satya P   |   1 Sept 2026 9:19 AM IST
టార్గెట్ 2029...జనసేన పక్కా ప్లాన్ !
X

ఏపీలో మూడో ప్రాంతీయ పార్టీగా బలంగా పాతుకుని పోవాలని జనసేన చూస్తోంది. అందుకోసం ఇప్పటి నుంచే తగిన యాక్షన్ ప్లాన్ ని రెడీ చేసుకుంటోంది. అందులో భాగంగా ప్లాన్ ఏ ని స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా అమలు చేయాలని చూస్తోంది. ఆ తరువాత ప్లాన్ బీ గా 2029 సార్వత్రిక ఎన్నికలను టార్గెట్ చేస్తోంది అని అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ముప్పయి శాతం సీట్లను జనసేన కోరడం వెనక అసలైన అసెంబ్లీ ఎన్నికల అజెండా ఉందని అంటున్నారు. ముప్పయి శాతం అంటే జనసేన పటిష్టంగా సంస్థాగతంగా మారడానికి వీలు అవుతుందని అంటున్నారు.

డిమాండ్ చేసేందుకే :

జనసేన తన బలాన్ని పెంచుకోవాలి. అపుడే కూటమిలో సీట్లను ఎక్కువగా కోరడానికి వీలు ఉంటుందని అంటున్నారు. అందుకే రెండు విధాలుగా జనసేన తన కార్యక్రమాలను నిర్వహించాలని అనుకుంటోంది. ఒకటి సంస్థాగతంగా బలపడడం. ఇది జనసేన చేతిలోనే ఉంది. పార్టీ పదవులను అర్హులైన పనిమంతులైన సమర్ధులైన వారికి ఇవ్వడం ద్వారా పార్టీని గ్రౌండ్ లెవెల్ లో బలోపేతం చేసుకోవడం. ఈ విషయంలో జనసేన ఇప్పటికే చర్యలు చేపట్టింది. పార్టీ పదవులను తొందరలోనే భర్తీ చేస్తారు అని అంటున్నారు. అందులో వీర మహిళలకు యువతకు పెద్ద పీట వేస్తారు అని అంటున్నారు. అదే విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్లను కూడా కూటమి నుంచి పెద్ద సంఖ్యలో పొందాలని జనసేన చూస్తోంది. ఇక్కడ కూడా నూటికి నూరు శాతం స్ట్రైక్ రేట్ ని సాధించడం ద్వారా పల్లెల నుంచి పట్టణాలకు నగరాల దాకా జనసేన అధికారిక హోదాలో విస్తరించడానికి చూస్తోంది అని అంటున్నారు.

ఇదే షేర్ తోనేనా :

ఇక 2024 ఎన్నికల్లో జనసేన తీసుకున్న సీట్లు కానీ ఆ ఫార్ములా కానీ 2026 స్థానిక ఎన్నికల్లో కుదరదని ఆ పార్టీ స్పష్టంగా చెప్పేస్తోంది. 21 సీట్లు మొత్తం 175లో అంటే కేవలం ఎనిమిదవ వంతు అని అంటున్నారు. ఇపుడు అలా కాకుండా ముప్పై శాతం సీట్లు అంటే భారీ షేర్ గానే పేర్కొంటున్నారు. మరి ఇదే ఫార్ములాతో 2029 ఎన్నికల వేళ అసెంబ్లీ సీట్లను తీసుకుంటారా అన్నది మరో చర్చ. అయితే రెండేళ్ల అధికారంలోనే జనసేన బాగా పుంజుకుంది అని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మరి స్థానిక ఎన్నికల తరువాత మూడేళ్లకు సార్వత్రిక ఎన్నికలు వస్తాయి. అప్పటికి మరింతగా పుంజుకున్నామని జనసేన కొత్త ఫార్ములాను తెర మీదకు తీసుకుని వచ్చినా తేవచ్చు అని అంటున్నారు. అలా నలభై శాతం సీట్లు అంటే కనుక ఏ అరవై నుంచి డెబ్బై దాకా ఎమ్మెల్యే సీట్లకు టార్గెట్ చేస్తారా అన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయని అంటున్నారు.

సీఎం అభ్యర్ధిగా :

ఇదిలా ఉంటే ఒక వైపు స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధం అయింది. జనసేన ముప్పయి శాతం సీట్లను కోరుతోంది. ఇపుడు అసెంబ్లీ ఎన్నికలు లేవు, కానీ బలమైన సామాజిక వర్గాలు సీఎం అభ్యర్ధిగా ప్రకటించాలని డిమాండ్ చేయడం కూడా కొత్త రాజకీయ చర్చలకు ఆస్కారం కల్పిస్తోంది. అంటే రాబోయే కాలానికి ఇప్పటి నుంచే ఆయా వర్గాలు రంగం సిద్ధం చేస్తున్నాయా అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు. ఏది ఏమైనా జనసేన టార్గెట్ స్థానిక ఎన్నికల మీదుగా సార్వత్రిక ఎన్నికలు అని అంటున్నారు. ముందు ఇక్కడ బలపడాలి, ఆ మీదట అక్కడ కూడా గట్టిగా సీట్లను తీసుకుని బరిలో నిలిస్తే జనసేన కూడా రాజ్యాధికారం కోసం కూటమిలో డిమాండ్ చేసే పరిస్థితి వస్తుందని అంటున్నారు. ఏది ఏమైనా ఒక పద్ధతి ప్రకారమే జనసేన ముందుకు సాగుతోంది అని అంటున్నారు.