Begin typing your search above and press return to search.

పాత వ్యూహం రద్దు...జనసేన కొత్త వ్యూహం స్ట్రాంగ్

ఈసారి కూడా జనసైనికులు గట్టిగా బరిలో నిలిచి ఉంటే పదవులు కచ్చితంగా దక్కుతాయని పవన్ అన్నారు.

By:  Satya P   |   21 Aug 2026 8:30 AM IST
పాత వ్యూహం రద్దు...జనసేన కొత్త వ్యూహం స్ట్రాంగ్
X

సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని ఓడించేందుకే ఒక వ్యూహాన్ని అనుసరించామని జనసేన చెబుతోంది. అది పాత వ్యూహమని అంటోంది. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల వ్యూహం వేరు. ఇపుడు సార్వత్రిక ఎన్నికల్లో వ్యూహం దానికి భిన్నంగా ఉంటుంది అని గట్టిగానే చెబుతోంది. ఈసారి వ్యూహం మాత్రం జన సైనికులు, వీర మహిళల పోరాట స్ఫూర్తిని కొనసాగించేలా ఉండబోతోంది అని అంటోంది. జన సైన్యం ఆత్మ గౌరవాన్ని నిలిపేలా స్థానిక సంస్థల ఎన్నికలను ధీటుగా ఎదుర్కొందామని జనసేన పిలుపు ఇచ్చింది.

వైసీపీనే ఎదిరించిన స్పూర్తి :

ఇక గతంలో 2021లో జరిగిన స్థానిక ఎన్నికల్లో వైసీపీనే ఎదిరించి అప్పటి స్థానిక ఎన్నికల్లో ధైర్యంగా నిలిచిన జనసేన శ్రేణుల స్ఫూర్తినే తీసుకుని ఈసారి ముందుకు సాగుదామని జనసేన అధినాయకత్వం అంటోంది. ఇక గత ఎన్నికలకు భిన్ననగ స్థానిక ఎన్నికల్లో జనసేనకు స్థానాలు ఉంటాయని కూడా చెబుతోంది. రాష్ట్ర శాసన సభ ప్రాంగణంలోని ఉప ముఖ్యమంత్రి ఆఫీసులో జరిగిన జనసేన శాసన సభ పక్షం సమావేశంలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర పార్టీ నేతలతో స్థనిక ఎన్నికల వ్యూహం మీద సుదీర్ఘంగా చర్చించారు.

రెడీ అవాల్సిందే :

ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ కావాల్సిందే అని పవన్ పార్టీ ఎమ్మెల్యేలను నేతలకు కోరారు. జనసేన అనుసరించే వ్యూహం విధి విధానాల కోసం ఒక ప్రత్యేక కమిటీని నియమిస్తామని పవన్ చెప్పారు. వైసీపీ హయాంలో కనీసం నామినేషన్లు వేసే పరిస్థితులు లేకుండా ఉన్నా కూడా వారిని ఎదిరించి పోటీకి నిలిచిన జనసేన నాయకులు, వీర మహిళల స్ఫూర్తిని ఎప్పుడూ విడిచిపెట్టబోమని పవన్ స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు కేవలం వారి నియోజక వర్గాలకే పరిమితం కాకుండా, వారి ప్రాంతంలో జనసేన బలబలాలను బేరీజు వేసి పోటీ చేసేందుకు తగిన స్థానాలను గుర్తించి పార్టీ కేంద్ర కార్యాలయానికి నివేదిక ఇవ్వాలని పవన్ కోరారు.

నిలబడితే పదవులు :

ఈసారి కూడా జనసైనికులు గట్టిగా బరిలో నిలిచి ఉంటే పదవులు కచ్చితంగా దక్కుతాయని పవన్ అన్నారు. అప్పుడు 21 సీట్లకే పరిమితం కావడం వెనక వైసీపీ దారుణ పాలన ఉందని గుర్తు చేశారు. ఆ వ్యూహం కేవలం స్థానిక ఎన్నికల వరకే అని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు కొత్త వ్యూహం అన్నారు. ఇక స్థానిక ఎన్నికలకు ప్రాంతాలవారీగా ఆ ప్రాంత రాజకీయ సామాజిక పరిస్థితులను బట్టి వ్యూహాలు ఉంటాయని ఆయన చెప్పుకొచ్చారు. పార్టీ శ్రేణుల అభిప్రాయాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకుంటామని, రాజకీయంగా వారిని బలోపేతం చేసే విధంగా ముందుకు వెళ్దామని పవన్ చెప్పారు. అంతే కాదు రాజకీయంగా వారికి మెరుగైన అవకాశాలు కల్పిద్దామని అన్నారు.

ఇంతకీ వ్యూహం ఏంటి :

జనసేన స్థానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అని అంటున్నారు. కనీసంగా ముప్పయి శాతం సీట్లలో పోటీకి పొత్తుల రూపేణా సర్దుబాట్లు జరగాలని కోకుంటోంది. ఈ లెక్కన చూస్తే మండల పరిషత్తులు కనీసంగా 200 దాకా జెడ్పీలు 10 దాకా మేయర్ పదవులు అరడజన్ దాకా తీసుకోవాలని జనసేన ఆలోచిస్తోంది అని అంటున్నారు. అలాగే పంచాయతీలు ఏపీవ్యాప్తంగా 13 వేల దాకా ఉన్నాయి. అందులో మూడు వేల దాకా తమ పక్షం వచ్చేలా చూడాలని ఆలోచిస్తోంది. మొత్తానికి జనసేన స్ట్రాంగ్ గానే ఉంది. పాత వ్యూహం రద్దు అంటోంది. కొత్త వ్యూహంతో కూటమిలో ఎన్ని సీట్లు దక్కించుకుంటుందో చూడాల్సి ఉంది.