Begin typing your search above and press return to search.

లోక‌ల్ వార్‌కు జ‌న‌సేన రెడీ... !

మ‌రీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ ప‌థ‌కాన్ని డెవ‌ల‌ప్ చేసేందుకు, మ‌రింత ఎక్కువ మందికి ఉపాధి క‌ల్పించేందుకు జ‌న‌సేన అడుగులు వేసింది.

By:  Garuda Media   |   22 Aug 2025 1:00 PM IST
లోక‌ల్ వార్‌కు జ‌న‌సేన రెడీ... !
X

స్థానిక ఎన్నిక‌ల‌కు జ‌న‌సేన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. వ‌చ్చే ఏడాది లేదా.. ఆ మ‌ధ్య కాలంలో స్థానిక సంస్థ‌ల‌కు రాష్ట్రం రెడీ అవుతుంది. ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాలు, మునిసిపాలిటీల సంగ‌తి ఎలా ఉన్నా.. గ్రామీణ స్థాయిలో త‌న స‌త్తా చాటుకునేందుకు జ‌న‌సేన రెడీ అవుతోంది. ప్ర‌స్తుతం వైసీపీకి సాను భూతి ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ఎప్ప‌టి నుంచో వ్యూహాత్మ‌కంగా జ‌న‌సేన అడుగులు వేస్తోంది. ప‌ట్ట‌ణ, న‌గర ప‌రిధిలో టీడీపీ ఎలానూ దూకుడుగా ఉంది. దీని జోలికి పోకుండా.. గ్రామీణ ప్రాంతాల‌ను జ‌న‌సేన టార్గె ట్ చేసుకుంటోంది.

ఈ క్ర‌మంలో గ్రామీణ భార‌తంలో వైసీపీ సానుభూతిని త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకోవ‌డం ద్వారా.. వైసీపీకి షాకిచ్చేలా.. 2029 ఎన్నిక‌ల‌కు సంపూర్ణంగా జ‌న‌సేన విస్త‌రించేలా ఆ పార్టీ వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతోంది. సాధార‌ణంగా రాజ‌కీయాల్లో ఎత్తులు-పై ఎత్తులు కామ‌న్‌గానే ఉంటాయి. దీనిని ఎవ‌రూ కాద న‌లేరు. సో.. ఇలానే జ‌న‌సేన కూడా త‌న వ్యూహానికి ప‌దును పెంచుతోంది. ఈ ప‌రంప‌ర‌లో.. గ్రామీణ ప్రాంతాల‌ను అభివృద్ధి చేయ‌డం ఒక భాగం. ఇప్ప‌టికే ర‌హ‌దారుల నిర్మాణం స‌హా.. ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టింది.

మ‌రీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ ప‌థ‌కాన్ని డెవ‌ల‌ప్ చేసేందుకు, మ‌రింత ఎక్కువ మందికి ఉపాధి క‌ల్పించేందుకు జ‌న‌సేన అడుగులు వేసింది. ఇది తొలి విజ‌యం కాగా.. త‌ర్వాత కాలంలో 15వ ఆర్థిక సంఘం నిధుల‌ను నేరుగా గ్రామ పంచాయ‌తీల‌కు పంపించి.. పంచాయ‌తీ నిధుల‌ను రాష్ట్ర స‌ర్కారు వాడుకోకుండా చ‌ర్య‌లు తీసుకుంది. ఇది కూడా.. గ్రామీణ ప్రాంతాల‌కు మేలు చేసింది. ఒక‌ప్పుడు పంచాయ‌తీ పెద్ద‌లు నిధుల కోసం ఎదురు చూసే ప‌రిస్థితి నుంచి ఇప్పుడు వారికి చేతి నిండా నిధులు ఉండేలా జ‌న‌సేన జాగ్ర‌త్త‌లు తీసుకుంది.

ఇక‌, తాజాగా నాలా చ‌ట్టం కింద వ‌చ్చే ప‌న్నుల సొమ్మును పూర్తిగా పంచాయ‌తీల‌కు అప్ప‌గించేలా కూడా.. జ‌న‌సేన అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ చ‌ర్యలు తీసుకున్నారు. ఇది మ‌రింత‌గా మేలు చేయ నుంది. నాలా కింద వ‌చ్చే సొమ్మును త‌మ‌కు ఇవ్వాల‌ని ఎప్ప‌టి నుంచో గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ ఉంది. ఇప్పుడ‌ది సాకారం కానుంది. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. జ‌న‌సేన గ్రామీణ ప్రాంతాల‌పై పెద్ద వ్యూహ‌మే రెడీ చేసుకుని అడుగులు వేస్తున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఇది ఎన్నిక‌ల స‌మ‌యానికి పెద్ద ఎస్సెర్ట్‌గా మార‌నుంద‌న్న చ‌ర్చ కూడా తెర‌మీదికి వ‌చ్చింది.