Begin typing your search above and press return to search.

కంటెంట్ రైటర్స్ తో జనసేన ప్రయోగం

ప్రస్తుతం డిజిటల్ మీడియా విస్తరించింది. వెబ్ సైట్స్ అన్ని చోట్ల పెద్ద ఎత్తున ఏర్పాటు అవుతున్నాయి.

By:  Satya P   |   29 Jun 2026 9:32 AM IST
కంటెంట్ రైటర్స్ తో  జనసేన ప్రయోగం
X

ప్రస్తుతం డిజిటల్ మీడియా విస్తరించింది. వెబ్ సైట్స్ అన్ని చోట్ల పెద్ద ఎత్తున ఏర్పాటు అవుతున్నాయి. దాంతో ఆన్ లైన్ కంటెంట్ రైటర్స్ కి డిమాండ్ పెరిగిన సంగతి తెలిసిందే. అయితే న్యూస్ చానల్స్ అలాగే వెబ్ చానల్స్ డిజిటల్ ఫ్లాట్ ఫారం ని నిర్వహించే వారు మాత్రమే కంటెంట్ రైటర్స్ ని తీసుకుంటున్నారు. కానీ ఒక రాజకీయ పార్టీ కంటెంట్ రైటర్స్ ని ఎంగేజ్ చేయాలనుకోవడం ఒక ప్రయోగంగా చెప్పుకోవాలి. ఆ ప్రయోగం జనసేన చేస్తోంది. జనసేన ఎపుడూ వినూత్నంగా ఆలోచన చేస్తూ ఉంటున్నారు. అందులో నుంచి పుట్టుకుని వచ్చినవే ఉద్యమి సాధక్ లాంటి కొత్త తరం సంస్థాగత నిర్మాణం. ఇపుడు జనసేన ఈ క్రమంలో మరో ప్రయోగాన్ని చేస్తోంది.

వారికి ప్రోత్సాహం అంటూ :

కంటెంట్ రైటర్లుగా తెలుగు లేదా ఆంగ్ల భాషలో రాయగలికి మంచి కంటెంట్ రూపొందించాలని ఆసక్తి కలిగి ఉన్న వారిని ప్రోత్సహిస్తామని జనసేన పేర్కొంది. ఈ మేరకు తమ పార్టీ నిర్ణయం తీసుకుందని కేంద్ర కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడిందింది. సమకాలీన సామాజిక, రాజకీయ పాలనాపరమైన అంశాలపైన అవగాహన కలిగి ఉండి కంటెంట్ రైటర్లుగా చేయాలనుకునే వారికి ఆహ్వానం అని జనసేన చెబుతోంది.

మీడియా సోషల్ మీడియాతో :

ఈ విధంగా ఎవరైనా ఆసక్తిని కలిగి ఉంటారో వారు మీడియా సోషల్ మీడియా విభాగాలతో కలసి కంటెంట్ రైటర్లుగా సేవలు అందించాల్సి ఉంటుందని పేర్కొంది. అలా చేయాలనుకునే వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లుగా తెలిపింది. కంటెంట్ రైటర్లుగా ఎంపీక కోసం దరఖాస్తులను జూలై 5వ తేదీ లోపుగా సెంట్రల్ ఆపరేషన్స్ ఎట్ ది రేట్ ఆఫ్ జనసేన పార్టీ డాట్ ఆర్గ్ అన్న చిరునామాకు మెయిల్ చేయాలని కోరుతున్నారు. మీ బయోడేటాతో పాటు ఏదైనా సమకాలీన సామాజిక రాజకీయ పాలనాపరమైన అంశానికి సంబంధించి 200 పదాలకు మించకుండా ఒక ఆర్టికల్ ని తప్పనిసరిగా రాసి పంపించాలని జనసేన కోరుతోంది.

మంచి వ్యూహమే :

సాధారణంగా కంటెంట్ రైటర్స్ సమకాలీన అంశాల పట్ల పట్టు కలిగి ఉంటారు. వారు ఎప్పటికప్పుడు అనేక అంశాల మీద ఫోకస్ పెట్టి ఉంటారు. దాంతో వారిని తీసుకోవడం ద్వారా సమకాలీన రాజకీయ అంశాల మీద మరింత లోతైన విశ్లేషణ చేయవచ్చు అన్నది జనసేన ఆలోచనగా చెబుతున్నారు. అంతే కాకుండా పార్టీ పరంగా కూడా ఈ కంటెంట్ ని ఉపయోగించుకోవడం క్యాడర్ కి కూడా ఎప్పటికపుడు గ్రౌండ్ లెవెల్ లోని అంశాలని వివరించడం వంటివి చేయడానికి ఉపయోగపడుతుందని కూడా జనసేన భావిస్తోందని అంటున్నారు. ఏది ఏమైనా ఆసక్తి కలిగిన కంటెంట్ రైటర్లకు ఇది మంచి చాన్స్ గా అంతా చెబుతున్నారు.