Begin typing your search above and press return to search.

మనం బలపడాల్సిందే... పవన్ భారీ వ్యూహం !

ఏపీలో జనసేన మూడవ అతి పెద్ద పార్టీగా ఉంది. తెలుగుదేశం మొదటి అతి పెద్ద పార్టీ అయితే తరువాత స్థానంలో వైసీపీ ఉంది.

By:  Satya P   |   9 Oct 2025 4:00 PM IST
మనం బలపడాల్సిందే... పవన్  భారీ వ్యూహం !
X

ఏపీలో జనసేన మూడవ అతి పెద్ద పార్టీగా ఉంది. తెలుగుదేశం మొదటి అతి పెద్ద పార్టీ అయితే తరువాత స్థానంలో వైసీపీ ఉంది. జనసేన మూడవ ఆల్టర్నేషన్ గా ఏర్పడింది. కానీ ఏపీలో ఉన్న రెండు పెద్ద రాజకీయ పార్టీల నడుమ సాగుతున్న రాజకీయ యుద్ధం ఏపీ రాజకీయ పరిస్థితులు రాష్ట్ర పరిస్థితి వీటిని దృష్టిలో ఉంచుకుని కూటమిలో చేరి టీడీపీకి మద్దతుగా నిలిచింది. అయితే జనసేన స్ట్రాటజీ ఎంత వరకూ కరెక్ట్ అన్నది ఒక బలమైన సామాజిక వర్గంలో ఈ రోజుకీ చర్చగా ఉంది. ఎందుకు అంటే టీడీపీ వైసీపీ అధికారాన్ని అందుకున్నాయి. జనసేన కూడా అధికారాన్ని దక్కించుకోవాలి కదా అన్నదే ఆయా సామాజిక వర్గాల నుంచి వస్తున్న మాట.

ఏపీ ఫస్ట్ అంటూ :

జనసేన కొన్ని విషయాలలో చాలా క్లియర్ గా ఉంటోంది. తమకు రాజకీయాల కంటే రాష్ట్ర భవిష్యత్తు ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనేక సందర్భాలలో చెప్పారు కూడా. ఎంతో అనుభవం సమర్ధత కలిగిన చంద్రబాబు నాయకత్వంలో ఏపీ మరో పదిహేనేళ్ళ పాటు కూటమి ప్రభుత్వంగా కొనసాగితే దేశంలోనే అగ్ర గామిగా ఏపీ ఉంటుందని కూడా ఆయన భావిస్తూ ఉంటారు. ఉండడమే కాదు ఆయన పదే పదే వేదికల మీద కూడా దానినే చెబుతారు. తనకు పదవుల కంటే కూడా ఏపీ ప్రగతి ముఖ్యమని పవన్ కచ్చితమైన ఆలోచనతో ఉన్నారని అంటారు.

మారుతున్న ఆలోచనలు :

అయితే అన్ని సందర్భాలలో ఒకే రకమైన ఆలోచనలు చేస్తూ నిలకడగా ఉండడం అన్నది రాజకీయాల్లో కుదరదు, రాజకీయం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. అందువల్ల పవన్ ఈ విధంగా ఒక పర్మనెంట్ డెసిషన్ తీసుకోవడం పట్ల జనసేనలో అయితే అంతర్లీనంగా అసతృప్త్ ఉందని అంటున్నారు. సీఎం పవన్ అని స్లోగన్లు చేసిన వారికి అయితే మరీ నిరాశగానే ఉంటోంది. అలాగే అత్యధిక జనాభా కలిగిన ఒక సామాజిక వర్గం వారు తమకు ఎపుడూ సీఎం పీఠం అందని పండేనా అన్న ఆవేదన కూడా వ్యక్తం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే జనసేన ఆలోచనలు కూడా మెల్లగా మారుతున్నాయని అంటున్నారు.

తేలిక అవుతున్నారా :

తాజాగా కూటమిలో జరిగిన కొన్ని పరిణామాలు అసెంబ్లీలో బాలయ్య ఎపిసోడ్ వంటివి చూసిన తరువాత వర్షాకాల సమావేశాలలో తమ మీదనే కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు గురి పెట్టిన తీరుని అంచనా వేసుకున్న మీదట జనసేన పెద్దలలో కూడా అంతర్మధనం మొదలైంది అని అంటున్నారు తాము ఇలాగే ఉంటే మరింత తేలిక అవుతామని కూడా వారు ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. తాము బలపడాల్సిందే అన్న కొత్త ఆలోచనలు అయితే చేస్తున్నారు అని అంటున్నారు బలంగా ఉంటేనే కూటమి మిత్రుల దగ్గర కూడా కావాల్సిన గౌరవం దక్కుతుందని భావిస్తున్నారుట. అంతే కాదు తమదైన వాటాను తీసుకోవడానికి కూడా అది ఉపకరిస్తుంది అని అంటున్నారు.

వచ్చే ఎన్నికల్లో లక్ష్యం :

ఈ విధంగా సాగుతున్న జనసేన నయా వ్యూహాన్ని బట్టి చూస్తే కనుక 2029 ఎన్నికల్లో జనసేన కేవలం పక్క వాయిద్యంగా మిగిలిపోదని అంటున్నారు అంతే కాదు అధికారంలో వాటా కోసం పట్టుబట్టే రోజు కూడా వస్తుందని చెబుతున్నారు. దానికి తగిన ప్రాతిపదికను ఇప్పటి నుంచే సిద్ధం చేసుకుంటున్నారు అని అంటున్నారు. జనసేన రానున్న మూడేళ్ళ కాలంలో అధికారాన్ని అవకాశాలను అంది పుచ్చుకుని బలమైన శక్తిగా మారేందుకు గట్టి ప్రయత్నమే చేస్తుందని చెబుతున్నారు. దాని తరువాత 2029 ఎన్నికల్లో కూటమిగా కలసి పోటీ చేసినా సీట్లతో పాటు అధికారంలోనూ అధిక వాటా కోరే చాన్స్ ఉందని అంటున్నారు. మొత్తానికి ఏది జరిగినా మన మంచికే అని పెద్దలు అంటారు, ఏపీలో తాజాగా జరిగిన రాజకీయ పరిణామాలు మాత్రం జనసేనను బాగానే మేలు కొలిపాయని అంటున్నారు. ఇది ఆ పార్టీకి ఎంతో మేలు చేసే విధంగానే ఉందని చెబుతున్నారు. చూడాలి మరి జనసేన దూకుడు ఇక మీదట ఏ విధంగా సాగుతుందో.