Begin typing your search above and press return to search.

జనసేన హిస్టరీ లో ఫస్ట్ టైం బిగ్ బ్రేక్

జనసేన పార్టీగా ఆవిర్భవించి ఈ ఏడాదికి 12 ఏళ్ళు పూర్తి చేసుకుంది. విజయవంతంగా 13వ ఏట అడుగుపెట్టనుంది.

By:  Satya P   |   10 March 2026 5:00 AM IST
జనసేన హిస్టరీ లో ఫస్ట్ టైం బిగ్ బ్రేక్
X

జనసేన పార్టీగా ఆవిర్భవించి ఈ ఏడాదికి 12 ఏళ్ళు పూర్తి చేసుకుంది. విజయవంతంగా 13వ ఏట అడుగుపెట్టనుంది. ఈ నెల 14 న జనసేన ఆవిర్భావ దినోత్సవం ఉంది. జనసేన ఆవిర్భావం దినం అంటే అది మామూలుగా ఉండదు, పైగా జనసేనాని పవన్ కళ్యాణ్ వెండి తెర మీద పవర్ స్టార్. పొలిటికల్ గా చూస్తే సంచలన రాజకీయ నాయకుడు. దాంతో పవన్ అంటేనే ఊగిపోయే ఫ్యాన్స్ తో పాటు సైనికులు అంతా కలసి జనసేన ఫార్మేషన్ డే అంటే లక్షలాది మంది తరలి వస్తారు.

ఉత్సాహ పూరితంగా :

ఇదిలా ఉంటే జనసేన పార్టీ పెట్టాక అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రతీ ఏటా ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తోంది. అది ఒక ఆనవాయితీగా మారింది. జనసేన ఆవిర్భావ దినోత్స వేడుకలు అంటే ఎంతో గొప్పగా సాగుతూ ఉంటుంది. నేల ఈనిందా ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా జనాలు వెల్లువలా తరలివస్తారు. ఇక పవన్ కళ్యాణ్ స్పీచ్ కోసం జనసేన మాత్రమే కాదు ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు ఎదురు చూస్తాయి. ఏపీ రాజకీయాలని కీలక మలుపు తిప్పే నిర్ణయాలు అన్నీ కూడా జనసేన ఆవిర్భావ సభలోనే జరిగాయి. పొత్తుల నుంచి కూటములు కట్టే దాకా అనేక నిర్ణయాలు రాజకీయ ప్రకంపనలే పుట్టించాయి.

పిఠాపురంలో అదిరేలా :

ఇక జనసేన అధికారంలోకి వచ్చాక తొలిసారి 2025 లో పిఠాపురంలో అదిరిపోయే రేంజిలో ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహించారు. ఏకంగా రెండు రోజుల పాటు సాగిన ఈ కార్యక్రమాలు జనసేన హిస్టరీలో నభూతో నభవిష్యత్తు అనేలా సాగాయి. పిఠాపురం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం కావడంతో ఆ సెంటిమెంట్ తో మరింతగా ఉత్సవాలు హైలెట్ అయ్యాయి. ఈ సందర్భంగా పవన్ ఇచ్చిన ఉద్వేగపూరిత మైన స్పీచ్ కూడా అందరికీ గుర్తుండిపోతుంది.

రద్దు చేస్తూ డెసిషన్ :

అలాంటిది ఈ నెల 14న జనసేన 13వ వార్షికోత్సవాలు జరగాల్సి ఉండగా ఆ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దానికి ఆ పార్టీ కారణాలు వివరించింది. జనసేన సభ్యత్వం ప్రస్తుతం చురుకుగా సాగుతోంది అని దానిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేకనే ఈ నిర్ణయానికి వచ్చామని పార్టీ పేర్కొంది. జనసేన సభ్యత్వం గత నెల 26న ప్రారంభిస్తే కేవలం 12 రోజులకే ఎనిమిది లక్షల 70 వేలకు పైగా సభ్యత్వ నమోదు సాగింది అని పార్టీ వర్గాలు తెలిపాయి. అందుకే ఈ ఉత్సాహాన్ని చూసి మరింత కాలం జనసేన సభ్యత్వాలని కొనసాగించాలని నిర్ణయించినట్లుగా వెల్లడించింది. దాంతో జనసేన సభ్యత్వాల పట్ల ఎంత పట్టుదలగా పనిచేస్తోందో అర్ధం అవుతోంది.

స్థానిక ఎన్నికల కోసం :

ఇక ఈ ఏడాది స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి. దాంతో జనసేన సభ్యత్వాలు అతి ముఖ్యం కానున్నాయి. పార్టీని బూత్ లెవెల్ దాకా తీసుకుని పోయేందుకు ఈ మెంబర్ షిప్ ఎంతగానో దోహదపడుతుందని భావిస్తున్నారు. అంతే కాదు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో జనసేన ఎక్కువ స్థానాలకు పోటీ చేయాలని చూస్తోంది. ఆ విధంగా పార్టీని గ్రౌండ్ లెవెల్ లో బాగా పటిష్టం చేసుకుంటే 2029 నాటికి మరిన్ని ఎక్కువ సీట్లకు పోటీ చేసేందుకు వీలు పడుతుందని జనసేన భావిస్తోంది. మొత్తానికి జనసేన్ మాస్టర్ ప్లాన్ తో ఉంది. అందుకే ఎన్నడూ లేని విధంగా ఈసారి సభ్యత్వాల కోసం ఆవిర్భావ దినోత్సవ దినోత్సవాన్ని రద్దు చేసింది అని అంటున్నారు.