Begin typing your search above and press return to search.

చెరకును తియ్యగా మార్చిన భారతీయ మహిళ గురించి తెలుసా..!

అవును... అది 1987 నవంబర్ 4వ తేదీ... సబ్ జడి ఈకే కృష్ణన్, దేవీ అమ్మాల్ దంపతులకు తెల్లిచెర్రి (నేటి తలసేరి)లో జన్మించారు జానకీ అమ్మాల్.

By:  Raja Ch   |   28 Dec 2025 1:00 AM IST
చెరకును తియ్యగా మార్చిన భారతీయ మహిళ గురించి తెలుసా..!
X

ఓ వయసు వచ్చే సరికి అమ్మాయిలు పెళ్లి వైపు నెట్టబడుతున్న రోజులు.. భారతదేశంలో మహిళా శాస్త్రవేత్తలతో కిటకిటలాడే ప్రయోగశాలలు కనిపించడానికి చాలా కాలం ముందు.. మహిళలకు కళాశాల డిగ్రీ కూడా అత్యంత అరుదుగా ఉన్న కాలంలో.. ఓ భారతీయ మహిళ పీ.హెచ్.డీ చేసి.. భారతదేశంలో మొట్టమొదటి పీ.హెచ్.డీ చేసిన మహిళగా నిలిచారు.. ఓడ ఎక్కి అమెరికాకు బయలుదేరారు.. విదేశాల్లో పరిశోధనలు చేశారు.. ఆమె... జానకి అమ్మాల్!

ఆమె జాతీయ పంట జన్యుశాస్త్రాన్ని తిరిగి మార్చారు.. తన పరిశోధన కోసం లండన్‌ లో నాజీ బాంబు దాడులను ధైర్యంగా ఎదుర్కొన్నారు.. బ్రిటన్‌ లో ఆమె జర్మన్ బాంబు దాడుల వెలుగులో రాత్రుల్లో పనిచేశారు.. ఈ క్రమంలో స్వతంత్ర భారతదేశం తన శాస్త్రీయ పునాదులను పునర్నిర్మించుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు జవహర్ లాల్ నెహ్రూ ఆమెను పిలిచారు. ఆమెను స్వదేశానికి వచ్చి.. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాను పునర్వ్యవస్థీకరించమని కోరారు.

ఆమె చెరకు జన్యుశాస్త్రాన్ని మార్చివేశారు.. వేలాది పుష్పించే మొక్కలను మ్యాప్ చేశారు.. అడవులను కాపలాదారుడిలా కాపాడారు.. లోతైన శాస్త్రీయ వారసత్వాన్ని మిగిల్చారు.. ఆమె ఎనభై ఏడు సంవత్సరాల వయసులో భూమిపై తన చివరి రోజున కూడా తన ప్రయోగశాలలోనే గడిపారు.. భారతీయ వృక్ష శాస్త్రంలో అంతగా తెలియని విప్లవకారిణి జానకి అమ్మాల్.. వివాహాన్ని తిరస్కరించి.. ఈ దేశంలో చెరకుని తియ్యగా మారించిన మహిళగా నిలిచారు!

అవును... అది 1987 నవంబర్ 4వ తేదీ... సబ్ జడి ఈకే కృష్ణన్, దేవీ అమ్మాల్ దంపతులకు తెల్లిచెర్రి (నేటి తలసేరి)లో జన్మించారు జానకీ అమ్మాల్. ఈ క్రమంలో తొలుత తెల్లిచెర్రీలో, ఆ తర్వాత మద్రాసులో చదువుకున్న ఆమె ప్రపంచాన్ని అక్కడ క్వీన్ మేరీ కళాశాల విస్తృతంగా తెరిచింది.. ప్రెసిడెన్సీ కళాశాలలో దానిని మరింత పదును పెట్టింది. 1920 నాటికి వృక్షశాస్త్రంలో డిగ్రీ సంపాదించారు.. ఈ సమయంలో ఆమెకు వివాహం చేయాలని.. బంధువుల అబ్బాయిని చూశారు తల్లితండ్రులు.

కానీ అందుకు జానకీ నిరాకరించారు. ఒంటరిగా సుమారు 4 నుంచి 6 వారాలు సముద్రంలో ప్రయాణించి అమెరికాకు చేరారు. ఈ క్రమంలో 1925లో మాస్టర్స్ డిగ్రీని సంపాదించి.. కొన్నేళ్లు బోధించడానికి భారత్ తిరిగి వచ్చి.. 1931లో డాక్టరేట్ పూర్తి చేశారు. తర్వాత మిచిగాన్ విశ్వవిద్యాలయం ఆమె కృషిని 1956లో గౌరవ డాక్టరేట్‌ తో సత్కరించింది.

భారత్ కు చక్కెరను ఇచ్చిన శాస్త్రవేత్త!:

భారతదేశానికి 1930 ప్రారంభంలో ఓ సమస్య ఉంది. ఈ దేశంలో స్థానిక చెరకు రకాలు గట్టిగా, తక్కువ తీపితో ఉండేవి. ఈ క్రమంలో రైతులు చెరకును పండిస్తున్నప్పటికీ.. విదేశాల నుంచి వచ్చే తియ్యటి రకాలపైనే దేశం ఆధారపడి ఉంది. ఈ క్రమంలో కోయంబత్తురులోని చెరకు పెంపక కేంద్రం దాన్ని మార్చడానికి ప్రత్నిస్తోంది. జానకి ఈ ప్రాజెక్టులో సైటోజెనెటిస్ట్ గా చేరి.. క్రోమోజోములు, వారసత్వాన్ని అధ్యయనం చేశారు.

ఈ క్రమంలో క్రాస్ బ్రీడింగ్ ద్వారా పాలీప్లాయిడ్ హైబ్రిడ్‌ లను తయారు చేశారు జానకి. ఇవి చెరకు సుక్రోజ్‌ ను 16 నుంచి 20% వరకు పెంచింది. ఇది భారతదేశ చెరకును చాలా తియ్యగా చేసింది. నేడు మనకు తెలిసిన చెరకు, దాని రుచికి కారణం ఈ జానకే! కానీ.. కోయంబత్తురులో ఆమె చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. ఓ పక్క ఒంటరి మహిళ, మరోపక్క వెనుకబడిన కులానికి చెందిన వ్యక్తిగా ఆమెకు ఇబ్బందులు తప్పలేదు! ఇది భారతదేశానికి ఉన్న అతిపెద్ద శాపాల్లో ఒకటి కదా ఇప్పటికీ?

ఈ నేపథ్యంలో ఆమె లండన్ వెళ్లిపోయారు. 1940లో జానకి పగటిపూట జాన్ ఇన్నెస్ హార్టీకల్చరల్ ఇనిస్టిట్యూట్ లో పనిచేసేవారు. ఈ సమయంలో ఆమె అధ్యయనంలో చిన్న, సొగసైన పువ్వుకు ఆమె పేరే పెట్టారు. మాగ్నలియా కోబస్ జానకీ అమ్మల్. ఇది ఒ తెల్లటి పువ్వు. ఈ నేపథ్యంలో 1951లో జవహర్ లాల్ నెహ్రూ ఆహ్వానం మేరకు ఆమె తిరిగి భారత్ కు వచ్చారు. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాను పునర్వ్యవస్థీకరించారు!

ఈ క్రమంలో... 1984 ఫిబ్రవరి 7న ఎనభై ఏడు సంవత్సరాల వయసులో కూడా ఆమె ఇంకా ప్రయోగశాలలోనే ఉన్నారు.. మధురవోయల్ లోని తన ప్రయోగశాల టేబుల్ వద్ద తుది శ్వాస విడిచారు. ఆమెకు 1977లోనే పద్మశ్రీ అవార్డు లభించింది. ప్రతీ భారతీయుడు కప్పు టీలో తీపి తగిలిన ప్రతిసారీ జానకీ అమ్మాల్ ని గుర్తుకు తెచ్చుకోవాలి.. ‘షి ఈస్ ఏ స్వీట్ ఉమన్ ఆఫ్ ఇండియా’ ఇన్ వర్క్!