Begin typing your search above and press return to search.

జనసేనకు అదే టెన్షన్ ?

అంతే కాదు తగ్గి పోటీ చేసినా 21 సీట్లలోనూ విజయం సాధించి సెంట్ పర్సెంట్ స్ట్రైక్ రేటుని సాధించింది. ఇది కూడా జనసేన ఖాతాలో మరో విజయంగా నమోదు అయింది.

By:  Satya P   |   18 Oct 2026 9:08 AM IST
జనసేనకు అదే టెన్షన్ ?
X

ఏపీలో మూడో ప్రాంతీయ పార్టీగా జనసేన ఉంది. అయితే బలమైన రెండు ప్రాంతీయ పార్టీల మధ్య ఒంటరిగా మూడవ ఆల్టర్నేషన్ గా నిలిచి గెలవాలంటే దశాబ్దాల కాలం పడుతుందని వ్యూహాత్మకంగా ఆలోచించి టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. అలా కూటమి కట్టి 2024 లో అధికారంలో భాగం అయింది. ముఖ్యమంత్రి సీటుకు దూరం అయినా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కుదురుకోవడం జనసేనకు చాలానే ఊరటను ఇచ్చింది. అంతే కాదు తగ్గి పోటీ చేసినా 21 సీట్లలోనూ విజయం సాధించి సెంట్ పర్సెంట్ స్ట్రైక్ రేటుని సాధించింది. ఇది కూడా జనసేన ఖాతాలో మరో విజయంగా నమోదు అయింది.

పట్టుబట్టి సాధించింది :

ఇపుడు చూస్తే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. 2024 నాటికి 2026 నాటికీ తమ బలం పెద్ద ఎత్తున పెరిగింది అని జనసేన గట్టిగానే చెప్పుకుంది. కొత్త ఫార్ములాతో సీట్ షేర్ ఉండాలని పట్టుబట్టింది. ఫలితంగా 2024 కంటే కూడా ఎక్కువ శాతమే సీటు షేర్ దక్కింది. అప్పట్లో 14 శాతం సీటు షేర్ దక్కితే ఈసారి అది 20 శాతం పై దాటింది. దాంతో జనసేన అందులోనూ విజయం సాధించింది. విజయవాడ వంటి చోట మేయర్ సీటుని తీసుకుంది. అలాగే నాలుగు కార్పోరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పాలక సంస్థలతో కలుపుకుని పాతిక సీట్లు పొత్తులో భాగంగా తీసుకుంది. అంత వరకూ ఓకే అనుకున్నా కొన్ని చోట్ల జనసేనకు స్థాన బలం సంస్థాగత బలం తక్కువగా ఉందని అంటున్నారు

అదే రిపీట్ చేయాలి :

అయితే టీడీపీ నుంచి పొత్తులో భాగంగా ఎక్కువ సీట్లు గెలుచుకున్న జనసేన 2024 నాటి మ్యాజిక్ ని రిపీట్ చేయాల్సి ఉంది అని అంటున్నారు. మొత్తం పాతికకు పాతిక సీట్లు గెలిచి చూపించాలి అన్న మాట. అలా అయితేనే 2029 సార్వత్రిక ఎన్నికల్లో కూడా మరో కొత్త ఫార్ములాను నిర్ణయించుకుని మరింతగా సీట్ల బేరం ఆడేందుకు ఆస్కారం ఉంటుంది. జనసేన బలం పెరిగింది అని చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అని అంటున్నారు. అయితే ఇది చెప్పుకునేటంత ఈజీ అయితే కాదని అంటున్నారు.

గ్రౌండ్ రియాలిటీ వేరు :

ఇక చూస్తే 2024 నాటికి ఇప్పటికీ గ్రౌండ్ రియాలిటీ మారింది అని అంటున్నారు. దాదాపుగా రెండున్నరేళ్ళ కూటమి పాలన పూర్తి అయింది. దాంతో జనాలు ఈ ప్రభుత్వం మీద ఒక అంచనాకు వచ్చి ఓటు వేస్తారు. అంతే కాదు జనసేన ఎమ్మెల్యేల విషయంలోనూ పవన్ కళ్యాణ్ పాలన విషయంలో కూడా మార్కులు వేస్తారు అని అంటున్నారు. ఇది ఒక ఎత్తు అయితే అప్పటికీ ఇప్పటికీ అతి పెద్ద మార్పు ఏమిటి అంటే కూటమిలో నాటి ఐక్యత నేడు తగ్గిపోవడం. ఇపుడు టికెట్లు దక్కని వారు ఆశావహులు అంతా మనసు పెట్టి పూర్తిగా పనిచేస్తారా అన్నది సందేహంగా ఉంది అని అంటున్నారు.

ఇపుడు బిగ్ టాస్క్ గా :

ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపిస్తే తమ సొంత ఇలాకాలో పాతుకుపోతే రేపటి ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్లు అడిగితే ఇలా కూడా ఇతర పార్టీల నేతలకు ఆలోచనలు కలుగుతాయని అంటున్నారు. వీటిని అధిగమించి మరీ గెలుపు జెండా పాతాలీ అంటే చాలా శ్రమించాలి. కానీ టైం చూస్తే తక్కువగా ఉంది. సీట్ల సర్దుబాటు నుంచి అభ్యర్ధుల ఎంపిక నుంచి అన్నీ లేట్ గానే సాగుతున్న నేపథ్యం ఉంది. దాంతో జనసేన సెంట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇపుడు బిగ్ టాస్క్ గా మారుతోంది అని అంటున్నారు. పాతికకు ఒక్క సీటు తగ్గినా జనసేన టార్గెట్ అవుతుందని కూడా అంటున్నారు.