Begin typing your search above and press return to search.

ఇది నా వ్య‌క్తిగ‌తం: నోరు విప్పిన అర‌వ శ్రీధ‌ర్‌

కాగా.. మ‌హిళా ఉద్యోగి ఆరోప‌ణ‌లు చేసిన త‌ర్వాత‌.. అర‌వ శ్రీధ‌ర్‌.. అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయిన‌ప్ప టికీ.. ఆమె మాత్ర‌మ ప‌లుద‌ఫాలుగా సెల్ఫీ వీడియోలు విడుద‌ల చేశారు.

By:  Garuda Media   |   4 Feb 2026 4:52 PM IST
ఇది నా వ్య‌క్తిగ‌తం: నోరు విప్పిన అర‌వ శ్రీధ‌ర్‌
X

మ‌హిళా ఉద్యోగినిపై లైంగిక దాడి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న జ‌న‌సేన పార్టీ నేత‌, రైల్వే కోడూరు ఎమ్మె ల్యే అర‌వ శ్రీధ‌ర్ ఎట్ట‌కేల‌కు మీడియా ముందుకు వ‌చ్చారు. స‌ద‌రు మ‌హిళ చేసిన ఆరోప‌ణలు.. పార్టీకి సంబంధం లేద‌ని.. ఇది పూర్తిగా వ్య‌క్తిగ‌త వ్య‌వ‌హార‌మ‌ని వ్యాఖ్యానించారు. ఎవ‌రూ కూడా పార్టీ గురించి.. ముఖ్యంగా జ‌న‌సేన గురించి మాట్లాడ‌వ‌ద్ద‌ని ఆయ‌న కోరారు. ఇది.. త‌న‌కు, ఆమెకు మ‌ధ్య జ‌రిగిన వ్య‌క్తిగ‌త వ్య‌వ‌హార‌మ‌ని పేర్కొన్నారు.

ఈ నేప‌థ్యంలో పార్టీ పేరుకానీ.. జ‌న‌సేన పార్టీ గురించి కానీ ఎవ‌రూ మాట్లాడ‌వ‌ద్ద‌ని చెప్పారు. పార్టీ నియమించిన క‌మిటీ ముందు తాను హాజ‌ర‌య్యాయ‌ని.. త‌న ద‌గ్గ‌ర‌ ఉన్న అన్ని విష‌యాల‌ను వెల్ల‌డించాన‌ని అర‌వ శ్రీధ‌ర్ చెప్పారు. అదేస‌మ‌యంలో పార్టీ విచారించిన త‌ర్వాత‌.. త‌న‌పై ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా వాటిని పాటిస్తాన‌న్నారు. ఇంత‌కు మించి తాను చెప్పేది ఏమీ లేద‌న్నారు. ఈ వ్య‌వ‌హారంలో పార్టీ పేరు ను ఎత్తొద్ద‌ని ఆయ‌న సూచించారు.

కాగా.. మ‌హిళా ఉద్యోగి ఆరోప‌ణ‌లు చేసిన త‌ర్వాత‌.. అర‌వ శ్రీధ‌ర్‌.. అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయిన‌ప్ప టికీ.. ఆమె మాత్ర‌మ ప‌లుద‌ఫాలుగా సెల్ఫీ వీడియోలు విడుద‌ల చేశారు. త‌న‌కు 5 సార్లు అబార్ష‌న్ జ‌రిగిందని.. తాను ఎలాంటి డ‌బ్బులు డిమాండ్ చేయ‌లేద‌న్నారు. త‌న భ‌ర్త‌కు త‌న‌కు వివాదాల నేప‌థ్యంలో దూరంగా ఉన్నాన‌ని.. విడాకులు తీసుకోలేద‌న్నారు. ఇక‌, జ‌న‌సేన పార్టీ వ్య‌వ‌హారం కాద‌ని ఆమె కూడా చెప్పారు. ఆ పార్టీ అధినేత ప‌వ‌న్ కల్యాణ్‌పై త‌న‌కు ఎంతో నమ్మ‌కం ఉంద‌న్నారు.

ఈ విష‌యాన్ని ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌రిష్కరిస్తార‌న్న విశ్వాసం త‌న‌కు ఉంద‌న్నారు. కాగా.. ఈ కేసు విచార‌ణ‌కు పార్టీ త్రిస‌భ్య క‌మిటీని నియ‌మించింది. ఈ క‌మిటీ ముందు.. మంగ‌ళ‌వారం అర‌వ శ్రీధ‌ర్ హాజ‌ర‌య్యారు. త‌న‌ను హానీ ట్రాప్‌లోకి లాగార‌ని.. దీని వెనుక వైసీపీ హ‌స్తం ఉంద‌ని ఆయ‌న క‌మిటీ ముందు త‌న గోడు వెళ్ల‌బోసుకున్న‌ట్టు తెలిసింది. అయితే.. విచార‌ణ అనంత‌రం మీడియాతో మాట్లాడ‌కుండా వెళ్లిపోయారు. బుధ‌వారం ఉద‌యం ప్ర‌త్యేకంగా మీడియాతో మాట్లాడారు.