Begin typing your search above and press return to search.

పవన్ ఏం చెబుతారో... సర్వత్రా ఉత్కంఠ !

జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 22న కాకినాడ వేదికగా కీలకమైన పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

By:  Satya P   |   21 Sept 2026 6:59 PM IST
పవన్ ఏం చెబుతారో... సర్వత్రా ఉత్కంఠ !
X

జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 22న కాకినాడ వేదికగా కీలకమైన పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశం స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో జరుగుతోంది. దాంతో స్థానిక ఎన్నికల విషయంలో జనసేన వ్యూహాలు ఏమిటి ఆ పార్టీ పోటీ చేసే సీట్లు ఎన్నికల పొత్తులలో వ్యవహరించే విధానం మీద అంతటా ఆసక్తి అయితే ఉంది. ఎందుకంటే 2024 ఫార్ములాను జనసేన నేతలు ఇప్పటికే కాదు కూడదని చెప్పారని అంటున్నారు. అంతే కాదు 30 శాతం సీట్లు తమకు దక్కాలని కోరుకుంటున్నారు అని కూడా ప్రచారంలో ఉంది. అయితే అదే సమయంలో జనసేన అగ్ర నేత మంత్రి నాదెండ్ల మనోహర్ విశాఖలో జరిగిన పార్టీ సమావేశంలో మాట్లాడుతూ బలం ఉన్న చోటనే జనసేన పోటీ పడాలని సూచించినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ నేపధ్యంలో జరుగుతున్న ఈ కీలక సమావేశం మీద అందరి ఫోకస్ ఉందిపుడు.

తీవ్ర అసంతృప్తితో :

ఇదిలా ఉంటే నాదెండ్ల మనోహర్ బలం ఉన్న చోట పోటీ పడాలని బాధ్యత కలిగిన పార్టీగా జనసేన వ్యవహరించాలని సూచించినట్లుగా ప్రచారం సాగింది. దీని మీద జనసైనికులు అయితే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అని అంటున్నారు. ఎందుకంటే ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని చాలామంది పెద్ద ఎత్తున ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ తరహా ప్రకటనలు వారి ఆశల మీద నీళ్ళు చల్లుతున్నాయి. దాంతో ఈ పరిణామాల నేపధ్యంలో జనసేన అధినేత పవన్ వెంటనే ఒక అతి ముఖ్య సమావేశం ఏర్పాటు చేయడంతో పవన్ ఏమి చెబుతారు అన్నది అయితే చర్చకు వస్తోంది.

పవన్ డెసిషన్ అంటే :

ఇక చూస్తే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత హోదాలో ఏది చెప్పినా అదే ఫైనల్ అని అంటున్నారు. ఈసారి ఎక్కువ సీట్లు తీసుకుని కూటమితో కలసి పోటీ చేస్తామని పవన్ కనుక ప్రకటిస్తే ఆ లెక్క వేరే ఉంటుందని అంటున్నారు. ఎందుకంటే దశాబ్దం పైగా జనసేన నాయకులు కానీ క్యాడర్ కానీ పార్టీ కోసం ఎంతగానో శ్రమించారు అని ఇప్పుడు వారికి గ్రౌండ్ లెవెల్ లో అధికారం అందుకునే చాన్స్ వచ్చిందని అంటున్నారు. అదే విధంగా పార్టీలో క్షేత్ర స్థాయిలో ఆశలు ఆకాంక్షలకు పవన్ నిర్ణయాలు ప్రతిబింబిస్తాయని కూడా అనేక మంది భావిస్తున్నారు. అయితే జనసేన కూటమిలో అతి ముఖ్య భాగస్వామి. కాబట్టి ఆచీ తూచీ నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. దాంతో బాలెన్స్డ్ గానే జనసేన విధానాలు కానీ ఆలోచనలు కానీ ఉంటాయని చెబుతున్నారు. అలా కనుక చూస్తే ఏ రకమైన తీర్మానం వెలువడుతుంది అన్నది కూడా ఉత్కంఠను రేపేదిగా ఉంటుందని అంటున్నారు.

కందులకు బాధ్యతలు :

మరో వైపు చూస్తే జనసేన పార్టీకి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచార సారథ్యాన్ని కో ఆర్డినేట్ చేసుకునే కీలక భూమికను మంత్రి కందుల దుర్గేష్ కి పవన్ అప్పగించారు. దీంతో ఆయన మీద మరింత కొత్త భారాలు పెరిగాయని అంటున్నారు. సౌమ్యుడిగా ఉంటూ అందరికీ కలుపుకుని పోయే కందులకు జనసేన ప్రచార కమిటీ కో ఆర్డినేటర్ గా

బాధ్యతలు అప్పగించడం పట్ల పార్టీలో హర్షం వ్యక్తం అవుతోంది అని అంటున్నారు. అలాగే జనసేన శ్రేణులను ఏకమొత్తంగా ముందుకు నడిపించే సామర్థ్యం ఆయనకు ఉందని అంటున్నారు. మొత్తం మీద చూస్తే చాలా కాలం తరువాత స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట పవన్ కాకినాడలో తన పార్టీ శ్రేణులతో నిర్వహించే కీలక సమావేశం మీద జనసేన మాత్రమే కాదు ఏపీ రాజకీయ మొత్తం నిశితంగా చూస్తోంది అని అంటున్నారు.