బిగ్ డిబేట్: జనసేనలో ఏం జరుగుతోంది.. ?
ఏపీలో అధికారం పంచుకున్న జనసేన పార్టీపై ఇటు టీడీపీకి అటు బీజేపీకి కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
By: Garuda Media | 2 Feb 2026 10:00 PM ISTఏపీలో అధికారం పంచుకున్న జనసేన పార్టీపై ఇటు టీడీపీకి అటు బీజేపీకి కూడా భారీ అంచనాలు ఉన్నాయి. వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లోనూ కలసి కట్టుగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్న దరిమిలా.. జనసేన మరోసారి కీలకంగా మారనుంది. దీంతో జనసేన లేకుండా కూటమి లేదు.. కూటమికి జనసేన అవసరం అనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇక, ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు కూడా చెబుతున్నారు.
మరోవైపు.. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. కూటమిగా ఉండాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. కానీ.. టీడీపీ, బీజేపీల మాట ఎలా ఉన్నా.. కీలక మైన జనసేనలోనే అంతర్గతంగా విభేదాలు తెరమీదికి వస్తున్నాయి. తాజాగా బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా రచ్చ రేపిన విషయం తెలిసిందే. పార్టీలో ఏం జరుగుతోందని ఆయన ప్రశ్నించారు. వాస్తవానికి.. బొలిశెట్టి అంటేనే.. కీలక నాయకుడు. పైగా ఆలోచించి మాట్లాడే నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు.
అలాంటి నాయకుడే.. పార్టీపై ఇలా వ్యాఖ్యానించడం గమనార్హం. ముఖ్యంగా కూటమిలో 60-30-10 నిష్పత్తి లో పదవుల పంపకం జరగాలని.. అలా జరగడం లేదని చెప్పుకొచ్చారు. ఇవన్నీ.. ఆయన చాలా నిశితంగా చేసిన వ్యాఖ్యలనే చెప్పాలి. ఎందుకంటే.. బొలిశెట్టి వంటి కీలక నాయకుడు చేసిన వ్యాఖ్యలు.. లైట్‌గా చూడాల్సిన అవసరం లేదు. పార్టీలో అంతర్గత చర్చగా గత కొన్నాళ్లుగా వినిపిస్తోంది. పవన్ కల్యాణ్ పై అభిమానం ఉన్న నాయకులు కూడా.. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
