Begin typing your search above and press return to search.

టికెట్ భక్తుడిది.. సెక్యూరిటీ 'జెడ్ ప్లస్' రేంజ్ ది.. అమర్ నాథ్ యాత్ర భద్రత ఈ లెవల్ మరీ..

సాధారణంగా రైళ్లలో టికెట్ చెక్ చేసే టీటీఈలు, లేదా లాఠీ పట్టుకున్న ఆర్పీఎఫ్ పోలీసులు కనిపిస్తేనే మనం అలర్ట్ అయిపోతాం.

By:  A.N.Kumar   |   4 July 2026 3:38 PM IST
టికెట్ భక్తుడిది.. సెక్యూరిటీ జెడ్ ప్లస్ రేంజ్ ది..  అమర్ నాథ్ యాత్ర భద్రత ఈ లెవల్ మరీ..
X

భక్తులారా... మీ లగేజీ సర్దుకోండి.. జేబులో ఐడెంటిటీ కార్డులు పెట్టుకోండి.. వీలైతే కాస్త ధైర్యాన్ని కూడా ప్యాక్ చేసుకోండి. ఎందుకంటే, అమర్‌నాథ్ యాత్ర-2026కు వెళ్లే భక్తుల కోసం కేంద్ర ప్రభుత్వం ఈసారి మామూలు ఏర్పాట్లు చేయలేదు. ఎంతలా అంటే మీరు ప్రయాణించే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కితే... మీ పక్క సీట్లోనో, లేక తలుపు పక్కనో అత్యాధునిక తుపాకీ పట్టుకుని బ్లాక్ కమాండోలు దర్శనమిస్తారు. అవును.. మీరు చదివింది నిజమే! ‘రైలు ప్రయాణం ప్రశాంతంగా సాగాలి’ అనే కాన్సెప్ట్‌ను కాస్త సీరియస్‌గా తీసుకున్న రైల్వే శాఖ, రక్షణ శాఖలు కలిసి జమ్మూ-శ్రీనగర్ వందే భారత్ రైల్లో ప్రత్యేక 'కోరాస్' కమాండోలను రంగంలోకి దించాయి.

సీట్లో కూర్చుంటే... సైడ్ లో కమాండో

సాధారణంగా రైళ్లలో టికెట్ చెక్ చేసే టీటీఈలు, లేదా లాఠీ పట్టుకున్న ఆర్పీఎఫ్ పోలీసులు కనిపిస్తేనే మనం అలర్ట్ అయిపోతాం. కానీ, ఇప్పుడు వందే భారత్ కోచ్‌లలోకి అడుగుపెడితే... హాలీవుడ్ యాక్షన్ సినిమాల్లో లాగా కమాండోలు సంచరిస్తున్నారు. రైలు లోపల, ఎంట్రీల దగ్గర, ఇంపార్టెంట్ కోచ్‌లలో వీరు మోహరించారు. అధునాతన ఆయుధాలు ధరించి, కళ్లకు నల్ల అద్దాలు పెట్టుకుని వీరు తిరుగుతుంటే... ప్రయాణికులు భయం కంటే కూడా ఎక్కువ "సినిమాటిక్ ఫీల్" పొందుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా "అబ్బా... ఏం సెక్యూరిటీ బాబోయ్!" అంటూ లైకులు, షేర్లతో రచ్చ రచ్చ చేస్తున్నారు. భద్రత ఎంత పెరిగిందంటే... రైలు విండో గుండా బయటకి చూస్తే ప్రకృతి అందాల కంటే ఎక్కువగా నిఘా పరికరాలే కనిపిస్తాయేమో..

మల్టీ-లేయర్ సెక్యూరిటీ.. ఉగ్రవాదులకు మైండ్ బ్లాక్

అమర్‌నాథ్ యాత్ర అనగానే ఉగ్రవాదుల బెదిరింపులు, ముప్పులు కామనే కదా. అందుకే ఈసారి మన అధికారులు ఒక అడుగు ముందుకు వేసి ‘మల్టీ-లేయర్ సెక్యూరిటీ’ అనే మాయాజాలాన్ని సృష్టించారు. అంటే, ఒక ఉగ్రవాది పొరపాటున కూడా రైలు వైపు చూద్దామన్నా... ఈ నాలుగు లేయర్ల భద్రతను దాటుకుని రావడం దేవుడెరుగు, కనీసం స్టేషన్ లోపలికి అడుగు పెట్టడం కూడా ఇంపాజిబుల్ అని అధికారులు గట్టిగానే నమ్ముతున్నారు.

యాత్ర సేఫ్.. ప్రయాణం సూపర్ ఫాస్ట్

దేశం నలుమూలల నుంచి వచ్చే వేలాది మంది భక్తులు జమ్మూ నుంచి శ్రీనగర్ వరకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో వేగంగా, లగ్జరీగా ప్రయాణించడమే కాకుండా, ఇప్పుడు ఈ కమాండోల రక్షణలో ‘జెడ్ ప్లస్’ కేటగిరీ విఐపి ఫీలింగ్‌ను కూడా ఎంజాయ్ చేయవచ్చన్నమాట. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం భక్తుల భద్రత విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కావడం లేదని క్లియర్‌గా అర్థమవుతోంది. అధికారులు ప్రతి నిమిషం పరిస్థితులను రివ్యూ చేస్తూ.. అంతా ప్రశాంతంగా సాగేలా చూస్తున్నారు. కాబట్టి భక్తులారా.. ఇక భయాలు పక్కన పెట్టి... "హర హర మహాదేవ్" అంటూ వందే భారత్ ఎక్కేయండి. మీ ప్రయాణాన్ని ఎంజాయ్ చేయండి.. కాకపోతే కమాండోల తుపాకులను చూసి కాస్త డిసిప్లిన్‌గా ఉండడం మాత్రం మర్చిపోకండి..