Begin typing your search above and press return to search.

హోదా మీద జగన్ వెనక్కి తగ్గారా...కొత్త డిమాండ్ అదేనా ?

హోదా రావాలీ అంటే ఎంత నంబర్ ఉండాలో తెలియదా అంటూ వైసీపీకి బాగా ఓడించారని 11 సీట్లకే పరిమితం చేశారు అని కూటమి నుంచి ఎండగడుతున్న తీరు కూడా వైసీపీని బాగా ఇరకాటంలోకి నెడుతోంది.

By:  Satya P   |   21 Sept 2025 3:00 AM IST
హోదా మీద జగన్ వెనక్కి తగ్గారా...కొత్త డిమాండ్ అదేనా ?
X

ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను అని జగన్ చెబుతున్నారని కూటమి నేతలు పెద్ద ఎత్తున విమర్శలు సంధిస్తున్నారు. ఇది కాస్తా జనంలోకి బాగానే వెళ్ళింది అంతే కాదు ఎమ్మెల్యేలు సభకు రాకుండా ఉంటే ఎలా బాధ్యత లేదా అని స్పీకర్ అయ్యన్నపాత్రుడు పదే పదే చేస్తున్న విమర్శలు కానీ సభలో ఏ విషయం మీద అయినా చర్చిద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీకి చేస్తున్న సవాళ్ళూ సిద్ధమేనా అని రెట్టిస్తున్న తీరూ ఇవన్నీ కూడా వైసీపీకి ఇబ్బందికరంగా మరాయి.

హోదా కావాలంటూ :

అన్నింటి కంటే ముఖ్యమైనది జగన్ కి హోదా కావాలని డిమాండ్ చేస్తున్నారు అన్న అంశమే జనంలోకి బాగా వెళ్ళేలా కూటమి నేతలు చేయగలిగారు. ప్రతిపక్ష హోఆ అంటే పదవి అని అధికారం పదవి లేకపోతే సభకు వెళ్ళరా అంటూ జరుగుతున్న ప్రచారం నేపధ్యంలో తప్పుడు సంకేతాలు అయితే బాగానే వెళ్ళిపోయాయి. ఇది అంతిమంగా వైసీపీని కార్నర్ చేసేలా ఉంది. సభకు వెళ్ళి ప్రజా సమస్యల మీద పోరాటం చేయడానికి ఈ హోదాలు ఎందుకు అన్నది కూడా మేధావుల నుంచి సగటు ప్రజానీకం వరకూ చర్చగా వస్తంది. నిజానికి హోదా అన్నది సాంకేతికమైన అంశం. అది ఇవ్వాలా వద్దా అన్నది కూడా స్పీకర్ నిర్ణయం మీద ఆధరపడి ఉంటుంది.

వైసీపీ టార్గెట్ గా :

ఇంకో వైపు చూస్తే వైసీపీ టార్గెట్ బాగా అవుతోంది. హోదా రావాలీ అంటే ఎంత నంబర్ ఉండాలో తెలియదా అంటూ వైసీపీకి బాగా ఓడించారని 11 సీట్లకే పరిమితం చేశారు అని కూటమి నుంచి ఎండగడుతున్న తీరు కూడా వైసీపీని బాగా ఇరకాటంలోకి నెడుతోంది. ఒక్ విధంగా చెప్పాలీ అంటే వైసీపీ పెద్దలు హోదా అంటూ ఏదో ఒకటి చెబుతూ తాము ప్రజా ప్రతినిధులుగా చేయాల్సిన కర్తవ్యాన్ని విస్మరిస్తున్నారు అన్నది కూడా జనంలోకి పోతంది.

సమయం ఇస్తే చాలు :

దాంతో ఇపుడు వైసీపీ అధినేత జగన్ పార్టీ ఎమ్మెల్యేల వద్ద ఒక విషయం ఉంచారని అంటున్నారు. స్పీకర్ ని కలసి తమకు మాట్లాడేందుకు ఎంత సమయం ఇస్తారో చెప్పమని ఆయన కోరారు. తమకు ప్రజా సమస్యల మీద చర్చించేందుకు తగిన సమయం ఇస్తే కనుక తాము అసెంబ్లీకి వస్తామని జగన్ వారితో అన్నట్లుగా ప్రచారం సాగుతోంది. అంటే హోదా మీద వైసీపీ పెద్దలు మెట్టు దిగి వచ్చారనే అంటున్నారు. హోదా ఇవ్వడం అన్నది కూటమి నుంచి జరిగేది కాదని తెలుసు. అయినా కొంతవరకూ లాగారు ఇపుడు తెగే దాకా వ్యవహారం వస్తోంది. పైగా వైసీపీయే ఇబ్బంది పడేలా ఉంది. జనాలలో సైతం వ్యతిరేకత వచ్చేలా ఉందనే వెనక్కి తగ్గేరా అని అంటున్నారు.

సభకు హాజరైతేనే కదా :

అయితే స్పీకర్ మాట్లాడేందుకు ఎంత సమయం ఇస్తారో ముందుగా చెబుతారా అన్నది కూడా చర్చగా ఉంది. సభకు హాజరైతే అక్కడ వైసీపీ ఎమ్మెల్యేలు కానీ జగన్ కానీ లేవనెత్తే ఇష్యూని బట్టే తగిన సమయం స్పీకర్ ఇస్తారా లేదా అన్నది తేలుతుంది అని అంటునారు. నిజానికి సభాపతి స్థానంలో ఉన్న వారు ఒక సభ్యుడిని అయిదు నిముషాలు మాట్లాడమని కోరినా పది నుంచి పదిహేను నిముషాలు మాట్లాడిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయని అంటున్నారు. అయితే అన్ని సందర్భాలలో ఇది కుదిరే వ్యవహారం కాదు, అయితే ముఖ్యమంత్రి సభా నాయకుడిగా ఎంత సేపు అయినా మాట్లాడేందుకు వీలు ఉంటుంది. అదే విధంగా ప్రతిపక్ష నేతకు కూడా ఆస్కారం కల్పించాలన్నది జగన్ వాదనగా ఉంది అని అంటున్నారు. కానీ ఆ విధంగా చేస్తారా జరిగే పనేనా అన్నది కూడా ఇపుడు చర్చగా ఉంది. ఏది ఏమైనా ఎమ్మెల్యేలకు ఇచ్చే సమయం మాత్రమే ఇస్తే తమకు సభకు వచ్చినా రాకపోయినా ఏముంది అన్నది వైసీపీ వాదనగా ఉంది. అయితే ఈ వాదన అన్నది నిజమని జనాలకు చూపించేందుకు అయినా కొన్ని అసెంబ్లీ సెషన్స్ సభకు వస్తేనే వైసీపీ మీద ఉన్నది నిందా నిజమా అన్నది తేలుతుందని అంటున్నారు. మొత్తానికి వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ తో సహా సభకు వెళ్ళడమే కరెక్ట్ అన్న మాట అయితే అంతటా విన్వస్తోంది.