Begin typing your search above and press return to search.

వైరల్ వీడియో... స్పీచ్ మధ్యలో జగన్ యోగా..!

అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్.. స్పీచ్ మధ్యలో యోగా చేశారు. ఇది వైరల్ అయ్యింది.

By:  Raja Ch   |   19 Dec 2025 1:52 PM IST
వైరల్  వీడియో... స్పీచ్  మధ్యలో జగన్  యోగా..!
X

మీడియా ముందు మాట్లాడుతున్న క్రమంలో చాలామంది నాయకులు తమదైన శైలిలో నవ్వులు పూయిస్తుంటారు. ఇందులో జగన్ ఒకరు. ఆ మధ్య "పుష్ప" సినిమా మేనరిజం చేసి చూపించడం ఇందుకు ఒక ఉదాహరణ. ఈ క్రమంలో... ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తూ కోటి సంతకాల పత్రాలను గవర్నర్ కు అందించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ మధ్యలో యోగా చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి.

అవును... ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీల ద్వారా అభివృద్ధి చేయడం అని ప్రభుత్వం ఓ పక్క చెబుతుంటే.. కాదు కాదు అది పూర్తిగా ప్రైవేటుపరం చేయడమే అని, దాన్ని నిరసిస్తూ వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లోనూ కోటికి పైగా సంతకాలను సేకరించి, ఆ ప్రతులను గవర్నర్ కు అందించింది. అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్.. స్పీచ్ మధ్యలో యోగా చేశారు. ఇది వైరల్ అయ్యింది.

ఈ సందర్భంగా.. రుషికొండకు ఖర్చు చేసిన డబ్బులతో రెండు మెడికల్ కాలేజీలు నిర్మించొచ్చు అంటూ ప్రభుత్వం చేస్తున్న విమర్శలపై ప్రశ్నిచగా.. స్పందించిన జగన్... తాము 230 నుంచి 240 కోట్ల రూపాయలతో విశాఖకు తలమానికమైన బిల్డింగ్ లను కట్టామని.. గవర్నర్, ప్రధాని, రష్యా ప్రెసిడెంట్ పుతిన్ వచ్చినా ఆ బిల్డింగుల్లో ఉండొచ్చని అన్నారు. తాను ఖర్చు చేసిన సొమ్ము వల్ల విశాఖకు సరికొత్త అందం వచ్చిందని చెప్పుకొచ్చారు.

అయితే.. అదే చంద్రబాబు కేవలం ఒక్క రోజు యోగా కోసం రూ.330 కోట్లు ఖర్చు చేశారని.. ఆ యోగా ప్యాడ్ లకు ఖర్చు ఎంత అనేది ఒకసారి ఏఐతో, అమెజాన్ లో చూసినా.. వారు పెట్టిన ఖర్చు అందులో సగం కూడా ఉండదని అన్నారు. ఈ గ్యాప్ లో తాను చేసిన ఖర్చు విశాఖకు తలానికంగా ఉంటే.. చంద్రబాబు మాత్రం యోగాకు ఇంత ఖర్చు పెట్టారంటూ.. కళ్లు మూసుకుని యోగా స్టైల్లో ఓ ఫోజు ఇచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.