మోడీ డెసిషన్ శభాష్ అన్న జగన్ !
జీఎస్టీ పన్నుల తగ్గింపు అన్నది పేదలకు ఎంతో మేలు చేస్తుందని జగన్ చెప్పుకొచ్చారు. అంతే కాదు మధ్యతరగతి వర్గాలకు కూడా దీని వల్ల ఉపయోగం ఉందని అన్నారు.
By: Satya P | 22 Sept 2025 5:00 PM ISTవైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ రియాక్ట్ అయ్యారు. అది కూడా ఒక కీలకమైన విషయం మీదనే ఆయన తన స్పందనను వ్యక్తం చేశారు ఈ రోజు అంటే సెప్టెంబర్ 22 నుంది దేశవ్యాప్తంగా అమలు అవుతున్న జీఎస్టీ రెండవ తరం సంస్కరణలు గురించి ఆయన ట్వీట్ చేశారు. మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద ఆయన సానుకూలంగానే స్పందించారు. ఇది చాలా స్వాగతించదగిన నిర్ణయం అన్నారు.
పేదలకు మేలుగా :
జీఎస్టీ పన్నుల తగ్గింపు అన్నది పేదలకు ఎంతో మేలు చేస్తుందని జగన్ చెప్పుకొచ్చారు. అంతే కాదు మధ్యతరగతి వర్గాలకు కూడా దీని వల్ల ఉపయోగం ఉందని అన్నారు. ఇది ఒక విప్లవాత్మకమైన నిర్ణయం అన్నారు. అంతే కాకుండా పన్నులు సరళంగా న్యాయబద్ధంగా ఉన్నాయని చెప్పారు. పన్నుల వ్యవస్థలో ఇది ఒక విప్లవాత్మకమైన నిర్ణయంగా ఆయన చెప్పారు. జీఎస్టీ పన్నులు ప్రతీ సామాన్యుడుకి ఎంతగానో ఉపకరిస్తాయని అన్నారు. ప్రాధమికంగా అయితే కొన్ని ఫిర్యదులు ఉండొచ్చు కానీ ఇది ఒక ప్రక్రియ అని జగన్ అన్నారు. ఆర్ధిక వ్యవస్థలో వినియోగానికి మరిన్ని పెట్టుబడులకు అవసరం అయిన ప్రోత్సాహాన్ని అందిస్తాయని ఆశిస్తున్నాను అన్నారు. దీని పూర్తి ప్రయోజనాలు చివరి వినియోగదారుడి దాకా చేరుకుంటాయని తాను ఆశిస్తున్నాని అని జగన్ ట్వీట్ ముగించారు.
లేట్ గా అయినా :
ఇక జగన్ లేట్ గా అయినా లేటెస్ట్ గానే రియాక్ట్ అయ్యారు అని అంటున్నారు.నిజానికి పది రోజుల నుంచే జీఎస్టీ పన్ను తగ్గింపుల మీద దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. అన్ని రాజకీయ పార్టీలు తన స్పందనను తెలియచేశాయి. ఇక కూటమి నేతలు అయితే ఘనంగా స్వాగతిస్తున్నారు. వైసీపీని ఈ విషయంలో విమర్శించారు కూడా జీఎస్టీ గురించి అవగాహన ఉందా అని కూడా కామెంట్స్ వచ్చాయి. అయితే జగన్ జీఎస్టీ అమలు అయిన రోజునే తన రియాక్షన్ ఇచ్చారు.
మోడీకే జై అంటూ :
ప్రతిపక్షాలు జీఎస్టీ మీద స్వాగతం చెబుతూనే తమదైన విమర్శలు చేశాయి. కేంద్ర ప్రభుత్వం మీద కూడా వారు బాణాలు ఎక్కు పెట్టారు. కానీ జగన్ ఎలాంటి విమర్శ లేకుండా డైరెక్ట్ గానే మోడీ డెసిషన్ గుడ్ అనేశారు. ఒక విధంగా జై కొట్టేశారు. ఈ విషయంలో ఎలాంటి శషబిషలకు ఆయన పోదలచుకోలేదని అంటున్నారు. ఒక మంచి నిర్ణయం ప్రజలకు పేదలకు ఇందులో న్యాయం జరిగింది కాబట్టి వెల్ కం చెప్పారని అంటున్నారు. అలా మోడీ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న్న జీఎస్టీ సంస్కరణలకు ఏపీలో ఎన్డీయే పక్షాలతో పాటు వైసీపీ కూడా ఆహ్వానించినట్లు అయింది అని అంటున్నారు.
