Begin typing your search above and press return to search.

రాజమండ్రి భరత్ కి జగన్ ఇచ్చే సందేశం ?

ఈసారి ఎంపీ ఎమ్మెల్యే సీట్ల విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని జగన్ ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.

By:  Satya P   |   7 Dec 2025 9:09 AM IST
రాజమండ్రి భరత్ కి జగన్ ఇచ్చే సందేశం ?
X

రాజమండ్రి నుంచి యువ నాయకుడిగా భరత్ ఉన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆయనను ఏరి కోరి రాజమండ్రి ఎంపీ సీటు నుంచి జగన్ 2019 ఎన్నికల్లో పోటీ చేయించారు. ఈ సామాజిక సమీకరణ బ్రహ్మాండంగా పనిచేసింది. ఆ ఎంపీ సీటుతో పాటు ఆ పరిధిలో మెజారిటీ సీట్లు వైసీపీ గెలుచుకుని విజయ ఢంకా మోగించింది. అప్పట్లో వైసీపీ వేవ్ కూడా బాగా పనిచేసింది. అయితే 2024 ఎన్నికల్లో అన్నీ తారు మారే అయ్యాయి. సీట్ల షిఫ్టింగ్ బదిలీలు ఇలా అనేక పరిణామాలు జరిగిపోయాయి. దానికి తోడు అయిదేళ్ళ పాలన మీద యాంటీ ఇంకెంబెన్సీ సైతం తట్టుకోలేని పరిస్థితిని తెచ్చింది. అలా కోలుకోలేని దెబ్బ అయితే ఎన్నికల్లో వైసీపీ చవి చూసింది అని విశ్లేషణలు ఉన్నాయి.

జగన్ మదిలో అదే :

ఈసారి ఎంపీ ఎమ్మెల్యే సీట్ల విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని జగన్ ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. అంతే కాదు ఎక్కడా మొహమాటాలకు పోవడాలు అసలు లేవని అంటున్నారు పని మంతులకే సీట్లు అని ఇప్పటి నుంచే చెబుతున్నారు. అంతే కాదు సామాజిక సమీకరణలు, పార్టీ పట్ల వారికి ఉన్న కమిట్ మెంట్, అలాగే జనంలో ఉన్న గ్రాఫ్ ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని టికెట్ ఇవ్వాలని చూస్తున్నారు అని చెబుతున్నారు. దాంతో పాటుగా బలమైన ఎంపీ అభ్యర్థులను వచ్చే ఎన్నికల్లో పోటీకి దించాలని జగన్ భారీ స్కెచ్ గీస్తున్నారు అని అంటున్నారు.

ఆ ప్రభావంతోనే :

ఎపుడైనా ఎంపీ సీట్లో బలమైన క్యాండిడేట్ ఉంటే ఆ ప్రభావం కచ్చితంగా అసెంబ్లీ ఎన్నికల మీద పడుతుంది అని అంటున్నారు. అందుకే మొత్తం పాతిక ఎంపీ సీట్లకు గానూ సమర్ధవంతమైన నేతలను ఇప్పటి నుంచే వేటాడే పనిలో ఉన్నారని అంటున్నారు. అందులో కొందరికి అయితే ముందే చెప్పేసి మీ పనిలో మీరు ఉండాలని సూచిస్తున్నారు అని అంటున్నారు. ఆ విధంగా రాజమండ్రికి చెందిన మాజీ ఎంపీ భరత్ విషయంలో జగన్ స్పష్టమైన సందేశం ఇస్తారని అంటున్నారు. ఈసారి పోటీ చేసేది ఎంపీ సీటుకే సుమా అని ఆయనకు ముందే చెప్పాలని అనుకుంటున్నారుట.

గతసారి అలా :

ఇక వెనక్కి వెళ్తే 2024 ఎన్నికల్లో రాజమండ్రి అర్బన్ నుంచి మార్గాని భరత్ ని పోటీ చేయించారు. ఆయన కూడా ఎమ్మెల్యే అయి మంత్రి కావాలని భావించారు. కానీ మొత్తం సీన్ రివర్స్ అయింది అని ఫ్లాష్ బ్యాక్ చెబుతోంది. దాంతో ఈసారి భరత్ సైతం పార్లమెంట్ మెట్లు ఎక్కాలనే చూస్తున్నారు అన్న మాట ఉంది. అయితే ఆయన అనుచరులు మాత్రం ఎమ్మెల్యేగానే పోటీ చేయాలని సూచిస్తున్నారుట. కానీ జగన్ మాత్రం భరత్ విషయంలో ఎంపీ అయితేనే బాగుంటుంది అని సీరియస్ గానే ఆలోచిస్తున్నారని అంటున్నారు. దాంతో భరత్ కి ఆ దిశగానే వెళ్ళమని చెబుతారని అంటున్నారు. ఇదే తీరున గోదావరి జిల్లాలలో మరికొంతమందికి ఎంపీకి పోటీ చేయించాలని చూస్తున్నారు అని అంటున్నారు. చూఒడాలి మరి ఈసారి వైసీపీ ఆలోచనలు వ్యూహాలు ఎలా పనిచేయబోతున్నాయో.